
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా లాభాల్లోకి మళ్లాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా క్షీణించిన ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో భారీగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం దాదాపు 200 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ కూడా అదే బాటలో పయనిస్తూ 10900స్థాయికి పైన ట్రేడ్ అవుతోంది. . ప్రధానంగా ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంక్స్ , మెటల్ సెక్టార్ కొనుగోళ్లు జోరందుకోవడంతో సెన్సెక్స్ లాభాల్లోకి మళ్లింది. అయితే రియల్టీ ప్రయివేట్ బ్యాంక్స్, ఆటో నష్టపోతున్నాయి.
ఇన్ఫీబీమ్ 16 శాతం దూసుకెళ్లగా, నిట్ టెక్, మైండ్‌ట్రీ, టీసీఎస్, ఒరాకిల్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభపడుతున్నాయి. వీటితోపాటు యస్ బ్యాంక్, హిందాల్కో, ఐబీ హౌసింగ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్‌ఫ్రాటెల్, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ లాభపడుతున్నాయి. ఇక రియల్టీ విషయానికి వస్తే యూనిటెక్, ఇండియాబుల్స్, సన్‌టెక్, డీఎల్‌ఎఫ్, ఫీనిక్స్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, శోభా, బ్రిగేడ్ 6-2 శాతం మధ్య పతనమయ్యాయి. ఇంకా హెచ్‌పీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్, ఇండస్‌ఇండ్, భారతీ ఎయిర్‌టెల్, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఫిన్‌సర్వ్, గ్రాసిమ్, బీపీసీఎల్, కొటక్ బ్యాంక్ తదితరాలు నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment