ఆకుపచ్చ తెలంగాణను నిర్మిద్దాం
రామన్నపేట : హరితహారాన్ని విజయవంతం చేసి ఆకుపచ్చ తెలంగాణను నిర్మించుకుందామని జెడ్పీటీసీ జినుకల వసంత, ఎస్‌ఐ ప్యారసాని శీనయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని అభయాంజనేయ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. నాటిన ప్రతీ మొక్కను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. కార్యక్రమంలో డీలర్ రామిని రమేష్, వివిధ పార్టీల నాయకులు బందెల రాములు, జినుకల ప్రభాకర్, కక్కిరేణి విజయ్‌కుమార్, జెల్ల వెంకటేశం, సాల్వేరు లింగం, ఊట్కూరి నర్సింహ, గర్దాసు సురేష్, బత్తుల కృష్ణగౌడ్, కొంపల్లి విజయానందం, ఎం.డి నాజర్, గుత్తా నర్సిరెడ్డి, నోముల మారయ్య, కోట నరేందర్, ధర్మరాజు, శంకర్ పాల్గొన్నారు.