హైదరాబాద్ వేదికగా టీమిండియాతో మూడో టీ20లో ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరూన్ గ్రీన్ విధ్వంసం సృష్టించాడు. ఆది నుంచే ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకు పడ్డాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి. తద్వారా ఓ అరుదైన రికార్డును గ్రీన్ తన ఖాతాలో వేసుకున్నాడు.
భారత జట్టుపై టీ20ల్లో అత్యంత వేగంగా అర్ధ శతకం సాధించిన తొలి ఆటగాడిగా గ్రీన్ రికార్డులకెక్కాడు. అంతుకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ పేరిట ఉండేది. 2016లో లాడర్‌హిల్ వేదికగా భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో చార్లెస్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 21 బంతుల్లో 52 పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
చదవండి: Ind A vs NZ A 2nd ODI: కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ .. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment