ఆకాశంలో అరోరా..
మందస: ఆకాశంలో అద్భుతం కనిపించింది. రాత్రివేళల్లో తోక చుక్క భూమి మీద రాలే విధంగా దర్శనమిచ్చింది. ధ్రువ ప్రాంతాల్లో మాత్రమే ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
దీనిని అరోరా అంటారని సైన్స్ ఉపాధ్యాయుడు పాత్రుని లక్ష్మణరావు తెలిపారు. ధ్రువ ప్రాంతాల్లో కాంతి పరిక్షేపణం వల్ల ఆకాశంలో మేఘాలు వివిధ రంగులు కనిపిస్తాయని వివరించారు.