SKY Movie: ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? | SKY Movie Latest Updates | Sakshi
Sakshi News home page

SKY Movie: ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది?

Sep 27 2022 6:54 PM | Updated on Sep 27 2022 6:54 PM

SKY Movie Latest Updates - Sakshi

ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్కై’.  పృథ్వి పేరిచర్ల దర్శకత్వంలో ‘వేలర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్‌’పై నాగిరెడ్డి గుంటక - మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది.

‘ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే, ఏళ్ల తరబడి అనుభవిస్తున్న బాధ, ఆనందంతో తన ఒంటరితనాన్ని జయించాడా, లేదా? లేక ఏకాకి జీవితమే కదా అని రోజు గడవడం కోసం తుంటరిగా పక్కవాడ్ని మోసం చేస్తూ బ్రతికేస్తున్నాడా? అసలు ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? మనిషిని ఎలా మలుస్తుంది? అనేది క్లుప్తంగా "స్కై" చిత్రం కథాంశమని దర్శకుడు పృథ్వి తెలిపారు. చివరి షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతోపాటు, ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేయనున్నామని నిర్మాతలు నాగిరెడ్డి గుంటక - మురళీ కృష్ణంరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement