మనం ఎవరి వల్ల అయినా సాయం పొందితే దాన్ని తిరిగి చెల్లించగలిగే స్థాయి చేరుకున్నాక గుర్తుపెట్టుకుని తిరిగి ఇవ్వాలంటారు పెద్దలు. అయితే అందరూ ఇలా గుర్తించుకుని కృజ్ఞతను చాటుకోరు. కొందరూ మాత్రం అంతకు మించి అన్నట్లుగా దాతృత్వ కార్యక్రమాలతో ఆశ్చర్యపరుస్తారు. పొందిన సాయం అణువంతా అయినా ఆకాశంతా స్థాయిలో కృతజ్ఞత చూపి గుండెల్లో నిలిచిపోతుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే ఈ చైనాకు చెందిన మాజీ సీఈవో.
చైనా(China) ఈ-కామర్స్ దిగ్గజం జేడీ డాట్ కామ్(e-commerce giant JD.com) వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో(former CEO ) బిలియనీర్(billionaire ) రిచార్డ్ లియు క్వియాంగ్‌డాంగ్(Richard Liu Qiangdong) చైనా నూతన ఏడాది ప్రారంభానికి ముందు తన స్వస్థలంలోని నివాసితులకు లక్షల్లో ఖరీదు చేసే బహుమతులను అందించి వార్తల్లో నిలిచారు.
60 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ప్రతి గ్రామస్తుడికి సుమారు లక్ష రూపాయలకు పైనే విలువ చేసే నగదుని బహుమతిగా అందజేశారు. దీంతోపాటు ప్రతి ఇంటికి ఆహారం, బట్టలు, గృహోపకరణాలను అందజేశారు. అతను ఇలా 2016 నుంచి దాతృత్వ కార్యక్రమాలను చేస్తూ కృతజ్ఞతను చాటుకుంటున్నాడు.
ఆ గ్రామమే ఎందుకంటే..
గ్వింగ్మింగ్ గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబంలో జన్మించాడు రిచార్డ్. 1990ల సమయంలో చైనా రెన్మిన్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించడం కోసం బీజింగ్ వెళ్లేందుకు తగిన డబ్బు లేక ఇబ్బంది పడ్డాడు. అప్పుడు గ్రామస్తులంతా సమావేశమై అతని ట్యూషన్ ఫీజులకు నిధులు సమకూర్చారు.
దీంతో అతడు ఉన్నత చదువులను చదువుకోగలిగాడు. ఆ గ్రామస్తులంతా కలిసి క్వియాంగ్‌డాంగ్‌కి ఆనాడు ఇచ్చిన మొత్తం సుమారుగా రూ. 5 వేలు. కానీ ఆ చిన్న మొత్తం ఆ రోజు ఇచ్చేందుకు వారంతా ముందుకురాకపోయి ఉంటే ఈ రోజు ఈ స్థితిలో ఉండేవాడిని కాదంటాండు మాజీ సీఈవో రిచార్డ్. అది గుర్తించుకునే ఆ గ్రామానికి ఇలా ప్రతి ఏటా విలువైన నగదు, గృహపకరణాల రూపంలో సాయం అందిస్తుంటారు.
ఈ దాతృత్వ సేవను కొనసాగించేందుకు తన బృందాన్ని ఆగ్రామంలోకి పంపించి గ్రామస్తుల గృహ రిజిస్ట్రీ, గుర్తింపు పత్రాలను సేకరించి వారు ఆ గ్రామానికి చెందిన వారని నిర్థారించుకుని రిచార్డ్ సాయం అందేలా మార్గం సుగమం చేస్తారు.
అలాగే ఆ గ్రామస్తులు కూడా అతడి దాతృత్వాన్ని మర్చిపోలేమని, మా పట్ల అతడు చూపించే దయ అపారమైందంటూ రిచార్డ్‌పై ప్రశంసలజల్లు కురిపించారు. అతడు ఈ సేవలను భవిష్యత్తులో కొనసాగించకపోయినా కూడా..అతడు ఇప్పటి వరకు చేసిన సాయాన్ని, కృజ్ఞతను మర్చిపోమని భావోద్వేగంగా చెబుతున్నారు గ్రామస్తులు.
(చదవండి: 'ఇంజనీర్ బాబా': ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫోటోగ్రఫీ వదిలి మరీ..)
Comments
Please login to add a commentAdd a comment