
విండీస్ కెప్టెన్ స్యామీకి అరుదైన గౌరవం
వెస్టిండీస్ జట్టుకు రెండుసార్లు టి20 ప్రపంచకప్ అందించినందుకు ఆ జట్టు కెప్టెన్ డారెన్ స్యామీకి అరుదైన గౌరవం లభించింది. అతడి సొంత దేశం సెయింట్ లూసియాలోని ప్రధాన క్రికెట్ స్టేడియానికి ఈ స్టార్ క్రికెటర్ పేరు పెట్టారు. ‘బ్యూసెజర్ క్రికెట్ మైదానాన్ని ఇకపై డారెన్ స్యామీ జాతీయ క్రికెట్ మైదానంగా పేరు మారుస్తున్నాం’ అని ఆ దేశ ప్రధాని కెన్ని. డి. ఆంథోని ప్రకటించారు.