
ఆకుపచ్చ దుస్తుల్లో డాక్టర్లు (ఫైల్ ఫొటో)
ఆకుపచ్చ రంగు క్షేమానికి, సస్యశ్యామలానికి గుర్తు. సాధారణంగా ఆస్పత్రుల్లో రక్తపు మరకలు అంటుకునే అవకాశం ఎక్కువ. వేరే రంగు దుస్తులు వాడితే ఆ ఎరుపు రంగు మరింత బాగా కనిపించి రోగులను వారి బంధువుల్ని భయాందోళనలకు గురిచేసే అవకాశం ఉంది. ఆకుపచ్చ బట్టలపై రక్తం చిందినా అది ఎర్రగా కాకుండా నల్లగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆకుపచ్చ, ఎరుపు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైన రంగులు. ఈ రెండు రంగులూ ఒకదానిలో ఒకటి కలిసిపోయి కొత్త రంగు ఏర్పడుతుంది. ఆ రంగు నలుపుగా ఉంటుంది. అంటే ఆకుపచ్చ రంగు మీద పడ్డ రక్తపు మరకలు నల్లగా కనిపించడం వల్ల రోగికి భయం అనిపించదు. అందువలనే ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లలో వైద్యులు, నర్సులు ఆకుపచ్చని దుస్తులు ధరిస్తారు. కొన్ని ఆస్పత్రి వార్డుల్లో పేషెంట్లకు కూడా ఆకుపచ్చని దుస్తులు ఇస్తారన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment