
వెలుగులీనిన నిండు చంద్రుడు
ప్రతి పౌర్ణమీ ఓ అద్భుత సృష్టే ! ఇంతటి అద్భుతానికి కేంద్రబిందువైన చంద్రుడు.. మనకు అత్యంత సమీపంలో ఉన్నట్లుగా కనిపిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది కదూ! ఇలాంటి అద్భుతం సోమవారం వినీలాకాశంలో ఆవిష్కృతమైంది. 1948 తర్వాత చంద్రుడు అతిపెద్దగా, మనుపటి కంటే ఎక్కువ వెలుగులు ప్రసరిస్తూ కార్తీక పౌర్ణమి నాడు దర్శనమిచ్చాడు. ఈ దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
–సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం