
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ సూచీలు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. చైనాలో కరోనా వైరస్ మళ్లీ విస్తరించడం, లాక్‌డౌన్ ఆంక్షలు, జీరో-కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా ప్రదర్శనల ఫలితంగా గ్లోబల్ మార్కెట్లు బలహీనపడ్డాయి. ఆదివారం షాంఘైలో ప్రదర్శనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ, ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో COVID-19 నిర్వహణపై ఆందోళనలు ఆసియా మార్కెట్ల పతనానికి దారి తీసాయి. దీంతో దేశీయ మార్కెట్లలో వరుస లాభాలకు చెక్ పడింది. అయితే ప్రస్తుతం నష్టాలనుంచి తేరుకుని సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 97 పాయింట్లు ఎగిసి 62,396 , నిఫ్టీ పాయింట్లు లాభంతో 18532వద్ద పటిష్టంగా కొనసాగుతున్నాయి.
బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బీపీసీఎల్, ఎస్‌బీఐ లైఫ, హీరో మోటో, రిలయన్స్, టాటా మోటార్స్ టాప్ విన్నర్స్‌గా, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్,హెచ్‌డీఎఫ్‌సీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టాల్లో 81.73 వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment