రామ్‌దిన్‌కు ఉద్వాసన | Ramdin dropped from West Indies squad for India series | Sakshi
Sakshi News home page

రామ్‌దిన్‌కు ఉద్వాసన

Published Wed, Jul 13 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM

Ramdin dropped from West Indies squad for India series

భారత్‌తో సిరీస్‌కు విండీస్ జట్టు ప్రకటన
బస్సెటెర్రో: భారత్‌తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌కు సీనియర్ వికెట్ కీపర్ దినేష్ రామ్‌దిన్‌కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో జాతీయ జట్టుకు తొలిసారిగా రోస్టన్ చేస్ ఎంపికయ్యాడు. రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో చేస్ భారత్‌తో ఆడినా కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. అయితే అతడి ఫస్ట్ క్లాస్ సగటు 42.87 కావడంతో ఎంపిక చేశారు. 11 ఏళ్లుగా జట్టుకు ఆడుతున్న రామ్‌దిన్ గతవారమే తన ఉద్వాసన గురించి విండీస్ బోర్డుపై విమర్శలు ఎక్కుపెట్టాడు. పేసర్ కీమర్ రోచ్‌కు చోటు దక్కలేదు. షానన్ గాబ్రియల్ ఒక్కడే జట్టులో స్పెషలిస్ట్ పేసర్. ఈనెల 21 నుంచి తొలి టెస్టు జరుగుతుంది.
 
జట్టు: హోల్డర్ (కెప్టెన్), బ్రాత్‌వైట్, బిషూ, బ్లాక్‌వుడ్, కార్లోస్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, రాజేంద్ర చంద్రిక, చేస్, డోరిచ్, గాబ్రియల్, జాన్సన్, శామ్యూల్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement