Samira
-
బ్యూటీఫుల్ ఫాదర్ అండ్ డాటర్
ఆటవిడుపులో భాగంగా సెలబ్రిటీలు కుటుంబంతో గడిపే సంతోష సమయాలు వారికి మాత్రమే పరిమితమైనవి కాదు. అభిమానులకు కూడా సంతోషం కలిగిస్తాయి. ‘క్రికెటర్‌గా రోహిత్‌శర్మ ఏమిటి?’ అని చెప్పడానికి బోలెడు సమాచారం ఉంది. ‘తండ్రిగా రోహిత్ ఏమిటి?’ అని చెప్పడానికి ఈ వైరల్ ఫొటో ఒక్కటి చాలు. ‘ఫాదర్స్ డే’ సందర్బంగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సముద్రపు ఒడ్డున తన కూతురు సమైరతో కలిసి రోహిత్‌శర్మ ఇసుకలో పిచ్చుక గూడు కడుతున్న ఫొటో ‘ఆహా’ అనిపిస్తోంది. ఈ ఫొటోకు ‘ఫ్యామిలీ టైమ్ ఈజ్ ది బెస్ట్ టైమ్’ అని కాప్షన్ ఇచ్చారు నెటిజనులు.‘ది ఫాదర్, ది కెప్టెన్, ది హిట్‌మ్యాన్, ది భయ్యా, ది ఓపెనర్’ అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.మరో యూజర్ ‘బ్యూటీఫుల్ డాటర్ అండ్ ఫాదర్. లవ్ యూ మై మ్యాన్’ అని కామెంట్ పెట్టాడు. -
వితిన్ వన్ మంత్... డాడీ మళ్లీ నవ్వుతాడు!
వరల్డ్ కప్ ఫైనల్ ఫలితం ‘అయ్యయ్యో’ అనిపించింది. కన్నీళ్ల పర్యంతం అయిన రోహిత్‌శర్మను చూసిన తరువాత ఈ ‘అయ్యయ్యో’లు రెట్టింపు అయ్యాయి. ఈ అయ్యయ్యోల సంగతి ఎలా ఉన్నా రోహిత్‌శర్మ కూతురు సమైర వీడియో క్లిప్ ఇంటర్నెట్లో నవ్వుల పువ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో... సమైర తల్లితో కలిసి వస్తుంటే రోహిత్ గురించి ‘ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు?’ అని ఎవరో అడిగారు. ‘రూమ్‌లో ఉన్నారు. వితిన్ వన్ మంత్ ఆయన మళ్లీ నవ్వుతాడు’ అన్నది సమైర. ఈ చిన్నారి పెద్దరికానికి నెటిజనులు మురిసిపోతున్నారు. ఇంతకీ ఇది తాజా వీడియో కాదు. గత ఏడాది ఏదో సందర్భంలో ఒక అభిమాని షేర్ చేసిన వీడియో. అయితే మాత్రం ఏమిటీ తాజా పరిస్థితికి జిరాక్స్‌లా ఉంది. The way she answered 🥹❤ Samaira said : He is in a room, he is almost positive & within one month he will laugh again.@ImRo45 pic.twitter.com/yt3iSQa6MP — 46thcenturywhenRohit (@RohitCharan_45) November 23, 2023 -
కొక్కొరొకోడింగ్
ఆరేళ్ల ప్రాయంలోనే కోడింగ్ నేర్చుకుని వండర్ కిడ్ అనిపించుకున్న సమైరా మెహతా.. ఎనిమిదేళ్లు వచ్చేసరికే ఓ ప్రత్యేకమైన బోర్డ్ గేమ్ రూపొందించి ఔరా అనిపించింది. తనకున్న నైపుణ్యాన్ని ఇతర పిల్లలకు కూడా అందించేందుకు గూగుల్ ‘కీనోట్ స్పీకర్’గా మారి సిలికాన్ వ్యాలీలో చిన్నారుల చురుకుదనాన్ని మేలుకొలుపుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ఇండో– అమెరికన్. ‘కోడర్‌బన్నీజ్’ సీఈఓ ఐఐటీ– ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన రాకేశ్ మెహతా (ప్రస్తుతం ఇంటెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ హెడ్– కాలిఫోర్నియా) తన ఇద్దరు పిల్లలు సమైరా, ఆదిత్లకు బాల్యం నుంచే టెక్ పాఠాలు నేర్పించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కోడింగ్‌పై పట్టు సాధించిన సమైరా ఎనిమిదేళ్ల ప్రాయంలోనే.. తోటి పిల్లలకు కోడింగ్ పాఠాలు నేర్పించేందుకు వీలుగా ‘కోడర్‌బన్నీజ్’ బోర్డ్ గేమ్‌ను రూపొందించింది. తద్వారా 2016లో థింక్ ట్యాంక్ నిర్వహించిన ‘పిచ్ఫెస్ట్’లో రెండో బహుమతి గెలుపొంది 2500 డాలర్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘కోడర్‌బన్నీజ్’ పేరు మీదుగానే ఓ సంస్థను స్థాపించి తన బోర్డ్ గేమ్‌ను అమెజాన్‌లో అమ్మడం మొదలుపెట్టింది. దీనికి అనూహ్య స్పందన లభించడంతో యంగ్ సీఈఓ సమైరా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.ప్రస్తుతం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజిన్స్– ఏఐ) కోడింగ్‌పై దృష్టి సారించిన సమైరా ప్రస్తుతం ‘కోడర్మైండ్స్’ అనే కొత్త బోర్డ్ గేమ్‌ను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఈ గేమ్ ద్వారా రోబోట్స్ తయారుచేసేందుకు అవసరమైన ప్రాథమిక అంశాలను (ఏఐ మోడల్ అభ్యాసం) సులభంగా నేర్చుకోవచ్చు. అయితే ఈ గేమ్ రూపకల్పనలో సమైరా తమ్ముడు ఆదిత్ (6) కూడా తన వంతు సహాయం చేస్తుండటం విశేషం. రియల్ లైఫ్ పవర్పఫ్ గర్ల్ సమైరా ప్రతిభకు ఫిదా అయిన దిగ్గజ సంస్థ గూగుల్ ఆమెను సిలికాన్ వ్యాలీలో తమ కీనోట్ స్పీకర్‌గా నియమించుకుంది. పిల్లలకు కోడింగ్ పాఠాలు నేర్పేందుకు ఆమె చేత వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ హెడ్‌క్వార్టర్స్ మౌంటేన్ వ్యూ (కాలిఫోర్నియా)లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ సంస్థ చీఫ్ కల్చరల్ ఆఫీసర్ స్టాసీ సలీవన్ సమైరాను కలిశారు. ఆమె వాక్చాతుర్యం, నైపుణ్యానికి ముచ్చటపడిన స్టాసీ.. ‘సమైరా ప్రతిభావంతురాలు. తొందర్లోనే గూగుల్‌లో పూర్తి స్థాయిలో ఆమె పనిచేసే అవకాశం ఉంది’ అంటూ కొనియాడారు. ఇక కార్టూన్ నెట్వర్క్ మార్కెటింగ్ విభాగం తమ చానల్ రూపొందించిన ‘యంగ్ ఇన్స్పైరింగ్ గరల్స్’ అనే కార్యక్రమంలో సమైరాకు చోటు కల్పించి.. ‘ద రియల్ పవర్పఫ్ గర్ల్’గా సమైరాను అభివర్ణించింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా సమైరా ప్రతిభను గుర్తించింది. ఆసక్తే తనను నిలిపింది ‘‘సమైరా ఇండియాస్ వండర్ కిడ్ అని నా స్నేహితులు అంటూ ఉంటారు. కానీ తను కూడా అందరిలాంటిదే. కాకపోతే కోడింగ్ పట్ల ఉన్న ఆసక్తి ఆమెను ప్రత్యేకంగా నిలిపింది. అయితే చిన్నతనంలోనే తను ఇంతటి పేరు ప్రతిష్టలు సంపాదించడం నాకు ఆనందంగా ఉన్నప్పటికీ.. కీర్తి తాలూకూ ప్రభావం తన మీద పడకూడదు అనుకుంటాను. ఒత్తిడి లేకుండా పనిచేస్తేనే సమైరా మరిన్ని విజయాలు సాధిస్తుంది’’ అని రాకేశ్ మెహతా కూతురి గురించి చెప్పారు. – సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్ డెస్క్ వంద కోట్ల మందికి నేర్పుతా ‘‘ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉంటూనే తమ పిల్లలు కోడింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలని భావిస్తున్నారు. అటువంటి వారికి కోడర్‌బన్నీజ్ వంటి నాన్– డిజిటల్ బోర్డ్ గేమ్స్ ఎంతో ఉపయోగకరం. ఈ ప్రపంచంలో ఉన్న సుమారు వంద కోట్ల మంది పిల్లలకు నా సంస్థ ద్వారా కోడింగ్ నైపుణ్యాలు నేర్పించడం నా ఉద్దేశం. నాకు తెలిసీ వాళ్లంతా కోడింగ్ చేయగలిగే సామర్థ్యం కలిగిన వారే. కాకపోతే వారి కోసం కొంచెం సమయం కేటాయించడంతో పాటుగా కోడర్‌బన్నీజ్ వంటి ఈజీ గేమ్‌ల అవసరం ఉంది. అమెజాన్ ద్వారా ఏడాదిలో వెయ్యి బాక్సుల బోర్డ్ గేమ్స్ అమ్మాను. దాని ద్వారా 35 వేల డాలర్ల ఆదాయం పొందాను. నేను ఆరేళ్ల వయసులోనే కోడింగ్ నేర్చుకున్నాను. ప్రస్తుతం కీనోట్ స్పీకర్‌గా కోడింగ్ మెళకువలు నేర్పుతున్నాను. ఈ క్రమంలో అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా, ఫేక్‌బుక్ సీఈఓలను కలవడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. కోడర్‌బన్నీజ్ ఐడియాను వారిరువురూ మెచ్చుకున్నపుడు ఎంతో గర్వంగా అన్పించింది. ప్రస్తుతం మా వెబ్సైట్లో రోబోటిక్స్, గేమ్, ఎడ్యుకేషన్ సెక్టార్లలో వివిధ అంశాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. వీటన్నింటిలో మా నాన్న పాత్ర ఎంతగానో ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడమే నా ఆశయం’’ అంటూ పదేళ్ల సమైరా తన అనుభవాలను పంచుకుంది. అంతేకాదు తన కంపెనీ పేరిట విరాళాలు సేకరించి అనాథలకు ఆశ్రయం కల్పిస్తూ పెద్ద మనసు చాటుకుంటోంది కూడా. – సమైరా (10) , ‘కోడర్‌బన్నీజ్’ సీఈఓ -
పన్నుశాఖ మన్నించింది
ట్రాన్స్జెండర్లు ఒక్కో అవరోధాన్నీతొలగించుకుంటూ వస్తున్నారు.అయితే ఇంకా అనేక రంగాలు వీరికోసం చట్టబద్ధమైన సాంకేతిక నిబంధనలు సడలించవలసి ఉంది. ఏ అప్లికేషన్ పూర్తి చేయాలన్నా అందులో మేల్, ఫిమేల్ కాలమ్‌లో టిక్ చేయాలి. మరి ట్రాన్స్జెండర్లు ఏం చేయాలి? ఏదో ఒకటి టిక్ చేసేస్తే సరిపోతుందా? సరిపోదు. అందుకే తమకు ప్రత్యేక కాలమ్ కేటాయించాలని ట్రాన్స్జెండర్లు చాలా కాలంగా అనేక శాఖలతో పోరాడుతున్నారు. ఒక్కో పోరాటం చేస్తూ, ఒక్కో హక్కు సాధించుకుంటున్నారు. 1994లో ఓటుహక్కు కోసం పోరాడారు, 2013 నాటికి అది ఆచరణలోకి వచ్చింది. ఓటర్ ఐడీ కార్డులో థర్డ్ జెండర్ లేదా ఇతరులు అని కాలమ్ పెట్టారు.అందుకోసం ట్రాన్స్‌జెండర్లంతా కలిసి ఓ పెద్ద ప్రదర్శననే చేయవలసి వచ్చింది. ఆ క్రమంలోనే ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. పుదుచ్చేరిలో ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారిక పోర్టల్‌లో ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఇంతవరకూ లేని ట్రాన్స్‌జెండర్ కాలమ్‌ని ఎట్టకేలకు పొందుపరుచుకోగలిగారు. ఈ విజయం వెనుక ఉన్నది డాక్టర్ సమీర మహమూద్ జాగిర్దార్. వృత్తిరీత్యా ఆమె డాక్టరు. పుదుచ్చేరి మహాత్మాగాంధీ మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో క్రిటికల్ కేర్ యూనిట్లో ఎమర్జన్సీ వార్డులో పనిచేస్తారు. ఇక్కడే చట్టబద్ధంగా తనను ‘అమ్మాయి’ నుంచి, ‘ట్రాన్స్‌జెండర్’గా మార్చుకున్నారు. అయితే పాన్‌ను ఆధార్‌కి జతపరిచేటప్పుడు పాన్‌లో ఆమె ‘మేల్’ అనీ, ఆధార్‌లో ‘ట్రాన్స్‌జెండర్’ అనీ ఉండటంతో సమీర జత చేయలేకపోయారు. అప్పుడే సమీర ఇంకో విషయం కూడా గ్రహించారు. ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కూడా అందులో థర్డ్ జెండర్ ప్లేస్‌లో ట్రాన్స్‌జెండర్ కాలమ్ లేదని! ముందుగా ఇన్‌కమ్‌ట్యాక్స్ ఫామ్‌లో ట్రాన్స్‌జెండర్ కాలమ్ పెట్టించాలనుకున్నారు. ఇందుకోసం సమీర ఎన్నోసార్లు విజ్ఞప్తులు పెట్టుకున్నారు. లాభం లేకపోయింది. చివరి ప్రయత్నంగా, పుదుచ్చేరి ఇన్‌కమ్‌ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జహనాబ్ అక్తర్‌ని నేరుగా కలిశారు. సమీర ఆలోచనను అర్థం చేసుకున్న జహనాబ్ అక్తర్ వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి, సమీర అభ్యర్థనను మన్నించారు. ఐటీ రిటర్న్స్‌లో ‘ట్రాన్స్‌జెండర్’ కాలమ్ పెట్టించారు. అలాగే పాన్ ఆధార్ లింక్ విషయంలో ట్రాన్స్‌జెండర్ కాలమ్ పెట్టేవరకు వారు లింక్ చేసుకోనక్కర్లేదు అనే మినహాయింపు ఇచ్చారు. - డాక్టర్ సమీర జహంగీర్ మహమూద్ జాగిర్దార్ -
ఔడదం చిత్ర ఆడియో ఆవిష్కరణ
తమిళసినిమా: ఔడదం చిత్రం గీతాలావిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక వడపళనిలోని ఆర్కేవీ.స్టూడియోలో జరిగింది. చిత్ర ఆడియోను దర్శకుడు పేరరసు ఆవిష్కరించగా తొలి సీడీని దర్శకుడు నితిలన్ అందుకున్నారు. రెడ్‌చిల్లీ బ్లాక్ పేపర్ సినిమాస్ పతాకంపై నేతాజీ కథ రాసి, నిర్మించి కథానాయకుడిగా నటించిన చిత్రం ఔడదం. ఢిల్లీకి చెందిన సమీరా కథానాయకిగా, సంతోష్ రెండవ కథానాయకుడిగానూ నటించిన ఈ చిత్రానికి కథనం, దర్శకత్వం బాధ్యతలను రమణి నిర్వహించారు. దర్శి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ద్వారా ప్రఖ్యాత రచయిత పట్టుకోట్టై కల్యాణసుందరం అన్న కొడుకు షణ్ముగసుందరం గీత రచయితగా పరిచయం అవుతున్నారు. ఆయనతో పాటు సింగపూర్ కల్వైందన్, తమిళ్ ముదన్, చో.శివకుమార్, విజయ్‌కృష్ణన్ ఈ చిత్రానికి పాటలు రాశారు. ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది మెడికల్ థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పారు. ప్రజలకు హాని కలిగించే మందులను తయారు చేసి అధికారులు, రాజకీయనాయకుల సహకారంతో వాటిని మార్కెటింగ్ చేసే సంఘద్రోహుల గురించిన చిత్రంగా ఔడదం చిత్రం ఉంటుందన్నారు. చెన్నైకి చెందిన ఇక మధుమేహ వైద్యుడు మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే మందులను నిషేధించేలా చేసి మళ్లీ అవి అమల్లోకి వచ్చే 10 రోజుల్లో జరిగే మెడికల్ థ్రిల్లర్ సంఘటనల సమాహారంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. చిత్రాన్ని కమర్శియల్ అంశాలతో పాటు ప్రజలకు మంచి సంధేశానిచ్చే చిత్రంగా ఔడదం చిత్రం ఉంటుందని తెలిపారు. జాగ్వుర్‌తంగం, శ్రీరామ్, కేవీ.గుణశేఖర్ పాల్గొన్నారు.