శుభ్రత కోసం పరుగు
శుభ్రత కోసం పరుగు
Published Sat, Nov 26 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
కర్నూలు(హాస్పిటల్): పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పచ్చదనాన్ని కాపాడాలన్న నినాదంతో ఎన్‌సీసీ కేడెట్లు శనివారం కర్నూలు నగరంలో పరుగు తీశారు. 68వ ఎన్‌సీసీ డే ఉత్సవాలను పురస్కరించుకుని కలెక్టరేట్ వద్ద ' గో గ్రీన్ గో క్లీన్' పేరుతో టు కే రన్ కార్యక్రమాన్ని కర్నూలు ఎన్‌సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ పీజీ కృష్ణ ప్రారంభించారు. పరుగు కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో 300 మంది ఎన్‌సీసీ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ పాల్గొని ప్రసంగించారు. ఎన్‌సీసీతో క్రమశిక్షణ గల జీవితం అలవడుతుందని, ప్రతి విద్యార్థి ఎన్‌సీసీలో పాల్గొనాలని సూచించారు. అనంతరం ఆయన వివిధ అంశాల్లో ప్రతిభ కనపరిచిన ఎన్‌సీసీ కేడెట్లకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో లెఫ్ట్‌నెంట్ కల్నల్ గౌస్‌బేగ్, ఎస్‌కే సింగ్, మధు, ఎన్‌సీసీ అధికారి పివి శివయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement