Alzarri Joseph
-
విండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
క్రికెట్ చరిత్రలో నూతన ఒరవడికి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు శ్రీకారం చుట్టింది. గత సీజన్లో కనబరిచిన అసాధారణ ప్రదర్శన ఆధారంగా తొమ్మిది మంది క్రికెటర్లకు ఏకంగా రెండేళ్ల కాంట్రాక్టును ఇచ్చింది. కాగా సాధారణంగా ఏ క్రికెట్ బోర్డు అయినా తమ ఆటగాళ్లకు ఏడాది పాటే కాంట్రాక్టే ఇస్తుంది. రెండేళ్ల కాంట్రాక్టు పొందినది వీరేప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా సంవత్సరకాలానికే సెంట్రల్ కాంట్రాక్టు ఇస్తుంది. ఆ ఏడాదికి సంబంధించిన ఆటతీరును బట్టే తదుపరి ఏడాది గ్రేడ్‌ను నిర్ణయించి కాంట్రాక్టు ఖరారు చేస్తుంది. అయితే, విండీస్ బోర్డు ఇందుకు భిన్నంగా రెండేళ్లకు కాంట్రాక్టు ఇవ్వడం విశేషం. ఈ జాబితాలో ఆరుగురు పురుషులు కాగా, ముగ్గురు మహిళా క్రికెటర్లు ఉన్నారు. ఇక.. క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) 15 మంది చొప్పున మహిళా, పురుషుల క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్టులు కట్టబెట్టింది. అదనపు కాంట్రాక్టు పొందిన వారిలో పురుషుల జట్టు వైస్ కెప్టెన్ అల్జారీ జోసెఫ్, పేస్ నయా సంచలనం షమర్ జోసెఫ్, హిట్టర్లు షై హోప్, బ్రాండన్ కింగ్, గుడకేశ్ మోతీ, సిలెస్ ఉన్నారు. మిగతా వారికి ఏడాదికేఅదే విధంగా.. మహిళల జట్టుకు సంబంధించి కెప్టెన్ హేలీ మాథ్యూస్, వైస్ కెప్టెన్ షెమైన్ క్యాంప్‌బెల్, స్టెఫానీ టేలర్ ఉన్నారు. 15 మందిలో ఎంపికైన మిగతా వారికి ఎప్పట్లాగే ఏడాది కాంట్రాక్టు లభించింది. చదవండి: సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకొన్న సౌతాఫ్రికా స్టార్ -
అనూహ్యం: వన్డే క్రికెట్ చరిత్రలో మూడోసారి..
లండన్: వెస్టిండీస్ ఓపెనర్ ఎవిన్ లూయీస్ మెరుపు బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించినా.. బౌలింగ్‌లో అల్జారి జోసెఫ్ ఐదు వికెట్లతో చెలరేగినా ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. వరుణుడు ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఎవరూ ఊహించని రీతిలో నాలుగో వన్డేలో విండీస్‌పై ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది. విండీస్ తరఫున సెంచరీతో పాటు ఐదు వికెట్ల ఇన్నింగ్స్ నమోదైనా వరుణుడు మ్యాచ్‌కు అంతరాయం కలిగించడంతో ఆ జట్టు ఓటమిపాలైంది. తద్వారా ఓవరాల్‌గా వన్డే క్రికెట్లో ఇలాంటి ఫలితం రావడం ఇది మూడోసారి. మరొకవైపు వన్డేల్లో ఈ తరహా అరుదైన ఓటమిని రెండోసారి చవిచూసిన జట్టుగా విండీస్ నిలిచింది. ఆ విశేషాలిలా... ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో తొలుత విండీస్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ లూయీస్ (130 బంతుల్లో 176 రిటైర్డ్‌హర్ట్; 17 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరోచిత సెంచరీ చేయడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు సాధించింది. ఆపై విండీస్ బౌలర్ అల్జారి జోసెఫ్ ఐదు వికెట్ల ఇన్నింగ్స్ (5/56 )తో చెలరేగడంతో ఇంగ్లండ్ 181 పరగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆరో వికెట్‌కు బట్లర్ 43 నాటౌట్, మొయిన్ అలీ 48 నాటౌట్లు 77 పరుగుల జోడించారు. 35.1 ఓవర్లలో 258 పరుగుల వద్ద వరుణుడు ఆటకం కలిగించడంతో మ్యాచ్ కొనసాగలేదు. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 35.1 ఓవర్లలో ఇంగ్లండ్ విజయక్ష్యం 253గా నిర్ణయించడంతో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. గతంలో రెండు పర్యాయాలు.. ఇదే ఫలితం 1991-1992లో షార్జాలో వెస్టిండీస్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలిసారి ఇలాంటి ఫలితం వచ్చింది. విండీస్ జట్టులో ఓ ఆటగాడు సెంచరీ సాధించడం, అదే జట్టు బౌలర్ ఐదు వికెట్లతో చెలరేగినా కరీబియన్లకు నిరాశే ఎదురైంది. తొలుత 50 ఓవర్లలో పాక్ 7 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. 237 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లాడి 235 పరగులకు ఆలౌట్ అయి పరుగుతేడాతో ఓటమిపాలైంది. విండీస్ ఆటగాడు రిచి రిచర్డ్సన్ శతకం (122)తో పాటు బౌలింగ్‌లో ఆంబ్రోస్ (5/53)తో చెలరేగినా ఓటమి తప్పలేదు. 2005-2006 సీజన్లలో జోహెన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఐదో వన్డేలో రికార్డు పరుగులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో తొలుత ఆస్ట్రేలియా జట్టు రికీ పాంటింగ్ శతకం (164)తో రాణించడంతో ఆ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 434 పరుగులు చేసింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను ఆసీస్ బౌలర్ నాథన్ బ్రాకెన్ ఐదు వికెట్ల ఇన్నింగ్స్ (5/67)తో చెలరేగి కట్టడి చేసినా ప్రయోజనం లేకపోయింది. సఫారీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (90), గిబ్స్ భారీ శతకం (175 పరుగులు)తో అద్భుత విజయం సాధించింది. సిరీస్‌ను సఫారీలు 3-2తో కైవసం చేసుకున్నారు. -
భారత్‌పై పోరుకు విండీస్ యువ అస్త్రం
తొలి టెస్టులో భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన వెస్టిండీస్ రెండో టెస్టు కోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ఓ యువ కెరటాన్ని భారత్‌పై అస్త్రంగా ప్రయోగించడానికి సిద్ధమైంది. పేస్ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు యువ బౌలర్ కు అవకాశం కల్పించారు. గతేడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్ లో విండీస్ కు ప్రాతినిధ్యం వహించిన టీనేజ్ సంచలనం అల్జారీ జోసెఫ్‌కు అవకాశం లభించింది. ఆ ప్రపంచకప్ లో రాణించిన బౌలర్లలో జోసెఫ్ ఒకడు. 6.4 అడుగులు ఉండే ఈ యువ బౌలర్ అండర్-19 కప్ లో 13 వికెట్లు తీయడంతో పాటు ఫాస్టెస్ట్ బాల్ 91.5 మీటర్ల వేగంతో విసిరాడు. బౌలింగ్ దిగ్గజం జోయెల్ గార్నర్ మేనేజర్ గా ఉన్న విండీస్ జాతీయ జట్టులో అతడు మరింత రాణించే అవకాశం ఉందని విండీస్ క్రికెట్ సెలక్షన్ ప్యానెల్ చైర్మన్ కోర్ట్నీ బ్రైన్ అభిప్రాయపడ్డాడు. జోసెఫ్ చేరికతో బౌలింగ్ విభాగం మరింత పటిష్టం అవ్వాలని, సిరీస్ లో మిగతా మూడు టెస్టుల్లోనూ జట్టు విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. రెండో టెస్టు కింగ్స్టన్లోని సబినా పార్క్ స్టేడియంలో శనివారం జరగనుంది.