చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచం‍లోనే రెండో ప్లేయర్‌గా | Virat Kohli makes history as the 2nd player to play 100 matches against Australia | Sakshi
Sakshi News home page

IND vs AUS: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచం‍లోనే రెండో ప్లేయర్‌గా

Published Sat, Dec 14 2024 3:37 PM | Last Updated on Sat, Dec 14 2024 4:02 PM

Virat Kohli makes history as the 2nd player to play 100 matches against Australia

బ్రిస్బేన్ వేదిక‌గా ఆస్ట్రేలియా-భార‌త్ మ‌ధ్య మూడో టెస్టు ప్రారంభ‌మైంది. అయితే వ‌ర్షం కార‌ణంగా తొలి రోజు కేవ‌లం 13.2 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే సాధ్య‌మైంది. మొద‌టి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆసీస్ వికెట్ న‌ష్ట‌పోకుండా 28 ప‌రుగులు చేసింది.

ప్ర‌స్తుతం క్రీజులో ఓపెన‌ర్లు మెక్‌స్వీనీ(4 నాటౌట్‌), ఉస్మాన్ ఖావాజా(19 నాటౌట్‌) ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌తో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి త‌న పేరిట అరుదైన రికార్డు లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియాపై 100 మ్యాచ్‌లు(అన్ని ఫార్మాట్లు) ఆడిన రెండో ప్లేయ‌ర్‌గా విరాట్ చ‌రిత్ర సృష్టించాడు. 

బ్రిస్బేన్ టెస్టులో కోహ్లి మైదానంలో అడుగుపెట్టిన వెంట‌నే ఈ ఫీట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లి ఆస్ట్రేలియాపై ఇప్పటివరకు 28 టెస్టులు, 49 వన్డేలు, 23 టీ20లు ఆడాడు.

ఈ అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో కోహ్లి కంటే ముందు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ తన కెరీర్‌లో కంగారులపై 39 టెస్టులు, 71 వన్డేలతో కలిపి 110 మ్యాచ్‌లు ఆడాడు. విరాట్‌ మరో 11 మ్యాచ్‌లో ఆడితే సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేసే ఛాన్స్‌ ఉంది.

ఆసీస్‌పై అదుర్స్‌.. 
కాగా ఆల్‌ఫార్మాట్లలో ఆసీస్‌పై కోహ్లికి అద్భుతమైన రికార్డు ఉంది. ఈ 100 మ్యాచ్‌ల్లో కోహ్లి 50.24 సగటుతో 5326 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా ఆస్ట్రేలియాపై 23 ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు.

ఆస్ట్రేలియాపై అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు
సచిన్ టెండూల్కర్ (భారత్)-110 మ్యాచ్‌లు
విరాట్ కోహ్లి(భారత్‌)-100 మ్యాచ్‌లు
డెస్మండ్ లియో హేన్స్ (వెస్టిండీస్)- 97 మ్యాచ్‌లు
మహేంద్ర సింగ్ ధోని( భారత్‌)- 91 మ్యాచ్‌లు
వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్)-88 మ్యాచ్‌లు
జాక్వెస్ కల్లిస్(దక్షిణాఫ్రికా)-82 మ్యాచ్‌లు
చదవండి: రోహిత్‌ శర్మ నిర్ణయం సరికాదు.. కమిన్స్‌ సంతోషించి ఉంటాడు: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement