![Planets Parade: Four Planets Appeared On The Same Line In The Sky - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/21/Planets-Parade.jpg.webp?itok=f_7sJyyp)
ఒకే రేఖపై కనిపిస్తున్న గ్రహాలు
ఏలేశ్వరం(తూర్పుగోదావరి): అంతరిక్షంలో అద్భుతం చోటు చేసుకుంది. ఖగోళంలో ఒకే రేఖపై నాలుగు గ్రహాలు దర్శనమిచ్చాయి. దీనిని ప్లానెట్స్ పరేడ్ అని అంటారు. ఇది బుధవారం తెల్లవారు జామున 3.49 గంటల నుంచి 5.06 గంటల మధ్య కనువిందు చేసింది. దీనిని కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో స్పార్క్ ఫౌండేషన్ చిత్రీకరించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఆస్ట్రనామికల్ వింగ్ డైరెక్టర్ ఎస్.సాయి సందీప్ వెల్లడించారు.
చదవండి: ఆ కోర్సులకు గిరాకీ.. ‘డిగ్రీ’ వైపు మళ్లీ చూపు..
శని, అంగారక, శుక్ర గ్రహాలు ఒకే రేఖపైకి రావడం మార్చి చివరిలో ప్రారంభమైంది. ఏప్రిల్‌లో బృహస్పతి అదే రేఖపైకి వచ్చి చేరింది. నాలుగు గ్రహాలు ఒకే రేఖపై దర్శనమివ్వడం అత్యంత అరుదైన విషయమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 23న నాలుగు గ్రహాల చెంతకు చంద్రుడు వచ్చి చేరడంతో అంతకు మించిన అద్భుతం ఆవిష్కృతం కానుందన్నారు. ప్రస్తుతం సరళరేఖ కుడిపక్కన చంద్రుడు కనిపిస్తున్నాడు. ఐదు గ్రహాలను ఒకే వరుసగా చూడటం ప్రజలకు సువర్ణ అవకాశమని సాయిసందీప్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment