
పచ్చని పల్లె!
ఇంటిని ఉపయోగించకుండా ఖాళీగా వదిలేస్తే ఏమవుతుంది? శిథిలమై ఎందుకూ పనికిరాకుండా పోతుంది. మరి ఏకంగా ఒక ఊరినే అలా వదిలేస్తే ఏమవుతుంది? ఇదిగో.. ఇలా తయారవుతుంది. చైనాలోని యాంగ్జే నది ఒడ్డున హౌటౌ వాన్ అనే చిన్నగ్రామం ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం అక్కడ మత్స్యకారులు నివసించేవారు. కాలక్రమంలో అక్కడ జీవనోపాధి కష్టం కావడంతో వారంతా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. దీంతో గ్రామం మొత్తం ఖాళీ అయిపోయింది. అనంతరం 50 ఏళ్లలో అక్కడి ఇళ్లు పాడైపోయినా, వాటి నిండా మొక్కలు ఎదగడంతో ఇలా పచ్చదనంతో నిండిపోయింది. చూడటానికి ఆకర్షణీయంగా ఉండటంతో ప్రస్తుతం ఇదో పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. ఈ పచ్చని పల్లెను చూడటానికి పర్యాటకులు క్యూ కడుతున్నారట..!