లాభాల్లో మొదలైన స్టాక్‌మార్కెట్లు | stock markets opens green.. nifty @9900 | Sakshi
Sakshi News home page

లాభాల్లో మొదలైన స్టాక్‌మార్కెట్లు

Published Mon, Aug 28 2017 9:29 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

stock markets opens green.. nifty @9900

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి.   అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్‌ 175 పాయింట్ల లాభంతో 31 800  స్థాయి వద్ద, నిఫ్టీ 45పాయింట్లు ఎగిసి 9900 స్థాయికిపైన పటిష్టంగా ప్రారంభమైయ్యాయి. ఫార్మ,ఎఫ్‌ఎంసీజీ సెక్టార్‌లో ఒత్తడిలో ఉన్నాయి. బ్యాంక్‌నిఫ్టీ లాభాల్లో ఉంది.

అదానీ, రిలయన్స్‌ ,లుపిన్‌, నెస్లీ ఐషర్‌ మోటార్స్‌ లాభపడుతుండగా, ముఖ్యంగా  ఇన్ఫోసిస్‌లో స్థిరత్వానికి   ఛైర‍్మన్‌ నందన్‌నీలేకని హామీ ఇవ్వడంతో ఈ స్టాక్‌పై ఇన్వెస్టర్లు  మొగ్గుచూపుతున్నారు.  డా. రెడ్డీస్‌ , హీరో  మోటో కార్ప్‌, టీసీఎస్‌,  బజాజ్‌ఆటో,  బారతి ఎయిర్‌ టెల్‌, ఐటీసీ , బీపీసీల్‌,  దీంతో ఇన్ఫోసిస్‌ బాగా లాభపడుతోంది.

అటు డాలర్‌ తో పోలిస్తే   రూపాయి 0.24 పైసల లాభంతో  రూ.63.88 వద్ద  కొనసాగుతోంది. పుత్తడి కూడా పాజిటివ్‌గా గానే ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో పది గ్రా. రూ.63 లు పెరిగి 29,162 వద్ద ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement