భారత్పై వెస్టిండీస్ ఘనవిజయం
కోచి: నెహ్రూ స్టేడియంలో భారత్కు వెస్టిండీస్కు మధ్య బుధవారం జరిగిన వన్డే మ్యాచ్లో వెస్టిండీస్ 124 పరుగుల తేడాతో భారత్పై ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్లో 1-0తో వెస్టిండీస్ అధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. స్కోరుబోర్డును పరుగులు పెట్టించిన వెస్టిండీస్ ఆటగాడు శ్యామూల్స్ 126 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దాంతో శ్యామూల్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. వెస్టిండీస్ మిగతా ఆటగాళ్లు రామ్దిన్ (61), స్మిత్ (46), డీఎమ్ బ్రేవో (28) పరుగులకే పెవీలియన్ చేరగా, సమ్మీ (10) నాటౌట్గా నిలిచాడు. కాగా, పొలార్డ్, రసెల్ సింగల్ డిజిట్కే పరిమితమైయ్యారు. భారత్ బౌలర్లలో మహ్మద్ సమీ 4 వికెట్లు తీయగా, జడేజా, అమిత్ మిశ్రా తలో వికెట్ తీసుకున్నారు.
వెస్టిండీస్ నిర్దేశించిన 321 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత్ శతవిధాలా శ్రమించింది. కానీ వెస్టిండీస్ బౌలర్ల విసిరే బంతుల మాయాజాలానికి ధోనీసేన ఉక్కిరిబిక్కిరైంది. భారత్ ఆటగాడు ధావన్ 68 పరుగులు చేయడం భారత్కు కొంత ఊరట కలిగించన మిగతా ఆటగాళ్లు పేలవంగా ఆడటంతో 197 పరుగులకే భారత్ ఆలౌటై ఓటమిపాలైంది. భారత్ ఆటగాళ్లు రహెనె 24, ధోనీ 8 పరుగులు చేయగా, జడేజా 33 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో రాంపాల్, బ్రేవో, శ్యాముల్స్ తలో రెండు వికెట్లు తీయగా, టైలర్, రసెల్, సమిలు తలో ఒక వికెట్ తీశారు.