triangle
-
Lok Sabha Election 2024: నాలుగో విడతలో బెంగాల్ లో ముక్కోణాలు
కీలక రాష్ట్రాల్లో ఒకటైన పశి్చమ బెంగాల్లో నాలుగో విడతలో సోమవారం 8 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 42 లోక్‌సభ స్థానాలకు గాను మూడు విడతల్లో 10 చోట్ల పోలింగ్ ముగిసింది. నాలుగో విడత అభ్యర్థుల్లో పీసీసీ చీఫ్ అదీర్ రంజన్ చౌదరి, తృణమూల్ ఫైర్‌బ్రాండ్ మహువా మొయిత్రా, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు...కృష్ణానగర్ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికరమైన పోరుకు వేదికైన స్థానాల్లో కృష్ణానగర్ ఒకటి. పార్లమెంటులో మోదీ సర్కారుపై విరుచుకుపడే తృణమూల్ ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా మళ్లీ బరిలో ఉండటమే అందుకు కారణం. ఆమె 2019లో తొలిసారి తృణమూల్ టికెట్ మీదే ఇక్కడ గెలిచి లోక్‌సభలో అడుగు పెట్టారు. లోక్‌సభలో అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా ప్రశ్నలడిగేందుకు నగదు, కానుకలు తీసుకున్నారన్న ఆరోపణలపై సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయినా ఆమెకే తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మళ్లీ అవకాశమిచ్చారు. ఈసారి మరింత మెజారిటీతో నెగ్గి లోక్‌సభలో అడుగు పెడతానని మొయిత్రా ధీమాగా ఉన్నారు. ఆమెపై బీజేపీ నుంచి స్థానిక రాజ కుటుంబం మహరాజా కృష్ణచంద్ర రాయ్ వంశీకురాలు అమృతరాయ్ పోటీలో ఉన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆమె బాగా పరిచయం. ఈ ఏడాదే బీజేపీలో చేరి టికెట్ సాధించారు. ఆమెకు మద్దతుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇక సీపీఎం అభ్యర్థి ఎస్ఎం సాది ముస్లింలతో పాటు ఇతర వర్గాల్లోనూ మంచి పేరున్న నేత. మొయిత్రాకు పడే ముస్లిం ఓట్లను సాది గణనీయంగా చీల్చి ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.బహ్రాంపూర్ పశ్చిమబెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అ«దీర్ రంజన్ చౌదరి 1999 ఎన్నికల నుంచి ఇక్కడ నాన్‌స్టాప్‌గా గెలుస్తున్నారు. ఈసారి తృణమూల్ నుంచి ప్రముఖ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఆయనకు సవాలు విసురుతున్నారు. నిర్మల్ కుమార్ సాహాకు బీజేపీ టికెట్ లభించింది. దాంతో ముక్కోణపు పోటీకి బహ్రాంపూర్ కేంద్రంగా మారింది. 1999కి ముందు వరుసగా మూడుసార్లు ఆర్ఎస్పీ నేత ప్రమోతెస్ ముఖర్జీ ఇక్కడ నెగ్గారు. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు తృణమూల్ ఖాతాలోనే ఉన్నాయి. బహ్రాంపూర్‌లో 50 శాతం ముస్లింలే ఉన్నారు. వారంతా కాంగ్రెస్‌కే దన్నుగా నిలుస్తున్నారు. అందుకే ఈసారి అ«దీర్‌కు ఎలాగైనా చెక్ పెట్టేందుకు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పఠాన్‌ను తృణమూల్ ఎంచుకుంది. అయితే స్థానికేతరుడు కావడం ఆయనకు కాస్త మైనస్‌గా మారింది. ముస్లిం ఓట్లు కాంగ్రెస్, తృణమూల్ మధ్య చీలితే బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలూ లేకపోలేదు.భోల్పూర్ బెంగాల్‌లోని బీర్భుమ్ జిల్లా పరిధిలో ఉన్న ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో ముక్కోణపు పోటీ నెలకొంది. బోల్పూర్తో పాటు బీర్భుమ్ లోక్‌సభ స్థానంలోనూ టీఎంసీ విజయంలో స్థానిక నాయకుడు అనుబ్రత మోండల్ది కీలక పాత్ర. పశువుల అక్రమ రవాణా కేసులో ఆయన రెండేళ్లుగా తిహార్ జైల్లో ఉండడం ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసేదే. అయినా భోల్పూర్లో మోండల్ పేరుతోనే టీఎంసీ ఓట్లడుగుతోంది! దివంగత లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ 1985 నుంచి 2009 వరకు ఏడుసార్లు ఇక్కడి ఎంపీగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ అసిత్ కుమార్ మల్పైనే మరోసారి టీఎంసీ ఆశలు పెట్టుకుంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లూ ఆ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి! ఇది తృణమూల్‌కు బాగా కలిసొచ్చే అంశం. బీజేపీ నుంచి ప్రియా షా పోటీ చేస్తున్నారు. 2014తో పోలిస్తే 2019లో బీజేపీకి ఇక్కడ ఓట్లు భారీగా పెరిగాయి. ఈసారి సీఏఏ తదితరాల దన్నుతో గెలిచి తీరతామని బీజేపీ నేతలంటున్నారు. సీపీఎం నుంచి స్థానికంగా బాగా పట్టున్న శ్యామలి ప్రధాన్ పోటీలో ఉన్నారు. భోల్పూర్ లోక్‌సభ స్థానం పరిధిలో సీపీఎంకు ఆదరణ కూడా ఎక్కువే. బీజేపీ, తృణమూల్ ఓట్లలో శ్యామలి వేటిని చీలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.రాణాఘాట్బెంగాల్లో ఈ విడతలో ఎక్కువ ఆసక్తి నెలకొన్న స్థానాల్లో ఇదీ ఒకటి. సిట్టింగ్ ఎంపీ జగన్నాథ్ సర్కార్‌నే బీజేపీ మరోసారి పోటీకి నిలిపింది. ఆయన గత ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి రూపాలి బిశ్వాస్‌పై 2.33 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2009, 2014ల్లో ఇక్కడ తృణమూల్‌దే విజయం. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదు చోట్ల బీజేపీ చేతిలో, రెండు తృణమూల్ ఖాతాలో ఉన్నాయి. అయితే రానాఘాట్ దక్షిణ్ ఎమ్మెల్యే ముకుత్ మణి అధికారి బీజేపీకి ఝలక్ ఇస్తూ లోక్‌సభ ఎన్నికల ముందు తృణమూల్‌లో చేరారు. ఆయననే పార్టీ అభ్యరి్థగా మమత బరిలోకి దింపారు. దాంతో పోరు ఆసక్తికరంగా మారింది. కానీ ముకుత్కు టికెటివ్వడంతో స్థానిక తృణమూల్ నేతలు భగ్గుమన్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారానికి ముందుకు రావడం లేదు. బంగ్లాదేశ్ నుంచి వలస వచి్చన మథువా సామాజికవర్గ ప్రాబల్యం ఇక్కడ ఎక్కువ. సీఏఏ అమలుతో వీరికి భారత పౌరసత్వం రానుంది. ఇది బీజేపీకి బాగా కలిసొస్తుందని భావిస్తున్నారు. సీపీఎం తరఫున అలోకేశ్ దాస్ పోటీలో ఉన్నారు.బర్ధమాన్ – దుర్గాపూర్దేశానికి ప్రపంచకప్ తెచ్చిపెట్టిన ఇద్దరు మాజీ క్రికెటర్లు బెంగాల్లో ఈ విడత బరిలో ఉండటం విశేషం. వారిలో ఒకరు 2007 టీ20 ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టు సభ్యుడు యూసఫ్ పఠాన్, మరొకరు 1983 వన్డే ప్రపంచ కప్ నెగ్గిన ‘కపిల్ డెవిల్స్’లో ఒకరైన కీర్తి ఆజాద్. వీరిద్దరూ తృణమూల్ అభ్యర్థులుగా బీజేపీకి సవాల్ విసురుతున్నారు. కీర్తి ఆజాద్ బీజేపీ మాజీ ఎంపీ. 2015లో సస్పెన్షన్‌కు గురై కాంగ్రెస్‌లో చేరారు. 2021లో తృణమూల్ గూటికి చేరారు. బర్ధమాన్–దుర్గాపూర్ లోక్‌సభ స్థానంలో రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ దిలీప్ ఘోష్‌తో తలపడుతున్నారు. నియోజకవర్గాల పునరి్వభజన అనంతరం ఏర్పడిన ఈ స్థానంలో ఓటర్లు ఏ పార్టీని రెండోసారి దీవించిన చరిత్ర లేదు. 2009లో సీపీఎం నేత సాదుల్ హక్ గెలవగా, 2014లో తృణమూల్ అభ్యర్థి ముంతాజ్ సంఘమిత్ర నెగ్గారు. 2019 ఎన్నికల్లో ముంతాజ్‌పై బీజేపీ నేత ఎస్ఎస్ అహ్లూవాలియా కేవలం 2,400 ఓట్లతో గట్టెక్కారు. ఈ విడత బీజేపీ అభ్యర్థి ఘోష్‌కు అజాద్ గట్టి పోటీ ఇస్తున్నారు. సీపీఎం ఇక్కడ సుకీర్తి ఘోషాల్‌ను నిలబెట్టింది.బీర్భుమ్2004 తర్వాత ఎస్సీ నుంచి జనరల్‌కు మారినప్పటి నుంచీ ఇక్కడ తృణమూల్ నేత, నటి శతాబ్దీ రాయ్ చక్రం తిప్పుతున్నారు. 2009 నుంచి ఆమే గెలుస్తూ వస్తున్నారు. అయితే 2014 ఎన్నికల నుంచి ఇక్కడ బీజేపీ బాగా పుంజుకుంది. 2019లో ఏకంగా 5.65 లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. మాజీ ఐపీఎస్ అధికారి దేవాశిష్ ధార్‌ను అభ్యరి్థగా బీజేపీ ప్రకటించగా సాంకేతిక కారణాలతో పోటీకి అనర్హుడయ్యారు. దాంతో దేబతను భట్టాచార్య పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మిల్టన్ రషీద్ పోటీలోకి ఉన్నారు. అవినీతి, మహిళలపై నేరాలు, సీఏఏ తదితర అంశాలు ఇక్కడి ఎన్నికలపై ప్రభావం చూపించనున్నాయి. టీఎంసీ నేత అనుబ్రత మోండల్ అందుబాటులో లేకపోవడం బీజేపీకి కొలిసొచ్చేదే. అయితే ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు స్థానాల్లో ఆరు తృణమూల్ ఖాతాలోనే ఉన్నాయి.ఆస్తుల్లో అమృతా రాయ్ టాప్ పశి్చమబెంగాల్లో నాలుగో విడతలో బరిలో ఉన్న 75 మంది అభ్యర్థుల్లో 21 మంది కోటీశ్వరులు. కృష్ణానగర్ బీజేపీ అభ్యర్థి రాయ్ రూ.554 కోట్ల ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. తర్వాత అసన్సోల్ తృణమూల్ అభ్యరి్థ, బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హాకు రూ.210 కోట్లు ఉన్నాయి. రాణా ఘాట్ స్వతంత్ర అభ్యర్థి జగన్నాథ్ సర్కార్ తన వద్ద కేవలం రూ.3,586 ఉన్నట్టు చూపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Taiwan 2024 Presidential Elections: తైవాన్‌లో త్రిముఖం!
అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ దేశం చైనా మధ్య ఆధిపత్య పోరాటానికి కేంద్ర బిందువుగా మారిన తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 13వ తేదీన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. ద్వీప దేశమైన తైవాన్‌లో జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రపంచమంతటా ఆసక్తి కలిగిస్తున్నాయి. తైవాన్‌కు ప్రధాన ప్రత్యరి్థగా మారిన చైనాతో తదుపరి సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఈ ఎన్నికలు నిర్దేశించబోతున్నాయి. తైవాన్‌లో ఉద్యోగులు, కారి్మకుల వేతనాలు తగ్గిపోవడం, ఇళ్ల ధరలు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు కనిపిస్తోంది. చైనా దూకుడును కట్టడి చేయగల సత్తా ఉన్న నాయకుడికే ఈ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అధికార డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టి(డీపీపీ) ప్రస్తుత ఉపాధ్యక్షుడు విలియం లాయ్ చింగ్–టి, మాజీ ప్రతిపక్ష కౌమిన్‌టాంగ్(కేఎంటీ) పార్టీ నుంచి మాజీ పోలీసు చీఫ్, న్యూ తైపీ నగర మాజీ మేయర్ హొ యు–హీ, తైవాన్ పీపుల్స్ పార్టీ(టీపీపీ) నుంచి కొ వెన్–జి ఈ ఎన్నికల బరిలో నిలిచారు. వారి బలాబలాలు, విజయావకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. చైనా పెత్తనాన్ని ప్రశి్నస్తున్న విలియం లాయ్ చింగ్–టి 64 ఏళ్ల విలియం లాయ్ చింగ్–టి మృదు స్వభావిగా పేరుగాంచారు. తైవాన్‌కు స్వయం పాలన హోదాను నిలబెట్టడానికి చాలా ఏళ్లుగా పోరాటం సాగిస్తున్నారు. చైనా పెత్తనాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించారు. తైవాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న యోధుడిగా తనను తాను అభివరి్ణంచుకుంటున్నారు. విలియం లాయ్ చింగ్–టి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో వైద్య విద్య అభ్యసించారు. స్వదేశంలో కొన్నాళ్లు డాక్టర్‌గా పనిచేశారు. 1990వ దశకంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత తైనాన్ సిటీ నుంచి చట్టసభకు ఎన్నికయ్యారు. 2010లో తైనాన్ మేయర్‌గా విజయం సాధించారు. ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నుంచి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు. చైనాతో సత్సంబంధాలను తాను కోరుకుంటున్నానని ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. శత్రువులుగా కాదు, మిత్రులుగా ఉందామని చైనాకు సూచిస్తున్నారు. తైవాన్ తరహాలో చైనాలోనూ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వంటివి వరి్థల్లాలని తాను ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, చైనా మాత్రం విలియం లాయ్ చింగ్–టి పట్ల విముఖత వ్యక్తం చేస్తోంది. ఆయన ఒక పేచీకోరు అని నిందలు వేస్తోంది. తరచుగా లేని పోని సమస్యలు సృష్టిస్తుంటాడని విమర్శిస్తోంది. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష పదవికి హెసియావో బి–కిమ్ పోటీపడుతున్నారు. ఆమె జపాన్‌లో జన్మించారు. అమెఅమెరికాలో పెరిగారు. కరడుగట్టిన స్వాతంత్య్ర ఉద్యమకారిణిగా ఆమెకు పేరుంది. చైనాకు అనుకూలం! హొ యు–హీ కౌమిన్‌టాంగ్(కేఎంటీ) పార్టీ నేత, 66 ఏళ్ల హొ యు–హీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. చిన్నప్పుడు తన కుటుంబ వృత్తి అయిన పందుల పెంపకం చేపట్టారు. పంది మాంసం విక్రయించారు. విద్యాభ్యాసం అనంతరం పోలీసు అధికారిగా పనిచేశారు. పందులను పట్టుకోవడానికి చిన్నప్పుడు నేర్చుకున్న నైపుణ్యం పోలీసు అధికారిగా ఉన్నప్పుడు చాలాసార్లు పనికొచి్చందని ఆయన ఒక సందర్భంలో చెప్పారు. చాలా హై–ప్రొఫైల్ కేసులను సమర్థవంతంగా ఛేదించారు. హంతకులను అరెస్టు చేశారు. పదవీ విరమణ తర్వాత 2010లో రాజకీయాల్లో చేరారు. 2018లో ‘న్యూ తైపీ’ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. 2022లో మరోసారి మేయర్‌గా విజయం సాధించారు. పోలీసు అధికారిగా, మేయర్‌గా ఆయన పనితీరు ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంది. అందుకే అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యరి్థగా హొ యు–హీని కౌమిన్‌టాంగ్ పార్టీ ఎంపిక చేసింది. ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ ఈసారి గెలుపు కోసం శ్రమిస్తోంది. ఎన్నికల ప్రచారంలో హొ యు–హీ చైనా గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు. చైనా అనుకూలవాది అంటూ ఆయనపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘స్వతంత్ర తైవాన్’కు హొ యు–హీ వ్యతిరేకి అని ఆరోపిస్తున్నారు. తైవాన్, చైనా మధ్య సంబంధాలు రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజ్యాంగంపై ఆధారపడి ఉంటాయని, ఇందులో గందరగోళం ఏమీ లేదని ఆయన తేలి్చచెబుతున్నారు. కౌమిన్‌టాంగ్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష పదవికి జా షా–కాంగ్ పోటీ పడుతున్నారు. చైనా, తైవాన్ పునరేకీకరణ జరగాలని జా షా–కాంగ్ వాదిస్తుంటారు. యువత ఆదరణ చూరగొంటున్న కొ వెన్–జి తైవాన్ పీపుల్స్ పార్టి(టీపీపీ) నుంచి 64 సంవత్సరాల కొ వెన్–జి రేసులో నిలిచారు. ఆయన వైద్యుడిగా పనిచేస్తూ పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో జరిగిన ‘సన్‌ఫ్లవర్ ఉద్యమం’లో పాల్గొన్నారు. అప్పట్లో చైనాకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆ తర్వాత కొ వెన్–జి 2015లో తైపీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఎనిమిదేళ్లపాటు అదే పదవిలో సేవలందించారు. మేయర్‌గా చైనాతో సంబంధాలు పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. 2019లో తైవాన్ పీపుల్స్ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చైనాతో సంబంధాల విషయంలో ఎలాంటి వైఖరిని వ్యక్తం చేయకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. చైనాకు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పకుండా దాట వేస్తున్నారు. ప్రధానంగా యువతలో ఆయన పట్ల ఆదరణ కనిపిస్తోంది. డీపీపీ, కేఎంటీ పార్టీలకు తామే ప్రత్యామ్నాయం అని కొ వెన్–జి పేర్కొంటున్నారు. 2020 ఎన్నికల్లో 113 స్థానాలకు గాను టీపీపీ కేవలం ఐదు సీట్లు గెలుచుకుంది. తైవాన్ పార్లమెంట్లో మూడో అతిపెద్ద పార్టిగా మారింది. ఇక టీపీపీ నుంచి ఉపాధ్యక్ష రేసులో సిట్టింగ్ ఎంపీ, సంపన్న వ్యాపారవేత్త సింథియా వు నిలిచారు. తైవాన్‌లో ప్రఖ్యాతిగాంచిన వ్యాపార సంస్థ ‘షిన్ కాంగ్ గ్రూప్’ ఆమె కుటుంబానికి చెందినదే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పార్లమెంటు 2.0.. సర్వాంగ సుందరంగా కొత్త భవనం
ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు కొత్త భవనం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. త్రిభుజాకృతిలో నిర్మించిన ఈ భవనం దేశ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడుతూనే ఆధునిక హంగుల కలబోతగా కూడా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28 ఆదివారం కొత్త భవనాన్ని ప్రారంభించనున్నారు. వందేళ్ల నాటి పాత పార్లమెంటు భవనం నేటి అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో కొత్త భవన నిర్మాణం అవసరమైంది. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా కొత్త భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కేవలం రెండున్నరేళ్లలో నిర్మించింది. ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ నేతృత్వంలో నిర్మాణం సాగింది. ప్రస్తుతం పార్లమెంటు పక్కనే నిర్మించిన కొత్త భవనంలో అతి పెద్ద హాళ్లు, కమిటీ రూములు, సెంట్రల్ హాలు, అతి పెద్ద లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ వంటి సదుపాయాలన్నీ ఉన్నాయి. ► రూ.20 వేల కోట్లతో కూడిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రూ.970 కోట్లతో పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. ► లోక్‌సభ హాలును జాతీయ పక్షి నెమలి థీమ్‌తో నిర్మించారు. 888 మంది సభ్యులు కూర్చోవచ్చు. సభ్యుల సంఖ్య పెరిగినా ఇబ్బంది లేకుండా ప్రస్తుత లోక్‌సభ హాలు కంటే మూడు రెట్లు పెద్దగా రూపొందించారు. పార్లమెంటు సంయుక్త సమావేశాలకు కూడా చక్కగా సరిపోతుంది. 1,272 మంది సందర్శకులు సమావేశాలను తిలకించవచ్చు. ► రాజ్యసభ హాలును జాతీయ పుష్పం తామర థీమ్‌తో నిర్మించారు. 384 మంది సభ్యులు కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లున్నాయి. ► పార్లమెంటు భవన మూడు ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మ ద్వారాలని పేర్లు పెట్టారు. వీఐపీలు, ఎంపీలు, సందర్శకులకు మరో మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. ► అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో 150 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా భవన డిజైన్‌ను అహ్మదాబాద్‌కు చెందిన హెచ్సీపీ డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ రూపొందించింది. ఇది భూకంపాల్ని కూడా తట్టుకుంటుంది. ► రాజస్తాన్‌కు చెందిన ధోల్పూర్ రాళ్లతో భవనానికి అద్భుతమైన లుక్ వచ్చింది. ► పార్లమెంటు భవనంలోని ఇంటీరియర్స్ భారత సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా, భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తుకు తెచ్చేలా పలు ప్రాంతీయ కళారూపాలతో రూపొందాయి. ► భవన నిర్మాణంలో అడుగడుగునా పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేశారు. గ్రీన్ ఎనర్జీతో 30% దాకా విద్యుత్ ఆదా అవుతుంది. అత్యాధునిక టెక్నాలజీ వాడటంతో భవన నిర్వహణ ఖర్చులో ఏడాదికి రూ.1,000 కోట్లకు పైగా ఆదా అవుతుందట. ► పార్లమెంటు భవనం పైకప్పు మీద కాంస్యంతో తయారు చేసిన మన జాతీయ చిహ్నం నాలుగు సింహాలను ఏర్పాటు చేశారు. ఇది 9,500 కిలోల బరువుతో 6.5 మీటర్ల ఎత్తుంది. ► భవన నిర్మాణంలో ప్రత్యక్షంగా 2 వేల మంది కార్మికులు, పరోక్షంగా 9 వేల మంది, వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది కళాకారులు పాలుపంచుకున్నారు. ► ఆవరణలో రెండు మర్రి చెట్లు నాటారు. ► దివ్యాంగులకు అనుకూలంగా, వారు స్వేచ్ఛగా తిరిగేలా నిర్మాణం జరిగింది. ► భవనం గోడలపై పలు శ్లోకాలను రాశారు. చరిత్రలోకి తొంగి చూస్తే.. ప్రస్తుత పార్లమెంటు భవనం బ్రిటిష్ కాలం నాటిది. న్యూఢిల్లీ నగర రూపకర్తలైన ఎడ్విన్ ల్యూటెన్స్, హెర్బర్ట్ బేకర్ దీన్ని డిజైన్ చేశారు. 1921 నుంచి ఆరేళ్ల పాటు భవన నిర్మాణం సాగింది. ఈ వృత్తాకార భవనానికి 83 లక్షలు ఖర్చు అయింది. 1927 జనవరి 18న గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ దీన్ని ప్రారంభించారు. దీన్ని మ్యూజియంగా మార్చనున్నారు. ఎందుకీ నిర్మాణం? ప్రస్తుత పార్లమెంటు భవనం అవసరాలు తీర్చేలా లేదు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి సభ్యుల సంఖ్య పెరిగితే సరిపోదు. మంత్రులు, మీటింగ్ హాల్స్ కొరత ఉంది. భవనంలో మార్పులు చేర్పులు చేస్తే నిర్మాణం దెబ్బ తినే ప్రమాదముంది. దానికి భూకంపాల్ని తట్టుకునే సామర్థ్యం లేదు. ఢిల్లీ ఏమో అత్యంత ప్రమాదకరమైన భూకంప జోన్–4లో ఉంది. అగ్నిప్రమాదాలను ఎదుర్కొనే ఆధునిక సౌకర్యాలూ లేవు. రాష్ట్రపతి ప్రారంభించాలి: రాహుల్ న్యూఢిల్లీ: పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ మొదలైంది. భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలే తప్ప ప్రధాని కాదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని ప్రారంభించడం రాజ్యాంగపరంగా సరైంది కాదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ కూడా ట్వీట్లు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం లోక్‌సభ, రాజ్యసభలతో కూడిన పార్లమెంటుకు రాష్ట్రపతే అధిపతి గనుక నూతన భవనాన్ని ఆయనే ప్రారంభించాలన్నారు. ఆర్జేడీ, ఎంఐఎం కూడా ప్రధాని ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక హిందూత్వవాది వి.డి. సావర్కర్ జయంతి నాడే (ఈ నెల 28న) ప్రారంభోత్సవం జరపనుండటాన్నీ విపక్షాలు తీవ్రంఆక్షేపిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిల్లూపార్పైనే అందరి దృష్టి.. 37 ఏళ్లుగా వారిదే ఆధిపత్యం!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన చిల్లూపార్ విధానసభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 37 ఏళ్లుగా బ్రాహ్మణ వర్గం చేతి నుంచి బయటికి వెళ్లని ఈ స్థానం నుంచి ఇప్పటివరకు కమలదళం విజయం సాధించలేదు. దీంతో చిల్లూపార్లో కాషాయ జెండా ఎగరవేయాలని సీఎం యోగి తీవ్రంగా శ్రమిస్తున్నారు. గోరఖ్‌పూర్ జిల్లాలోని కీలకమైన ఈ నియోజకర్గంలో సీనియర్ నేత హరిశంకర్ తివారీ హవా కొనసాగుతుండడం, బ్రాహ్మణుల ఓట్లు చీలడంతో ఫలితం ఆసక్తికరంగా మారనుంది. ఆధిపత్యం కొనసాగేనా..? చిల్లూపార్ అసెంబ్లీ స్థానానికి ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 1985 నుంచి 2007 వరకు వరసగా 22 ఏళ్లు హరిశంకర్ తివారీ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి రాజేష్ త్రిపాఠి చేతిలో హరిశంకర్ ఓడిపోయారు. ఆ తర్వాత హరిశంకర్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు వినయ్ శంకర్ సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై బరిలో దిగారు. 2017లో తొలిసారిగా చిల్లూపార్ నుంచి బీఎస్పీ టికెట్‌పై వినయ్ శంకర్ తివారీ పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి ఎస్పీ తరఫున వినయ్ శంకర్ తివారీ, మాజీ ఎమ్మెల్యే రాజేశ్ త్రిపాఠి బీజేపీ తరపున, బీఎస్పీ నుంచి రాజేంద్ర సింగ్ పెహల్వాన్, కాంగ్రెస్ అభ్యర్థినిగా సోనియా శుక్లా బరిలో దిగారు. చిల్లూపార్ అసెంబ్లీ స్థానంలోని 4.31 లక్షల మంది ఓటర్లలో బ్రాహ్మణులు 1.05 లక్షలు. దళిత, నిషాద్ ఓటర్లు కూడా నిర్ణయాత్మక స్థానంలో ఉన్నారు. దీంతో బ్రాహ్మణ, దళిత, యాదవ ప్రాబల్యం ఉన్న ఈ స్థానంలో పోటీ రసవత్తరంగా ఉంది. -
ఆకాశంలో వింత.. అంతు చిక్కని రహస్యం!
Mysterious flying object hangs above Pak city: విశాల విశ్వంలో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చేసిన అంతరిక్షి పరిశోధనల్లో చాలా వరకు అంతు చిక్కని రహస్యలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. శాస్త్రవేత్తలు కూడా ఆ రహస్యాలను చేధించే ప్రయత్నంలో తలామునకలవుతునే ఉన్నారు. కానీ ఇప్పటికి అంతుబట్టిన చిదంబర రహస్యంలా గగనంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటునే ఉన్నాయి. అచ్చం అలానే ఒక వింతైన అద్భుతం ఆకాశంలో కనిపించింది. ఈ ఘటన ఇస్లామాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఇస్లామాబాద్‌కి చెందిన ఒక గ్రహాంతర జౌత్సాహికుడు అర్స్లాన్ వార్రైచ్ ఆకాశలో ఎగురుతున్న రాయిని చూశాడు. అతను తన డ్రోన్లను ల్యాండ్ చేయబోతున్నప్నుడు ఆకాశంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. చూసేందుకు నల్లటి గుండ్రపు రాయిలా ఉందని కెమెరాలో జూమ్ చేసి చూస్తే ఒక ఉబ్బెత్తిన త్రిభుజాకారంలో ఉందని చెప్పాడు. అంతేకాదు ఆకాశంలో ఈ వింత రెండు గంటలకు పైనే కనువిందు చేసిందని అన్నాడు. ఈ మేరకు అతను ఆ వింతైన వస్తువు ఆకాశంలో వేలాడిదీసినట్టుగా ఉన్న దానిని రకరకాల యాంగిల్స్‌లో వీడియో రికార్డు చేశాడు. అంతేకాదు వార్రైచ్ ఆ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: సైకిల్ రైడర్ల పై ఘోరంగా దాడి చేసిన ఎద్దు!) -
కామారెడ్డిలో త్రిముఖ పోరు..
కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధానంగా త్రిముఖ పోరు నెలకొంది. చిరకాల ప్రత్యర్థులైన కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ, టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్లతోపాటు బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా గెలుపుకోసం నువ్వానేనా అన్నట్లుగా పోరాడుతున్నారు. ముగ్గురు నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తుండడంతో నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. సాక్షి, కామారెడ్డి: జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన కామారెడ్డి నియోకజవర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థుల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. ముగ్గురికీ ఎన్నికల్లో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో ఆరోపణలు, విమర్శలకు పదునుపెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీజేపీ అభ్యర్థిగా జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డిలు పోటీ పడుతున్నారు. వీరితో పాటు మరో ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యే నువ్వానేనా అన్న రీతిలో పోరు సాగుతోంది. ఎన్నికల తేదీ సమయం సమీపిస్తుండడంతో అభ్యర్థులు విమర్శలు, ఆరోపణల దాడి పెంచారు. టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్, కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండగా.. ఆ ఇద్దరినీ టార్గెట్ చేసి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ఆరోపణలు సంధిస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. ముగ్గురూ బలమైన అభ్యర్థులు కావడంతో ఇక్కడ త్రిముఖ పోటీ నడుస్తోంది. ముగ్గురికీ గెలుపు ప్రతిష్టాత్మకం కావడంతో గెలుపుకోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. హోరాహోరీ ప్రచారం సాగుతుండడంతో విజయం ఎవరిని వరిస్తుందన్న దానిపై జనంలో తీవ్ర చర్చ జరుగుతోంది. రకరకాల సమీకరణాలు ఉండడంతో గెలుపెవరిదో అంచనా వేయలేకపోతున్నారు. చాపకింద నీరులా.. నియోజక వర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు బలమైన క్యాడర్ ఉంది. దీంతో ఈసారీ ఆ పార్టీల అభ్యర్థుల మధ్యే పోరు ఉంటుందని అందరూ భావించారు. అయితే బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వెంకటరమణారెడ్డి కూడా ప్రధాన పోటీదారుగా మారారు. ఆయన ప్రతి ఇంటి తలుపు తడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ జనాన్ని ఆకట్టుకుంటున్నారు. చాపకింద నీరులా ఆ పార్టీ బలం పుంజుకుంటుండడంతో పోరు రసవత్తరంగా మారింది. సర్వశక్తులు ఒడ్డుతున్న షబ్బీర్‌అలీ కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో షబ్బీర్‌అలీ కీలకమైన స్థానంలో ఉండే అవకాశాలున్నాయి. దీంతో ఆయన విజయం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. షబ్బీర్ అలీ 1989లో తొలిసారి కామారెడ్డినుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవి కూడా పొందారు. నియోజకవర్గంలో మంత్రి పదవి పొందిన ఏకైక వ్యక్తి కూడా ఆయనే.. 1994, 1999 ఎన్నికల్లో ఓటమి చెందారు. 2004 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో కీలకమైన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009, 2014 ఎన్నికల్లో షబ్బీర్‌అలీ ఓటమి చెందారు. అనంతరం శాసన మండలి సభ్యునిగా ఎన్నికైన షబ్బీర్‌అలీ.. మండలి విపక్ష నేతగా కూడా పనిచేస్తున్నారు. గెలిచినా, ఓడినా నియోజక వర్గంలో పార్టీ శ్రేణులు, ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈసారీ పోటీలో ఉన్న షబ్బీర్‌అలీ రెండు నెలలుగా నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఊరూరా తిరుగుతూ తాను మంత్రిగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. ఇటీవల నియోజకవర్గంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభను నిర్వహించడంతో పాటు రేవంత్‌రెడ్డి రోడ్‌షోలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈసారి విజయం తనదేనన్న గట్టి ధీమాతో ఉన్న షబ్బీర్‌అలీ.. విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘గంప’ టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఎలాగైనా ఈసారి కూడా విజయం సాధించి తన పట్టును నిలుపుకోవాలని ఆరాటపడుతున్నారు. అందుకోసం రెండున్నర నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.గంప గోవర్ధన్ తొలిసారిగా 1994లో కామారెడ్డినుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 1999లో అవకాశం దక్కలేదు. 2004లో ఎల్లారెడ్డినుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా కొనసాగిన సమయంలో ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. 2011 ఉప ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లోనూ గెలిచారు. వరుస విజయాలను సొంతం చేసుకున్న గంప గోవర్ధన్ ఈసారి కూడా విజయం సాధించడానికి ప్రజాక్షేత్రంలో విస్తృతంగా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో నియోజక వర్గంలో వందలాది కోట్లతో జరిగిన అభివృద్ధి పనులతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆయన ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉండడంతో వారితో కలిసి ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇటీవలే జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేసి భారీ ఎత్తున జనాలను తరలించారు. సభ విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఒక్క అవకాశం ఇవ్వమంటున్న వెంకటరమణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే కామారెడ్డి రూపురేఖలు మారుస్తానంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రెండు నెలలుగా ఆయన ఊరూరా తిరుగుతున్నారు. ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళ్లినపుడు అక్కడే రాత్రిళ్లు నిద్రిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆయన నియోజకవర్గంలో దాదాపు ప్రతి ఇంటి తలుపుతట్టారు. ఊరూరా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. డ్వాక్రా మహిళలకు రావాల్సిన వడ్డీరాయితీ బకాయిలపై వెంకటరమణారెడ్డి మూడు నెలల క్రితం చేపట్టిన ఉద్యమం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. వెంకటరమణారెడ్డి దశలవారీ ఉద్యమాలు, రిలేదీక్షలు చేశారు. నిరవధిక నిరాహార దీక్షకూ దిగారు. దీంతో మహిళల మద్దతు పొందారు. తరువాత యువతపై దృష్టి సారించిన వెంకటరమణారెడ్డి.. జిల్లా కేంద్రంలో యువతను చైతన్యపరిచే విధంగా ఓపెన్ డిబేట్ నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన కాలంలో ఇసుకమాఫియా, మద్యం మాఫియాకు కళ్లెం వేసిన వెంకటరమణారెడ్డి.. తనకు అవకాశం ఇస్తే కామారెడ్డి నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. నియోజకవర్గంలో తన ప్రత్యర్థులిద్దరిపై ఆరోపణలు, విమర్శలు సంధిస్తూ నీతివంతమైన పాలన కోసం తనను గెలిపించాలని కోరుతున్నారు. వెంకటరమణారెడ్డికి మద్దతుగా ఇప్పటికే స్వామి పరిపూర్ణానంద కామారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించారు. వచ్చేనెల రెండో తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కామారెడ్డిలో నిర్వహించే సభలో పాల్గొననున్నారు. -
‘లింగాయత్’ల గడ్డపై త్రిముఖపోరు
బీదర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: లింగాయత్ సామాజిక వర్గ ప్రభావం అధికంగా ఉండే ఉత్తర కర్ణాటకలో కీలకమైన ఐదు జిల్లాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌ల మధ్య ప్రధాన పోరు సాగనుంది. అన్ని పార్టీలు లింగాయత్‌ల ఓట్ల కోసం వ్యూహ ప్రతివ్యూహాలతో సాగుతున్నాయి. ప్రస్తుతం బీదర్, కలబుర్గి(గుల్బర్గ), యాద్గీర్, రాయిచూర్, కొప్పాల్ జిల్లాల్లో పట్టు నిలుపుకోవడానికి కాంగ్రెస్ యత్నిస్తుంటే.. మెరుగైన ఫలితాలపై బీజేపీ దృష్టిపెట్టింది. ఈ జిల్లాల్లో మొత్తం 31 స్థానాలుంటే.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 18, జేడీఎస్ 5, బీజేపీ 4, కేఎంపీ+కేజేపీ 3 స్థానాల్లో గెలుపొందాయి. లింగాయత్‌లకు మైనార్టీ హోదా కల్పించడం ద్వారా ఆ ఓట్లను తమవైపు తిప్పుకోవచ్చని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆశించారు. అయితే.. లింగాయత్ల్లోని ఉపకులాలను రిజర్వేషన్ల పేరిట విడగొట్టడంపై ఆ సామాజిక వర్గంలో మెజార్టీలుగా ఉన్న ‘ఆది’ వర్గం అసంతృప్తితో ఉంది. మోదీ సభతో బీజేపీలో ఉత్సాహం సిద్దూ సర్కారు మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని,.. తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం ఇక్కడి మధ్య, ఉన్నతవర్గాల్లో ఉంది. కందులు, పత్తి, చెరకు పంటలకు గిట్టుబాటు ధర రావడంలేదంటూ రైతులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర కర్ణాటకలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు. లింగాయత్ వర్గానికి చెందిన యడ్యూరప్ప మళ్లీ బీజేపీలోకి రావడంతో ఈసారి సీట్లను రెండంకెలకు పెంచుకోగలమని బీజేపీ భావిస్తోంది. గుల్బర్గలో ప్రధాని మోదీ పాల్గొన్న బహిరంగ సభకు భారీగా స్పందన రావడం బీజేపీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. కాంగ్రెస్ విషయానికి వస్తే.. మాజీ సీఎం, బీదర్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ధరమ్‌సింగ్ మరణించడం ఆ పార్టీకి తీరని లోటు. లింగాయత్‌ల తరువాత ఈ ప్రాంతంలో ముస్లిం, దళిత సామాజిక వర్గానిదే పైచేయి. వారిలో మెజారిటీ మద్దతు కాంగ్రెస్‌కే ఉంది. బీదర్.. బీదర్ జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. గత ఎన్నికల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్, ఒకస్థానంలో కర్ణాటక మక్కల్ పక్ష(కెఎంపీ), మరో చోట బీజేపీ గెలిచింది. ► బీదర్ మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమయ్యారనే విమర్శలున్నా.. కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే రహీంఖాన్‌కు మంచిపేరే ఉంది. గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన గురుపాదప్ప నాగమార్పల్లి కుమారుడు సూర్యకాంత్‌ను బీజేపీ దింపింది. ముస్లింలు అధికంగా ఉన్న ఈ స్థానంలో రహీంఖాన్కే గెలుపు అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ► బీదర్(దక్షిణ) అశోక్ ఖేనీ(కాంగ్రెస్), డాక్టర్ శైలేంద్ర బల్దాలే(బీజేపీ), బండెప్ప కేశంపూర్(జేడీఎస్)లు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో కెఎంపీ నుంచి గెలిచిన అశోక్ ఖేనీ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. అయితే, ఆయన అభ్యర్థిత్వంపై స్థానిక కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి ఉంది. ► హుమ్నాబాద్: హ్యాట్రిక్ విజయాలు సాధించిన రాజశేఖర్పాటిల్(కాంగ్రెస్) నాలుగోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనపై సొంత ఆస్తులు పోతాయనే ఉద్దేశంతో రోడ్డు విస్తరణను అడ్డుకుంటున్నారన్న ఆరోపణ ఉంది. లింగాయత్ల్లో పట్టున్న పాటిల్‌కు పోటీగా.. అదే సామాజిక వర్గానికి చెందిన సుభాష్కల్లుర్ను బీజేపీ, మాజీ మంత్రి మీరాజుద్దీన్ సోదరుడు నాసీమ్పటేల్ను జేడీఎస్ బరిలో దింపాయి. ► బసవకళ్యాణ్: మహారాష్ట్ర సరిహద్దులో ఉండే ఈ నియోజకవర్గంలో మరాఠీ ఓటర్లు కీలకం. స్థానిక మరాఠా నాయకులను కాదని కొద్ది రోజుల క్రితం పార్టీలో చేరిన జేడీఎస్ ఎమ్మెల్యే మల్లిఖార్జున కుబాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. దీంతో స్థానిక బీజేపీ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. రెండు సార్లు ఓడిన ‘కబ్బలిగ’ వర్గానికి చెందిన నారాయణరావుకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. పీజీఆర్ సింధియాను జేడీఎస్ రంగంలోకి దించింది. మరో రెండు నియోజకవర్గాలైన ఔరాద్లో ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభు చౌహాన్(బీజేపీ), విజయ్‌కుమార్(కాంగ్రెస్), ధంజీ(జేడీఎస్)లు పోటీలో ఉన్నారు. యాద్గీర్, రాయచూర్, కొప్పాల్.. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 16(యాద్గీర్ 4, రాయచూర్ 7, కొప్పాల్ 5)స్థానాలున్నాయి. ► యాద్గీర్లో: ఇక్కడ గత ఎన్నికల్లో బీజేపీ ఒక్కస్థానంలోనూ గెలవలేదు. యాద్గీర్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న డాక్టర్ మలక్ రెడ్డి రెండో హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టారు. 1989 నుంచి 99 వరకు వరుసగా మూడుసార్లు గెలిచిన మలక్రెడ్డి, 2004లో ఓడిపోయారు. 2009, 2013లో ఇక్కడ నుంచి గెలుపొందారు. ఆయన కృషితోనే యాద్గీర్ జిల్లా కేంద్రంగా ఏర్పడింది. బీజేపీ తరఫున వెంకట్ రెడ్డి, జేడీఎస్ నుంచి కడ్లూర్ పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో లింగాయత్‌లు 40 శాతం వరకు ఉంటారు. గుర్మిట్కల్ స్థానంలో కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూరావుకు ప్రజల్లో మంచి పేరుంది. షాహపూర్, షోరాపూర్ స్థానాల్లో త్రిముఖ పోటీ ఉంది. ► రాయచూర్, కొప్పాల్: రాయచూర్ నగర అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో జేడీఎస్ తరఫున గెలిచిన శివరాజ్‌పాటిల్ బీజేపీ టికెట్‌తో బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సయ్యద్ యాసీన్ రంగంలో ఉన్నారు. రాయచూర్ రూరల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి తిప్పేస్వామికి మంచి ఫాలోయింగ్ ఉంది. రాయచూర్ జిల్లాలోని మాన్వి, సింధనూరు, మాస్‌కి, దేవదుర్గ, లింగసూగూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో త్రిముఖపోటీ ఉంది. కొప్పాల్ జిల్లాలో కుస్తాగి, కనకగిరి, గంగావతి, యల్బుర్గ, కొప్పాల్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య పోటీ నెలకొంది. గుల్బర్గ.... గుల్బర్గ జిల్లాలో 9 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు, బీజేపీ రెండు, జేడీఎస్ ఒక సీట్లో గెలుపొందాయి. ఇక్కడ కాంగ్రెస్‌దే ఆధిపత్యం. మరో రెండు స్థానాలు అదనంగా సాధించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ ఉంది. గుల్బర్గలో డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఉంది. ప్రధాన మార్కెట్ మార్గాల విస్తరణ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బీమా నదిపై నిర్మిస్తున్న రిజర్వాయర్ పనుల్లో జాప్యంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. కర్ణాటకలో అత్యధికంగా కందులు పండించే జిల్లాగా గుల్బర్గకు పేరుంది. ఈసారి కందుల ధరలు దారుణంగా పడిపోయాయని రైతు బసవన్న ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 20 క్వింటాళ్ల వరకు ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసేదని, ఇప్పుడు క్వింటాల్‌కు రూ. 6 వేలిచ్చి.. పది క్వింటాళ్లు మాత్రమే కొంటోందన్నారు. ► చిత్తాపూర్ లోక్‌సభలో ప్రతిపక్షనాయకుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఐటీ మంత్రి అయిన ప్రియాంక్‌ఖర్గే వ్యవహారశైలి స్థానిక నాయకులకు నచ్చట్లేదు. ఈడిగ సామాజిక వర్గానికి చెందిన మలికయ్య గుత్తేదార్ సహా పలువురు నేతలు ఇప్పటికే పార్టీని వీడారు. స్థానిక ప్రజలతో తనకున్న సత్సంబంధాలు, అభివృద్ధిపరచిన మౌలిక వసతులే గెలిపిస్తాయన్న ధీమాతో ప్రియాంక్ ఉన్నారు. ఈ నియోజవకర్గంలో లింగాయత్‌లు దాదాపు 60 వేల వరకు ఉండగా, కోలిలు 45వేలు, దళితులు 35 వేలు, ముస్లింలు 20 వేల వరకు ఉంటారు. బీజేపీ నుంచి బలహీన వర్గాల్లో పేరున్న వాల్మీకి నాయక్ బరిలో ఉన్నారు. ► జెవర్గీ కాంగ్రెస్‌కు కంచుకోటలాంటి ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అజయ్‌సింగ్(మాజీ సీఎం ధరమ్‌సింగ్ కుమారుడు)కు మంచిపేరే ఉంది. గ్రామాల్లో రహదారులు అభివృద్ధి చేశారని స్థానిక రైతు బసవన్నదొడ్డగౌడ చెప్పారు. ఉద్యోగాల కల్పనలో మాత్రం విఫలమయ్యారన్న విమర్శ ఉంది. అజయ్‌సింగ్ తండ్రి ధరమ్‌సింగ్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని స్థానికులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెవర్గీలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు చేసినా.. ఒక్క పరిశ్రమ రాలేదని గిరిపాటిల్ అనే యువకుడు తెలిపాడు. ► గుల్బర్గ(ఉత్తర) ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కమర్ ఉల్ ఇస్లాం మరణించడంతో.. ఆయన భార్య కనీజ్ ఫాతిమాను కాంగ్రెస్ రంగంలోకి దింపింది. ఇక్కడ మొత్తంగా 11 మంది ముస్లిం అభ్యర్థులు బరిలో ఉన్నారు. 60% ముస్లిం ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు ముందునుంచి అనుకూలమైన స్థానమే. కానీ ఈసారి ముస్లిం అభ్యర్థులు ఎక్కువ మంది రంగంలో ఉండడంతో ఓట్లు చీలుతాయన్న భయం కాంగ్రెస్‌లో ఉంది. కమర్ ఉల్ ఇస్లామ్‌కు శాసనసభ్యునిగా మంచి పేరుంది. ఆయన అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లేవారని హిందువులు కూడా చెప్తారు. వ్యాపారవేత్త చందుపాటిల్ను బీజేపీ రంగంలోకి దింపింది. ► గుల్బర్గ(దక్షిణ) జేడీఎస్ నుంచి వచ్చిన దత్తాత్రేయ చంద్రశేఖర్ పాటిల్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ రేవూర్ పాటిల్ కుటుంబానికి దక్షిణ గుల్బర్గలో మంచి ఆదరణ ఉంది. కాంగ్రెస్ అల్లప్రభు పాటిల్‌ను, జెడీఎస్ బస్వరాజ్ దుగ్గావిని బరిలోకి దింపాయి. ► గుల్బర్గ(గ్రామీణ) ఇక్కడ త్రిముఖ పోటీ. సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్‌కుమార్ జి.రామకృష్ణ(కాంగ్రెస్), బస్వరాజ్ ముట్టిమడ్(బీజేపీ), రేవూనాయక్ బెలమగి(జేడీఎస్) పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రేవూనాయక్కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన జేడీఎస్‌లోకి జంప్ అయ్యారు. ఈ ప్రాంతం గుల్బర్గను ఆనుకుని ఉన్నప్పటికీ అభివృద్ధిలో బాగా వెనుకబడింది. తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆ ప్రాంత ప్రజలు విమర్శిస్తున్నారు. ఇవికాకుండా, ఆలంద్, సేడం, అఫ్జల్పూర్, చించోలి నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లే ప్రధానంగా పోటీలో ఉన్నాయి. -
ఒక త్రిభుజంలోని బాహ్యకోణాల మొత్తం?
గణిత శాస్త్రం రేఖా గణితం 1. తలంలోని n సరేఖీయ బిందువుల ద్వారా గీయగల రేఖల సంఖ్య? ఎ) బి) సి) డి) 1 2. సరళరేఖకు గల చివరి బిందువుల సంఖ్య? ఎ) 0 బి) 1 సి) 3 డి) 2 3. (3x–5)°,(x+10)°, (4x+5)°Ë$ త్రిభుజ కోణాలైతే ఆ త్రిభుజంలోని పెద్ద కోణం? ఎ) 90° బి) 89° సి) 79° డి) 92° 4. DABCÌZAB=AC, ÐA=50నిఅయితే వఆ విలువ? ఎ) 50° బి) 60° సి) 65° డి) 130° 5. ఒకే తొలి బిందువుతో గీయగల కిరణాల సంఖ్య? ఎ) 1 బి) 2 సి) అనంతం డి) 0 6. ఒక త్రిభుజంలోని మూడు కోణాల నిష్పత్తి 1:2:3 అయితే అది..? ఎ) అల్పకోణ త్రిభుజం బి) అధిక కోణ త్రిభుజం సి) లంబకోణ త్రిభుజం డి) సమద్విబాహు త్రిభుజం 7. మూడు లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒకే బిందువు ద్వారా పోతే అవి..? ఎ) సమాంతర రేఖలు బి) అనుషక్త రేఖలు సి) రేఖా ఖండాలు డి) శూన్య రేఖలు 8. కింది ఏ కొలతలతో త్రిభుజాన్ని ఏర్పర చలేం? ఎ) 6 సెం.మీ, 8 సెం.మీ, 18 సెం.మీ. బి) 8 సెం.మీ, 10 సెం.మీ, 12 సెం.మీ. సి) 9 సెం.మీ, 9 సెం.మీ, 9 సెం.మీ. డి) 10 సెం.మీ, 18 సెం.మీ, 9 సెం.మీ. 9. తలంలోని 8 బిందువుల ద్వారా గీయగల రేఖల సంఖ్య? ఎ) 36 బి) 28 సి) 30 డి) 40 10. ÐA, ÐB Ë$ పూరక కోణాలైతే... ÐA +ÐB విలువ? ఎ) 180° బి) 360° సి) 270° డి) 90° 11. DPQRÌZ PQ=PR, ÐQ=42° అయితే ÐP విలువ? ఎ) 42° బి) 96° సి) 84° డి) 90° 12. పటంలో ్ఠ విలువ? ఎ) 98° బి) 36° సి) 62° డి) 60° 13. తలంలోని రెండు రేఖలకు ఉమ్మడి బిందువు లేకుంటే అవి..? ఎ) లంబరేఖలు బి) ఏకీభవించే రేఖలు సి) సమాంతర రేఖలు డి) ఖండన రేఖలు 14. DABCలో BCని పొడిగించగా ఏర్పడిన బాహ్యకోణం 125ని. ÐB=70ని అయితే ÐA విలువ? ఎ) 70° బి) 55° సి) 90° డి) 60° 15. Ðx, Ðy సంపూరక కోణాలైతే Ðx +Ðy విలువ? ఎ) 90° బి) 180° సి) 270° డి) 360° 16. తలంలోని బిందువులు, సరళరేఖల మధ్య సంబంధాలను తెలిపే ధర్మాలు? ఎ) ఆపాత ధర్మాలు బి) సాంద్రత ధర్మాలు సి) తుల్య ధర్మాలు డి) రేఖీయ ధర్మాలు 17. ÐABCÌZÐA=80ని అయితే అ విలువ? ఎ) 80° బి) 40° సి) 100° డి) 90° 18. కింది పటంలో x,y కోణాలు..? ఎ) బాహ్య కోణాలు బి) సాదృశ్య కోణాలు సి) అంతర కోణాలు డి) ఏకాంతర కోణాలు 19. {పతి రేఖ దానికదే సమాంతరం అనేది? ఎ) సౌష్టవ ధర్మం బి) సంక్రమణ ధర్మం సి) అపవర్తిత ధర్మం డి) పరావర్తన ధర్మం 20. సమబాహు త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్యకోణం విలువ? ఎ) 120° బి) 60° సి) 90° డి) 180° 21. సంపూరకాలైన కోణాల నిష్పత్తి 2:3 అయితే ఆ కోణాలు? ఎ) 36°, 54° బి) 144°, 216° సి) 72°, 108° డి) 108°, 62° 22. తలంలోని రెండు బిందువుల ద్వారా గీయగల వక్రాల సంఖ్య? ఎ) 1 బి) 0 సి) 2 డి) అనంతం 23. పటంలో l||m, Ð1=40ని అయితే Ð2 విలువ? ఎ) 40° బి) 50° సి) 60° డి) 140° 24. 180<q<360నిఅయిత్ఞే ఒక ? ఎ) అల్ప కోణం బి) లంబ కోణం సి) అధికతర కోణం డి) సరళ కోణం 25. సమద్విబాహు త్రిభుజంలో అసమాన భుజం అనేది..? ఎ) ఎత్తు బి) భూమి సి) కర్ణం డి) నిర్వచించలేం 26. రేఖ.. ఝ రేఖకు సమాంతరం, ఝ రేఖ, రేఖకు సమాంతరం అనేది? ఎ) సౌష్టవ ధర్మం బి) పరావర్తన ధర్మం సి) సమాన ధర్మం డి) సంక్రమణ ధర్మం 27. గడియారంలో 6 గంటల సమయంలో రెండు ముళ్ల మధ్య కోణం? ఎ) శూన్య కోణం బి) సరళ కోణం సి) సంపూర్ణ కోణం డి) లంబకోణం 28. ఒక త్రిభుజంలో ఒక బాహ్యకోణం 120ని. దాని అంతరాభిముఖ కోణాలు 2:3 నిష్ప త్తిలో ఉంటే అందులో ఒక కోణం? ఎ) 30° బి) 40° సి) 75° డి) 80° 29. రెండు సమాంతర రేఖల మధ్య కోణం? ఎ) అనంతం బి) 0° సి) 360° డి) 180° 30. కింది వాటిలో సరికానిది..? ఎ) ఒక త్రిభుజంలో రెండు అల్పకోణాలు ఉండొచ్చు బి) ఒక త్రిభుజంలో ఒక అధిక కోణం ఉండొచ్చు సి) ఒక త్రిభుజంలో రెండు లంబ కోణాలు ఉండొచ్చు డి) ఒక త్రిభుజంలో ఏ రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువ 31. 90°<q<180ని అయితే ్ఞ ఒక ? ఎ) అల్పకోణం బి) అధిక కోణం సి) అధికతరకోణం డి) సమకోణం 32. కింది పటంలో ఏకాంతర కోణాల జత? ఎ) Ð2, Ð6 బి) Ð3, Ð6 సి) Ð4, Ð6 డి) Ð4, Ð8 33. ఒక లంబకోణ త్రిభుజంలో రెండు అల్ప కోణాలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. అందులో ఒక కోణం 54ని అయితే రెండో కోణం? ఎ) 36ని బి) 26ని సి) 46ని డి) 90ని 34. రెండు కోణాలు సమానం, పూరకాలు.. అయితే ఒక్కొక్క కోణం విలువ? ఎ) అల్పకోణం బి) అధిక కోణం సి) లంబ కోణం డి) సరళ కోణం 35. పటంలో AB||CD, BC||DE అయితే ్ఠ విలువ? ఎ) 50° బి) 60° సి) 120° డి) 30° 36. ఒక జత ఏకాంతర కోణాలు సమానమైతే ఆ రేఖలు? ఎ) ఏకీభవించే రేఖలు బి) ఖండన రేఖలు సి) సమాంతర రేఖలు డి) లంబంగా ఖండించుకొనే రేఖలు 37. పటంలో l||BC, అయితే కోణం x విలువ? ఎ) 50° బి) 55° సి) 70° డి) 75° 38. x°, (x+20ని) సంపూరక కోణాలు అయితే ్ఠ విలువ? ఎ) 90° బి) 100° సి) 180° డి) 80° 39. ఒక త్రిభుజంలోని రెండు కోణాలు పూరకాలు అయితే అది? ఎ) అల్పకోణ త్రిభుజం బి) లంబకోణ త్రిభుజం సి) అధిక కోణ త్రిభుజం డి) సమబాహు త్రిభుజం 40. కింది పటంలో అఆ్ఢ్ఢఇఈ అయితే ÐBCD? ఎ) 50° బి) 30° సి) 40° డి) 140° 41. ఒక త్రిభుజంలోని బాహ్యకోణాల మొత్తం? ఎ) 180° బి) 270° సి) 360° డి) 90° 42. DABCÌZÐA=3ÐB, ÐC=2ÐB అయితే త్రిభుజంలో ÐC విలువ? ఎ) 30° బి) 45° సి) 60° డి) 90° 43. రెండు కోణాలు సంపూరకాలు, ఒకదానికి మరొకటి రెట్టింపైతే ఆ కోణాలు? ఎ) 50°, 100° బి) 60°, 120° సి) 30°, 60° డి) 120°, 240° 44. సమబాహు త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగిస్తే ఏర్పడిన బాహ్యకోణం విలువ? ఎ) 60° బి) 180° సి) 90° డి) 120° 45. ఒక త్రిభుజంలోని మూడు కోణాలు (x–2)°, (x+8)°, (x+9)నిఅయితే x విలువ? ఎ) 58° బి) 60° సి) 55° డి) 63° సమాధానాలు 1) డి 2) ఎ 3) బి 4) సి 5) సి 6) సి 7) బి 8) ఎ 9) బి 10) డి 11) బి 12) సి 13) సి 14) బి 15) బి 16) ఎ 17) బి 18) బి 19) డి 20) ఎ 21) సి 22) డి 23) బి 24) సి 25) బి 26) ఎ 27) బి 28) సి 29) బి 30) సి 31) బి 32) సి 33) ఎ 34) ఎ 35) బి 36) సి 37) డి 38) డి 39) బి 40) సి 41) సి 42) సి 43) బి 44) డి 45) సి