విరాట్ కోహ్లి
Ind vs Aus 3rd T20 Hyderabad Virat Kohli- Rahul Dravid: ఆస్ట్రేలియాతో మూడో టీ20 సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆదివారం ఆసీస్‌తో జరిగిన ఆఖరి టీ20లో కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ద్రవిడ్‌ను అధిగమించి..
ఈ క్రమంలో టీమిండియా వాల్, ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండుల్కర్((34357 పరుగులు) తర్వాత అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు సాధించిన రెండో భారత బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. కాగా ద్రవిడ్ తన ఇంటర్నేషనల్ కెరీర్‌లో మొత్తంగా 24064 పరుగులు సాధించాడు.
ఇక ఆదివారం నాటి ఇన్నింగ్స్‌తో రన్‌మెషీన్ కోహ్లి 24,078 పరుగుల మైలురాయిని చేరుకుని ద్రవిడ్‌ను అధిగమించాడు. కాగా భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్, కోహ్లి, ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని టాప్-5లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి తన 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.
టీమిండియా తరఫున అత్యధిక పరుగుల వీరులు(ఆల్‌టైం)
1. సచిన్ టెండుల్కర్- 664 మ్యాచ్‌లలో 34,357 పరుగులు
2. విరాట్ కోహ్లి- 471 మ్యాచ్‌లలో 24,078(ఇప్పటివరకు)
3. రాహుల్ ద్రవిడ్- 404 మ్యాచ్‌లలో 24,064 పరుగులు
4. సౌరవ్ గంగూలీ- 421 మ్యాచ్‌లలో 18,433 పరుగులు
5. మహేంద్ర సింగ్ ధోని- 538 మ్యాచ్‌లలో 17,092 పరుగులు
చదవండి: Pak Vs Eng 4th T20: పాక్ వర్సెస్ ఇంగ్లండ్.. ఉత్కంఠ పోరు.. ఆఖరికి మూడు పరుగుల తేడాతో!
Rohit Sharma- Virat Kohli: పట్టరాని సంతోషం.. కోహ్లి- రోహిత్ ఆలింగనం.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment