
ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హరిత యూనివర్సిటీ ర్యాంకు పొందింది. యూనివర్సిటీ ఆఫ్ ఇండోనేషియా ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సిటీలకు సోమవారం రాత్రి ‘యూఐ గ్రీన్ మెట్రిక్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2022’ పేరుతో ర్యాంకులు జారీ చేసింది. వీటిలో ఏఎన్‌యూ ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ర్యాంకును, జాతీయ స్థాయిలో 6వ, అంతర్జాతీయ స్థాయిలో 246 ర్యాంకును సొంతం చేసుకుంది.
ఆయా యూనివర్సిటీలలోని సెట్టింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ అండ్ క్‌లైమేట్ చేంజ్, వేస్ట్ ట్రీట్‌మెంట్, వాటర్ రిసోర్స్ యూసేజ్, ట్రాన్స్‌పోర్టేషన్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకులను కేటాయించింది. ఈ అంశాలన్నింటిలో 10వేల మార్కులకు గాను ఏఎన్‌యూ 7,325 మార్కులు దక్కించుకుని ఈ ర్యాంకులు సొంతం చేసుకుంది. ఏఎన్‌యూకి ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకు రావడం అభినందనీయమని వీసీ ఆచార్య పి.రాజశేఖర్ అన్నారు. యూనివర్సిటీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఎన్‌యూకి ఐదేళ్లలో 150 జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులు రావడాన్ని పురస్కరించుకొని వీసీ కేక్ కట్ చేశారు. వర్సిటీ ర్యాంకింగ్స్ కో–ఆర్డినేటర్ డాక్టర్ భవనం నాగకిషోర్‌ను అభినందించారు.
ఇదీ చదవండి: ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్ సర్కిల్ పెట్టుబడులు
Comments
Please login to add a commentAdd a comment