వెస్టిండీస్ పేసర్ అల్జరీ జోసఫ్‌కు ఐసీసీ షాకిచ్చింది. డిసెంబర్ 8న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌కు ముందు ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 1ని ఉల్లంఘించినందుకు గానూ జోసఫ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. అదనంగా జోసఫ్ యొక్క క్రమశిక్షణా రికార్డుకు ఒక డీమెరిట్ పాయింట్ జోడించబడింది.
ఐసీసీ నివేదిక ప్రకారం.. మ్యాచ్ ప్రారంభానికి ముందు జోసఫ్ స్పైక్‌లతో పిచ్‌పై అడుగు పెట్టకుండా ఉండమని ఫోర్త్ అంపైర్ సూచించాడు. అయితే ఇది పట్టించుకోని జోసఫ్ స్పైక్‌లతో పిచ్‌పై అడుగుపెట్టడంతో పాటు అంపైర్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు.
ఈ చర్య ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3ని ఉల్లంఘణ కిందకు వస్తుంది. జోసఫ్ తన నేరాన్ని అంగీకరించినట్లు మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో తెలిపాడు. జోసఫ్ గత 24 నెలల వ్యవధిలో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం ఇది రెండో సారి.
ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 47.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (113) మెరుపు శతకం బాది విండీస్‌ను గెలిపించాడు. ఈ సిరీస్‌లో రెండో వన్డే ఇవాళ (డిసెంబర్ 10) జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 5 ఓవర్లు పూర్తయ్యే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోయి 34 పరుగులు చేసింది. తంజిద్ హసన్(30), లిటన్ దాస్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment