కోల్‌కతా: ఉత్తరప్రదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ (48 బంతుల్లో 58; 11 ఫోర్లు), మార్లన్ శామ్యూల్స్ (47 బంతుల్లో 58; 9 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించగా చివరి రోజు శనివారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లలో ఐదు వికెట్లకు 199 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన గేల్ ఈసారి ఆకట్టుకున్నాడు. దినేశ్ రామ్‌దిన్ (53 బంతుల్లో 41; 5 ఫోర్లు; 1 సిక్స్) నిలకడగా ఆడాడు. పీయూష్ చావ్లాకు నాలుగు వికెట్లు దక్కాయి. అంతకుముందు 206/5 ఓవర్‌నైట్ స్కోరుతో తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన యూపీ 372/9 వద్ద డిక్లేర్డ్ చేసింది. పర్వీందర్ సింగ్ (112; 17 ఫోర్లు; 2 సిక్స్) శతకాన్ని సాధించాడు. ఆమిర్ ఖాన్ (128 బంతుల్లో 47; 7 ఫోర్లు), పీయూష్ చావ్లా (58 బంతుల్లో 46; 9 ఫోర్లు) చివర్లో రాణించారు. పెరుమాల్, కాట్రెల్ లకు మూడు, బెస్ట్‌కు రెండు వికెట్లు దక్కాయి.
కాన్పూర్‌లో భారత్, విండీస్ మూడో వన్డే
న్యూఢిల్లీ: భారత, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ కాన్పూర్‌లో జరుగనుంది. ‘ఈనెల 27న జరిగే వన్డే మ్యాచ్ వేదికను ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌కు కేటాయిస్తున్నట్టు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ నాతో చెప్పారు’ అని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు.
రాణించిన గేల్, శామ్యూల్స్
Published Mon, Nov 4 2013 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
Advertisement
Advertisement