ఎఎన్ యూలో మద్యం బాటిళ్ల కలకలం | 3 more students suspended in nagarjuna university | Sakshi
Sakshi News home page

ఎఎన్ యూలో మద్యం బాటిళ్ల కలకలం

Published Thu, Aug 6 2015 8:10 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో కొంతమంది సీనియర్ విద్యార్థులు మద్యం బాటిళ్లతో హల్ చల్ చేశారు.

నాగార్జున యూనివర్సిటీ(గుంటూరు): నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో కొంతమంది సీనియర్ విద్యార్థులు మద్యం బాటిళ్లతో హల్ చల్ చేశారు. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న మణికంఠ, సాయి చరణ్, అబ్బాస్ లు బుధవారం రాత్రి క్యాంపస్ హాస్టల్‌లోకి మద్యం సీసాలు తెచ్చేందుకు యత్నించారు. అయితే వీరిని అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు.. గురువారం ఉదయం వర్సిటీ అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు.

 

దీంతో వెంటనే స్పందించిన అధికారులు ఆ ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థుల సంజాయిషీ, తల్లిదండ్రుల హామీ ఉంటేనే వారిని తిరిగి కళాశాలలోకి అనుమతించే విషయం పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement