దీటుగా ఆడుతున్న యూపీ | Uttar pradesh players are performing very well in practise match | Sakshi
Sakshi News home page

దీటుగా ఆడుతున్న యూపీ

Published Sat, Nov 2 2013 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM

దీటుగా ఆడుతున్న యూపీ

దీటుగా ఆడుతున్న యూపీ

కోల్‌కతా: భారత్‌తో టెస్టు సిరీస్ కోసం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న వెస్టిండీస్ జట్టును ఉత్తర ప్రదేశ్ ఆటగాళ్లు దీటుగా ఎదుర్కొంటున్నారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ పర్వీందర్ సింగ్ (101 బంతుల్లో 78 బ్యాటింగ్; 11 ఫోర్లు; 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు. దీంతో ఈ మూడు రోజుల మ్యాచ్‌లో శుక్రవారం ఆట ముగిసే సమయానికి యూపీ తమ తొలి ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో ఐదు వికెట్లకు 206 పరుగులు సాధించింది.
 
  ఓపెనర్ ముకుల్ డాగర్ (74 బంతుల్లో 42; 8 ఫోర్లు) శుభారంభాన్నిచ్చాడు. 96 పరుగులకు నాలుగు వికెట్లు పడిన దశలో పర్వీందర్.. ప్రశాంత్ గుప్తా (86 బంతుల్లో 39; 6 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఓపిగ్గా విండీస్ బౌలర్లను ఎదుర్కొని ఐదో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. పెరుమాళ్‌కు రెండు వికెట్లు పడ్డాయి.
 
 అంతకుముందు 333/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన విండీస్ 103.3 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటయింది. సీనియర్ బ్యాట్స్‌మన్ చందర్‌పాల్ (153 బంతుల్లో 112; 15 ఫోర్లు; 2 సిక్స్‌లు) చక్కటి సెంచరీతో ఆకట్టుకున్నాడు. దేవ్ నారాయణ్ (129 బంతుల్లో 94; 10 ఫోర్లు; 2 సిక్స్) తృటిలో శతకాన్ని కోల్పోయాడు. ఈ జోడి ఐదో వికెట్‌కు 197 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇంతియాజ్ అహ్మద్ వీరిని ఎల్బీగా అవుట్ చేశాడు. చివర్లో టినో బెస్ట్ (28 బంతుల్లో 35; 3 ఫోర్లు; 3 సిక్స్) రెచ్చిపోవడంతో జట్టుకు వేగంగా పరుగులు వచ్చాయి. ఇంతియాజ్ ఐదు వికెట్లు, ఆర్పీ సింగ్ మూడు వికెట్లు తీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement