Shocking Video: Mysterious Triangle UFO Spotted On Skies In Islamabad, Goes Viral - Sakshi
Sakshi News home page

Mysterious UFO Video: ఆకాశంలో ఒక వింత!..అదేంటో అంతు చిక్కని రహస్యం!

Published Wed, Feb 23 2022 2:48 PM | Last Updated on Wed, Feb 23 2022 7:05 PM

viral video: Mysterious Object In The Sky Over Islamabad - Sakshi

Mysterious flying object hangs above Pak city: విశాల విశ్వంలో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చేసిన అంతరిక్షి పరిశోధనల్లో చాలా వరకు అంతు చిక్కని రహస్యలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. శాస్త్రవేత్తలు కూడా ఆ రహస్యాలను చేధించే ప్రయత్నంలో తలామునకలవుతునే ఉన్నారు. కానీ ఇప్పటికి అంతుబట్టిన చిదంబర రహస్యంలా గగనంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటునే ఉన్నాయి. అచ్చం అలానే ఒక వింతైన అద్భుతం ఆకాశంలో కనిపించింది. ఈ ఘటన ఇస్లామాబాద్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...ఇస్లామాబాద్‌కి చెందిన ఒక గ్రహాంతర జౌత్సాహికుడు అర్స్లాన్ వార్రైచ్ ఆకాశలో ఎగురుతున్న రాయిని చూశాడు. అతను తన డ్రోన్‌లను ల్యాండ్‌ చేయబోతున్నప్నుడు ఆకాశంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. చూసేందుకు నల్లటి గుండ్రపు రాయిలా ఉందని కెమెరాలో జూమ్‌ చేసి చూస్తే ఒక ఉబ్బెత్తిన త్రిభుజాకారంలో ఉందని చెప్పాడు.

అంతేకాదు ఆకాశంలో ఈ వింత రెండు గంటలకు పైనే కనువిందు చేసిందని అన్నాడు. ఈ మేరకు అతను ఆ  వింతైన వస్తువు ఆకాశంలో వేలాడిదీసినట్టుగా ఉన్న దానిని రకరకాల యాంగిల్స్‌లో వీడియో రికార్డు చేశాడు. అంతేకాదు వార్రైచ్ ఆ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి:  సైకిల్‌ రైడర్ల పై ఘోరంగా దాడి చేసిన ఎద్దు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement