
నీలి మేఘానికి కోపమొచ్చిందో ఏమో.. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఎరుపెక్కింది. సూరీడు అస్తమిస్తున్న సమయంలో మేఘం ఎరుపు రంగులోకి మారిపోయింది. పోర్టు ట్రస్టు ఆవరణలో ఉన్న నీటిలో ఆ ప్రతిబింబం పడటంతో.. ఆ వాతావరణమంతా రుధిరవర్ణంలోకి మారిపోయింది. ఆ సమయంలో పోర్టు కూలీలు పనులు చేస్తుండగా.. ఈ వర్ణ దృశ్యాన్ని సాక్షి కెమేరా క్లిక్‌మనిపించింది. ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment