Venice
-
ఇటలీలో బ్రిడ్జిపై నుంచి పడిన బస్సు..
వెనీస్: ఇటలీలోని వెనీస్ నగర సమీపంలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న బస్సు అదుపు తప్పి, 50 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. అనంతరం బస్సులో మంటలు చెలరేగడంతో 21 మంది ప్రయాణికులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. వీరిలో 9 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది విదేశీ పర్యాటకులే. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పేశారు. సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సు ప్రమాదంలో 21 మంది మృతిచెందడం పట్ల వెనీస్ సిటీ మేయర్ బ్రుగ్నారో సంతాపం ప్రకటించారు. -
వీడియో: వెనిస్ మిస్టరీ.. రాత్రికి రాత్రే రంగు మారిపోయింది!
-
Venice: రాత్రికి రాత్రే రంగు మారింది!
వైరల్ న్యూస్: ఇటలీ నీటి నగరం వెనిస్లో ఆసక్తికర ఘటన ఒకటి జరిగింది. తేట నీరుతో టూరిస్టులను ఆకట్టుకునే అక్కడి గ్రాండ్ కెనాల్ నీటి రంగు.. రాత్రికి రాత్రే మొత్తం ఆకుపచ్చగా మారింది. ఆదివారం ఉదయం కాలువ రంగు మారిపోవడంతో అక్కడి ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వెనెటో రీజియన్ రాజధాని వెనిస్లో Grand Canal నీరు అసాధారణ రీతిలో ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. తెల్లవారు జామున రియాల్టో బ్రిడ్జి వద్ద తొలుత అది గమనించిన కొందరు స్థానికులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు వెనెటో రీజియన్ ప్రెసిడెంట్ లూకా జాయియా ఆదేశించారు. మరోవైపు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక నీరు రంగు మారిన పరిణామం రకరకాల ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. ఇది ఆల్గే(నాచు) వల్ల సంతరించుకుంది కాదని పరిశోధకులు ప్రకటించారు. దీంతో.. బహుశా ఎవరైనా నిరసకారులు లేదంటే ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వాళ్లను కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు. The water in the Grand Canal in Venice has turned bright green. Has grown significantly. pic.twitter.com/N7js56Vmiy — Animal World (@dragon_of_time_) May 28, 2023 ఇదిలా ఉంటే.. వెనిస్ గ్రాండ్ కెనాల్ ఇలా రంగు మారడం ఇదే తొలిసారి కాదు. గతంలో.. 1968లో అర్జెంటీనా ఆర్టిస్ట్ నికోలస్ గార్సియా ఉద్దేశపూర్వకంగానే గ్రాండ్ కెనాల్లో ఫ్లూరెసెయిన్ అనే డైని కలిపారు. ఆ టైంలో వెనిస్ ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్ జరగాల్సి ఉండగా.. పర్యావరణ సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో ఆ టైంలో ఆయన ఆ పని చేశారు. -
Winter: వేడినీటి బుగ్గల్లో స్నానాలు.. ముల్లంగి, తామరతూళ్లు తింటే..!
Funday Cover Story- Worldwide Winter Festivals: శీతకాలం చిరుచలితో మొదలై, గజగజ వణికించే స్థాయికి చేరుతుంది. చలిపంజా దెబ్బకు జనాలు రాత్రివేళ ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టేందుకే వెనుకాడుతారు. శీతకాలం రాగానే, అప్పటివరకు అలమరాల అట్టడుగున పడివున్న చలిదుస్తులు ఒంటిమీదకు వస్తాయి. వీథుల్లో చలిమంటల సందడి మొదలవుతుంది. చలితీవ్రత పెరిగే కొద్ది, మనుషులకు వణుకూ పెరుగుతుంది. చలిలో ఆరుబయటకు వచ్చేవాళ్లు ఒద్దికగా చేతులు కట్టుకుని చలిని కాచుకుంటారు. చలికాలంలో కొన్నిచోట్ల తెరిపిలేని హిమపాతంతో నేలంతా మంచుతో నిండిపోతుంది. శీతకాలం మొదలయ్యే వేళ దీపావళి, శీతకాలం తారస్థాయిలో ఉండేటప్పుడు మకరసంక్రాంతి వేడుకలను మనం జరుపుకొంటాం. శీతకాలంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు వారి వారి సంప్రదాయ వేడుకలను జరుపుకొంటారు. వ్యవసాయ పనులు ముగిసి, కాస్త తీరిక దొరికే కాలం కావడంతో సంబరాలు చేసుకుంటారు. కాలానికి తగినట్లుగా ప్రత్యేకమైన వంటకాలను ఆగరిస్తారు. ఆరుబయటకు చేరి ఆట పాటలతో శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. వివిధ దేశాల్లో జరుపుకొనే శీతకాల సంబరాలను, వాటి విశేషాలను తెలుసుకుందాం... షెట్లాండ్ వైకింగ్ ఫెస్టివల్ స్కాట్లాండ్లోని షెట్లాండ్ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలు ముగిసినప్పటి నుంచి మూడునెలల వరకు సుదీర్ఘంగా కొనసాగే చలిమంటల వేడుక ‘షెట్లాండ్ వైకింగ్ ఫెస్టివల్’. స్థానికంగా ఈ వేడుకలను ‘అప్ హెలీ ఆ’ అంటారు. షెట్లాండ్ రాజధాని లెర్విక్లో ఈ వేడుకల్లో భాగంగా జనవరి మూడో మంగళవారం రోజున జనాల ఆట పాటలతో వాద్యాల హోరుతో భారీ ఊరేగింపు జరుగుతుంది. వైకింగ్‌ల పొడవాటి పడవలను అనుకరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులు ధరించి, మేళతాళాలతో ఈ ఊరేగింపులో పాల్గొంటారు. తొలినాళ్లలో తారుపీపాలకు నిప్పుపెట్టి స్లెడ్జిబళ్ల మీద మంచునిండిన వీథుల్లోకి లాక్కొచ్చేవారు. ఇటీవలికాలంలో తారుపీపాలకు నిప్పుపెట్టడం వంటి పనులు మానేసి, ఎక్కడికక్కడ చలిమంటలు వేసుకుని, వేడుకలు జరుపుకొంటున్నారు. వెనిస్ కార్నివాల్ ఇటలీలోని వెనిస్ నగరంలో శీతకాలం ముగుస్తూ ఉండే సమయంలో జరిగే ఉత్సవం ఇది. క్రైస్తవుల ఉపవాస దినాలైన ‘లెంట్’ రోజుల్లోని ‘యాష్ వెన్స్డే’ నుంచి మొదలయ్యే వెనిస్ కార్నివాల్ ‘ష్రోవ్ ట్యూస్డే’ వరకు మూడువారాల పాటు జరిగే ఈ వేడుకల్లో భారీ ఎత్తున జనాలు పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి సుమారు ముప్పయి లక్షలకు పైగా జనాలు వెనిస్ వీథుల్లో జరిగే ఊరేగింపుల్లో చిత్రవిచిత్ర వేషధారణలతో రకరకాల మాస్కులు ధరించి తిరుగుతూ సందడి చేస్తారు. ఈ వేడుకల్లో భాగంగా వెనిస్ కూడళ్లలో ఏర్పాటు చేసే బహిరంగ వేదికలపై సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ముఖాలకు మాస్కులు ధరించడాన్ని రోమన్ చక్రవర్తి 1797లో నిషేధించడంతో చాలాకాలం ఈ వేడుకలు కనుమరుగయ్యాయి. ఇటలీ ప్రభుత్వం సాంస్కృతిక పునరుద్ధరణలో భాగంగా 1979 నుంచి పునఃప్రారంభించడంతో వెనిస్ కార్నివాల్ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే స్థాయికి చేరుకుంది. లా ఫాలాస్ వాలెన్షియా స్పెయిన్‌లోని వాలెన్షియా నగరంలోను, చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాల్లోను ఈ వేడుకలు ఏటా మార్చి 1 నుంచి 19 వరకు జరుగుతాయి. ఈ వేడుకల్లో మార్చి 15 నుంచి 19 వరకు ఐదురోజుల పాటు సెయింట్ జోసెఫ్ స్మారకార్థం ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీథుల్లో చలిమంటలను వెలిగించి ఆటపాటలతో జనాలు కాలక్షేపం చేస్తారు. మార్చిలో శీతకాల సంబరాలేమిటా అనుకోకండి. అక్కడ మార్చిలోనూ మంచు కురుస్తూనే ఉంటుంది. చలిమంటల ముందు సేదదీరుతూ విందు వినోదాలు, గానా భజానాలతో జనం ఉల్లాసంగా గడుపుతారు. ఈ రోజుల్లో ప్రత్యేకంగా తయారు చేసే బిర్యానీ మాదిరి ‘ప్యేలా’ అనే వంటకాన్ని సామూహిక విందుల్లో వడ్డిస్తారు. దీని తయారీలో బియ్యం, మేక, గొర్రె, కుందేలు, కోడి, చేపలు, ప్రత్యేక సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తారు. లా ఫాలెస్ వాలెన్షియాను ‘యునెస్కో’ వారసత్వ వేడుకగా గుర్తించింది. నయాగరా వింటర్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ నయాగరా జలపాతం మామూలుగా చూస్తేనే కళ్లకు మిరుమిట్లు గొలుపుతుంది. ఇక శీతకాలంలో రాత్రివేళ ఈ జలపాతం వద్ద ఆరుబయట చేసే విద్యుద్దీపాలంకరణలు చూస్తే, రంగు రంగుల నక్షత్రాలు కళ్లముందే కదలాడినట్లుంటుంది. నయాగరా జలపాతం వద్ద కెనడాలో ఏటా శీతకాలం పొడవునా ‘వింటర్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్’ వేడుకలను దేదీప్యమానంగా నిర్వహిస్తారు. ఈసారి నవంబర్ 12న మొదలైన ఈ వేడుకలు ఫిబ్రవరి 20 వరకు కొనసాగనున్నాయి. విద్యుద్దీప కాంతుల వెలుగులో ధగధగలాడే నయాగరా అందాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు. ఈ సందర్భంగా పలు వినోద కార్యక్రమాలు, బాణసంచా ప్రదర్శనలు కూడా జరుగుతాయి. హార్బిన్ ఐస్ అండ్ స్నో స్కల్ప్చర్ ఫెస్టివల్ చైనాలో ఏటా శీతకాలంలో జరిగే అంతర్జాతీయ హిమశిల్పకళా వేడుకలు ఇవి. హీలోంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని హార్బిన్ నగరంలో జరిగే ఈ వేడుకలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి దాదాపు రెండుకోట్ల మంది వరకు వస్తారు. ప్రపంచంలోనే అత్యంత భారీ హిమశిల్పాలు ఈ ఉత్సవాల్లో కొలువుదీరుతాయి. హార్బిన్ నగరంలోని కూడళ్లలోను, నగరం మీదుగా ప్రవహించే సోంఘువా నదీ తీరంలోను భారీ ఎత్తున హిమశిల్పాలను ఏర్పాటు చేస్తారు. సైబీరియా మీదుగా వీచే చలిగాలుల వల్ల సోంఘువా నదిలోని నీళ్లు గడ్డకట్టిపోతాయి. నదిలో నుంచి వెలికితీసిన భారీ మంచుదిమ్మలతోనే స్థానిక కళాకారులు శిల్పాలను చెక్కి, ప్రదర్శనకు ఉంచుతారు. చైనాలో ఈ వేడుకలు 1963 నుంచి జరుగుతూ వస్తున్నాయి. ఏటా డిసెంబర్ చివరి వారం నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు జరిగే ఈ వేడుకల ద్వారా చైనా ప్రభుత్వానికి పర్యాటక ఆదాయం దండిగానే లభిస్తుంది. టోజి మత్సురి జపాన్‌లో జరుపుకొనే శీతకాల వేడుకలు ‘టోజి మత్సురి’. ఈ వేడుకలనే ‘టోజిసాయి’ అని కూడా అంటారు. మంచు కురిసే ప్రాంతాల్లో ఆరుబయట గుడారాలు వేసుకుని, వాటి ముందు చలిమంటలు వేసుకుని, ఆటపాటలతో గడుపుతారు. ‘ఓన్సెన్’ అనే వేడినీటి బుగ్గల్లో స్నానాలు చేస్తారు. నిజానికి ఈ వేడినీటి బుగ్గల్లో ఏడాది పొడవునా స్నానాలు చేస్తుంటారు గాని, శీతకాలం తప్పనిసరిగా వీటిలో స్నానం చేయడం ఆరోగ్యకరమని జపానీయులు నమ్ముతారు. గతించిన పెద్దలను తలచుకుంటూ చెరువుల్లో దీపాలను విడిచిపెడతారు. శీతకాలంలో గుమ్మడి, క్యారెట్, ముల్లంగి, తామరతూళ్లు తినడం శుభప్రదమనే నమ్ముతారు. ముఖ్యంగా తామరతూళ్లతో తయారుచేసే రెన్కాన్ చిప్స్‌ను చిన్నాపెద్దా ఇష్టంగా తింటారు. రేక్జావిక్ వింటర్ లైట్స్ ఫెస్టివల్ ఐస్లాండ్లోని రేక్జావిక్ నగరంలో ఏటా శీతకాలంలో వింటర్ లైట్స్ ఫెస్టివల్ వేడుకలు జరుగుతాయి. నగరంలోని చారిత్రిక కట్టడాలు, మ్యూజియమ్లు, పార్కులు, ఈతకొలనులు, మైదానాలు వంటివాటిని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. నగరంలోని వేడినీటి బుగ్గలలో జనాలు ఈతలు కొడతారు. వేడుకలు జరిగేంత కాలం రాత్రివేళల్లో మ్యూజియమ్లన్నీ సందర్శకుల కోసం తెరిచే ఉంచుతారు. కూడళ్లలో ఏర్పాటు చేసే తాత్కాలిక వేదికలపైనా, నగరంలోని రంగస్థలాలపైన సంగీత, నృత్య, వినోద కార్యక్రమాలు కోలాహలంగా సాగుతాయి. హ్వాషియోన్ సాన్షియోనియో ఐస్ ఫెస్టివల్ దక్షిణ కొరియాలోని గాంగ్వన్ డో ప్రావిన్స్‌లో ఏటా శీతకాలంలో ఐస్ ఫెస్టివల్ వేడుకలు జరుగుతాయి. హ్వాషియోన్ నగరంలో గడ్డకట్టిన నదిపై రకరకాల క్రీడలు, వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. నది ఎగువ ప్రాంతంలోని సాన్షియోనియో వద్ద మంచుదిమ్మల మీద ఏర్పడిన రంధ్రాల గుండా చేపలను పట్టే పోటీలను నిర్వహిస్తారు. భారీస్థాయి మంచుశిల్పాలను తీర్చిదిద్ది ప్రదర్శిస్తారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొరియన్ ప్రభుత్వం ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఏటా జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరిగే ఈ వేడుకలు తిలకించేందుకు దేశ విదేశాల నుంచి 15 లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తుంటారు. డ్రాగన్ కార్నివాల్ స్లోవేనియా రాజధాని ల్యూబ్లీయానలో ఏటా శీతకాలంలో జరిగే సంప్రదాయ వేడుక డ్రాగన్ కార్నివాల్. పురాతన పేగన్ సంస్కృతికి ఆనవాలుగా కొనసాగే ఈ వేడుకల్లో భారీ ఊరేగింపులు నిర్వహిస్తారు. వేలాది మంది చిత్రవిచిత్రమైన మాస్కులు, రంగు రంగుల దుస్తులు ధరించి పాల్గొంటారు. భారీసైజులోని ఆకుపచ్చని డ్రాగన్ బొమ్మను మోసుకుంటూ ఊరేగిస్తారు. సంప్రదాయ వాద్యపరికరాలను మోగిస్తూ, నాట్యం చేస్తూ నగర వీథుల్లో సందడి చేస్తారు. పదమూడో శతాబ్దిలో పేగన్, క్రైస్తవ సంస్కృతులు పరస్పరం కలగలసిపోయిన నాటి నుంచి డ్రాగన్ కార్నివాల్ జరుగుతూ వస్తోందని చెబుతారు. నలభైరోజుల లెంట్ ఉపవాస దినాలకు ముందుగా, జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సంబరాన్ని నిర్వహిస్తారు. కలోన్ వింటర్ కార్నివాల్ జర్మనీలోని కలోన్ నగరంలో ఏటా వింటర్ కార్నివాల్ వేడుకలు భారీ స్థాయిలో జరుగుతాయి. పదకొండో నెల పదకొండో తేదీన– అంటే, ఏటా నవంబర్ 11న ఉదయం 11.11 గంటల నుంచి ‘కార్నివాల్’ సీజన్ మొదలవుతుంది. వీథుల్లో చిత్రవిచిత్ర వేషధారణలతో నిర్వహించే ఊరేగింపులతో ఈ వేడుకలు జనవరి 6 వరకు కొనసాగుతాయి. ఈ రోజుల్లో ‘ఫ్యాట్ థర్స్డే’ నుంచి ‘యాష్ వెన్స్డే’ వరకు వారం రోజులను ‘క్రేజీ డేస్’ అంటారు. ఈ వారం రోజుల్లోనూ మరింత భారీ స్థాయిలో వేడుకలు జరుగుతాయి. పిల్లలూ పెద్దలూ వీథుల్లోకి చేరి, ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. వివిధ దేశాల నుంచి వచ్చే బ్యాండ్ బృందాలు, నృత్యబృందాలు ఊరేగింపుల్లో పాల్గొంటాయి. కలోన్ కార్నివాల్లో పాల్గొనేందుకు ముఖ్యంగా యూరోప్ నలుమూలల నుంచి జనాలు పెద్దసంఖ్యలో వస్తారు. సప్పోరో స్నో ఫెస్టివల్ జపాన్‌లోని సప్పోరో నగరంలో ఏటా ఫిబ్రవరిలో జరిగే వేడుక ఇది. మంచుగడ్డ కట్టే పరిస్థితుల్లో మంచుతో శిల్పాలను తీర్చిదిద్ది ప్రదర్శిస్తారు. ఈసారి 2023 ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. సప్పోరో నగరంలోని ఓడోరి పార్క్, సుసుకినో, సుడోమ్ సహా పలు ప్రదేశాలు ఈ వేడుకల్లో హిమశిల్ప ప్రదర్శనలకు వేదికలుగా నిలుస్తాయి. ఓడోరి పార్క్‌లో హిమశిల్పాల పోటీలు కూడా జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలలకు చెందిన కళాకారులు వందలాదిగా ఇక్కడకు వస్తుంటారు. సప్పోరో స్నో ఫెస్టివల్ 1950లో తొలిసారిగా ఒకరోజు కార్యక్రమంగా మొదలైంది. అప్పట్లో ఆరుగురు హైస్కూల్ విద్యార్థులు ఓడోరి పార్క్‌లో చేరి, మంచుతో శిల్పాలు మలచి సందర్శకులను ఆకట్టుకున్నారు. జపాన్ సైనిక దళాలు కూడా 1955 నుంచి ఈ వేడుకల్లో పాల్గొనడం ప్రారంభించడంతో ఇవి వారంరోజుల వేడుకలుగా మారాయి. అనతికాలంలోనే ఈ వేడుకలు అంతర్జాతీయ ప్రాచుర్యం పొందాయి. ఇక్కడి హిమశిల్పాలను తిలకించడానికి దేశవిదేశాల నుంచి ఏటా దాదాపు పాతిక లక్షల మంది వరకు పర్యాటకులు వస్తుంటారు. సెయింట్ పాల్ వింటర్ కార్నివాల్ అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్ర రాజధాని సెయింట్ పాల్లో ఏటా శీతకాలంలో భారీ కార్నివాల్ జరుగుతుంది. ఈ కార్నివాల్ వెనుక ఒక కథ ఉంది. న్యూయార్క్‌కు చెందిన ఒక పాత్రికేయుడు సెయింట్ పాల్‌ను ‘మరో సైబీరియా’గా పోలుస్తూ కథనం రాశాడు. శీతకాలంలో ఇక్కడ మనుషులు బతకలేరని అతను రాశాడు. ఈ కథనం స్థానికులకు కోపం తెప్పించింది. శీతకాలంలో కూడా సెయింట్ పాల్లో మనుషులు బతుకుతారని, అంతేకాదు, ఉల్లాసంగా ఉత్సాహంగా వేడుకలూ జరుపుకొంటారని రుజువు చేసేందుకు 1885లో మాంట్రియల్ సరిహద్దుల్లో ఒక మంచుసౌధాన్ని నిర్మించి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు 1937 వరకు ఒక క్రమం లేకుండా జరుగుతూ వచ్చాయి. తిరిగి 1946 నుంచి ఏటా క్రమపద్ధతిలో నిర్వహించడం ప్రారంభమైంది. ఈ వేడుకల కోసం భారీ హిమసౌధాన్ని సిద్ధం చేస్తారు. వీథుల్లో పరేడ్లు, రాత్రివేళల్లో కాగడాల ఊరేగింపులు, సంగీత నృత్య కార్యక్రమాలు, హిమశిల్పాల తయారీ పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్యూబెక్ వింటర్ కార్నివాల్ కెనడాలోని క్యూబెక్ నగరంలో ఏటా ఫిబ్రవరిలో పదిరోజుల పాటు వింటర్ కార్నివాల్ జరుగుతుంది. ఈసారి ఫిబ్రవరి 3 నుంచి 12 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. క్యూబెక్‌లో 1893 నుంచి జరుగుతూ వస్తున్న ఈ కార్నివాల్లో పాల్గొనేందుకు కెనడా, అమెరికా, యూరోప్‌ల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. నగరంలో పగలూ రాత్రీ కూడా కోలాహలంగా ఊరేగింపులు జరుగుతాయి. వాద్యపరికరాలను మోగిస్తూ, విచిత్రవేషధారణలతో వేలాది మంది ఈ ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మంచుశిల్పాల ప్రదర్శనలు, క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. Funday Cover Story: అత్యధిక దూరం వలసపోయే పక్షి ఏదో తెలుసా? -
Ganvie: బతికి తేలిన ఊరు
సాగరానికి చేరువలో నీటి మధ్య కొలువైన అద్భుతం.. వెనిస్ నగరం. ఆ ఊరు పేరు చెప్పగానే ఎటుచూసినా నీరు.. మధ్యలో అందమైన భవనాలు.. వంతెనలు.. పడవ ప్రయాణాలు.. కళ్లల్లో మెదులుతాయి. అయితే అలాంటి హంగులేవీ లేని వెనిస్ గురించి ఎప్పుడైనా విన్నారా? చీకటి ఖండం ఆఫ్రికాలో ఉంది ఆ ఊరు. పేరు.. గాన్వీ. నీటిపై తేలియాడే ప్రాంతాలు నిజంగా అద్భుతాలు. అలాంటి అద్భుతాల్లో ఒకటే గాన్వీ. వెనిస్ అంత కాకపోయినా ఈ ఊరూ పర్యాటకానికి వరల్డ్ ఫేమస్సే. కారణం.. నీటి అందాలతో పాటు ఈ ఊరికి ఉన్న చారిత్రక నేపథ్యం. ఇది పశ్చిమ ఆఫ్రికా, బెనిన్ ప్రాంతంలోని నోకోయూ సరస్సు మధ్యలో ఉంటుంది. బానిసత్వం రాజ్యమేలిన కాలంలోనే గాన్వీ వెలిసిందని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. సుమారు నాలుగు వందల ఏళ్ల కిందట టోఫిన్ గ్రామ ప్రజలు.. ఫోన్తెగ పోరాటయోధులకు భీతిల్లి ఇలా నీటి మధ్యలో ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఫోన్తెగ వాళ్లు తమను బానిసలుగా అప్పజెప్తారనే భయంతోనే టోఫిను ప్రజలు పారిపోయారు. అలా సరస్సు మధ్యలో వెలిసిన ఆ ఊరు.. ఇప్పుడు పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. గాన్వీ అంటే వాళ్ల భాషలో ‘బతికి బట్టకట్టాం’ అని అర్థం. అందుకే ఆ పేరొచ్చింది గాన్వీ జనాభా ముప్పై వేలకు పైనే. వీళ్లు సరస్సు మధ్యలో గట్ల వెంట ఆరడుగుల కంటే ఎత్తులో వెదురు బొంగులు, చెక్కలతో ఇళ్లు నిర్మించుకున్నారు. మూడు వేలకు పైగా భవనాలు నీటి మధ్యలోనే ఉంటాయి. అందులో రెండు బడులు, ఓ బ్యాంకు, ఓ పోస్టాఫీస్, ఇంకా ప్రార్థన మందిరాలు ఉన్నాయి. నీటి ఆవాసం కారణంగా వీళ్లను ‘నీటి మనుషులు’(వాటర్ మెన్) అని వ్యవహరిస్తుంటారు. ఊరిలో తిరగడానికి ఏకైక మార్గం.. చిన్నపడవలు. అందుకే గాన్వీకి ‘వెనిస్ ఆఫ్ ఆఫ్రికా’ అనే పేరొచ్చింది. కోళ్లను ఎక్కువగా తినే గాన్వీ ప్రజలు.. తాటాకులతో, గడ్డిపోచలతో చేపలనూ వేటాడి తింటారు. ఒకప్పుడు చేపలు పట్టడమే ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి. కానీ ఇప్పుడు దాన్ని పక్కనపెట్టి.. టూరిస్ట్ గైడ్స్‌గా మారిపోతున్నారు. రీజన్.. టూరిస్టులు క్యూ కడుతుండడమే. సోలార్ ప్యానెల్స్, జనరేటర్స్, సరస్సు నీటితో కరెంట్ అందుతోంది ఈ ఊరికి. పడవల మీదే తిరుగుతూ కూరగాయలు, నిత్యావసరాలు అమ్ముతుంటారు. 1996లో గాన్వీ.. వెనిస్ ఆఫ్ ఆఫ్రికాకు ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈమధ్యే స్ట్రీమింగ్‌లోకి వచ్చిన డాక్యుసిరీస్ ‘హై ఆన్ ది హోగ్: హౌ ఆఫ్రికన్ అమెరికన్ కజిన్ ట్రా¯Œ్సఫార్మ్డ్ అమెరికా’లో గాన్వీ గురించీ ఉంటుంది. రణగొణ ధ్వనులకు దూరంగా.. రాకపోకలకు బాటలుగా పిల్ల కాలువలున్నాయి. అందుకే కాలుష్యం ఈ నగరానికి ఆవలే ఉండిపోయింది. ఓవైపు వరదలు పోటెత్తుతున్నా.. మరోవైపు పర్యాటకులతో కిటకిటలాడుతోంది గాన్వీ. అందుకు కారణం.. మనసుకు సాంత్వననిచ్చే ప్రాంతం కావడమే. మొసలి రాజు? ఈ ఊరికి ఓ నేపథ్య కథ కూడా ప్రచారంలో ఉంది. బానిసత్వమంటే టోఫిన్ ప్రజలు భయపడుతున్న సమయంలో.. గాన్వీ రాజు ఒక కొంగగా మారి సురక్షితమైన ప్రదేశం కోసం గాలించాడు. ఆ తర్వాత నోకోయూ సరస్సును సురక్షితమైన ప్రాంతంగా గుర్తించి వాళ్లను అక్కడికి వెళ్లమని సూచించాడు. అయితే తమ వస్తువులతో అక్కడికి వెళ్లడం కష్టంగా మారడంతో.. భారీ మొసలిగా మారిన ఆ రాజు తన వీపుపై వాళ్లందరినీ మోసుకుంటూ వెళ్లాడట. తీరా ఆ సరస్సులో శాపగ్రస్త ఆత్మలు ఉన్నాయనే భయంతో నది నీటిని తాకకూడదనే ఉద్దేశంతో కాస్త ఎత్తులో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని ఆ కథ సారాంశం. అయితే గాన్వీ నేటి తరం మాత్రం అలాంటి నమ్మకాలేవీ లేకుండా.. మొసళ్లు లేని ఆ సరస్సులో హాయిగా జీవిస్తోంది. -భాస్కర్ శ్రీపతి -
వరల్డ్ గ్రేటెస్ట్ లవర్: ‘ఆయనకు 130 మంది లవర్స్’
‘కాసనోవా ఎవరు?’ అనే ప్రశ్నకు ‘వరల్డ్ గ్రేటెస్ట్ లవర్’ ‘ఆయనకు 130 మంది లవర్స్’ ‘ఆయన చూపుల మాయజాలంలో ఎంత అందగత్తె అయినా చిక్కుకుపోవాల్సిందే’....ఇలా ఎన్నో వినిపిస్తాయి. కాసనోవా ఆత్మకథ ఇప్పటికీ హాట్‌కేకే!. కాసనోవాపై ఆసక్తితో ఆయన గురించి చరిత్రకారులు ఎప్పటికప్పడూ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజా పరిశోధన చెప్పేదేమిటంటే...కాసనోవా మంచి వైద్యుడు అని. ఆయన వైద్యుడు కాలేకపోయినా(ఫెయిల్డ్ డాక్టర్) వైద్యశాస్త్రం పట్ల ఆసక్తిని మాత్రం వదులుకోలేదు. ఎన్నో వైద్య పుస్తకాలు చదివేవాడు. వైద్యానికి సంబంధించి ఆయన ఆలోచనలు, పరిశీలనలు, అంచనాలు చాలా విలువైనవి అంటున్నారు పరిశోధకులు. మొటిమల నివారణ నుంచి గర్భస్రావరం వరకు ఆయన స్త్రీలకు ఎన్నో సలహాలు ఇచ్చేవాడట. ఆయన చరిత్రపై ‘శృంగారపర్వం’ మాత్రమే డామినెట్ చేయడంతో ఆయనలోని నిపుణుడైన వైద్యుడి గురించి ఎవరూ పట్టించుకోలేదు. వెనిస్లో జన్మించిన గియాకోమో జిరోలామో కాసనోవా... సైనికుడు, జూదరి, వ్యాపారి, సాహసికుడు, రచయిత.. ఇలా ఎన్నో కావాలనుకున్నాడు.. పదిమందిలో పేరు తెచ్చుకోవడానికి కాదు, పలువురు స్త్రీల మనసు దోచుకోవడానికి! ఒకానొక సమయంలో కాసనోవా డిప్రెషన్లోకి వెళ్లాడు. దాని నుంచి బయటపడడానికి రోజుకు 10 గంటలు తన జ్ఞాపకాలను రాసేవాడు. ‘ఐసోలేషన్’ అనే మాట ఇప్పుడు చాలా గట్టిగా వింటున్నాంగానీ ఆరోజుల్లోనే కాసనోవా ఐసోలేషన్లోకి వెళ్లాడు. కరోనా కాదు సుమీ! తన ఆత్మకథ ‘స్టోరీ ఆఫ్ మై లైఫ్’ పూర్తిచేయడానికి. ఈ పుస్తకం పై ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ 18వ శతాబ్దంలో యూరోపియన్ల సాంఘిక జీవితాన్ని సాధికారికం గా చెప్పిన పుస్తకం అనడంలో ఎవరూ విభేదించరు. చదవండి: పద్మావతీ! నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి ఇల్లు – ఆఫీస్ వేగం తగ్గినా రన్నింగే -
ఎంట్రీకి ముందే షారుఖ్ తనయ హల్చల్!
షారుఖ్ ఖాన్ గారాల పట్టి సుహానా ఖాన్ (18) బాలీవుడ్ ఎంట్రీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుహానా ఖాన్ని బాలీవుడ్‌కు పరిచయం చేయడానికి సంజయ్‌లీలా బన్సాలీ నుంచి కరణ్ జోహార్ వరకు ఆసక్తిని కనబరుస్తున్నారని సమాచారం. ఇటీవలే ఓ ఫ్యాషన్ మేగజైన్ కవర్ పేజీపై మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు ఇటలీలోని వెనిస్ పర్యటనలో ఎంజాయ్ చేస్తున్నారు. రేపనేది లేదన్నట్టుగా ఉత్సాహంగా ఉరకలేస్తున్నారు. తన స్నేహితురాలితో కలిసి పడవలో ప్రయాణిస్తూ సుహానా ఫోటోలకు పోజిచ్చారు. కాఫీ బార్, షాపింగ్స్, పడవ ప్రయాణంలో సందడి చేస్తూ తన టీనేజీ హుషారును కుర్రకారుకు పరిచయం చేస్తున్నారు. కాగా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ స్టార్ కిడ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన టూ పీస్ బికినీ ఫొటోపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ‘ఇంట్లో బానే ఉంది. కానీ బయటే కొంచెం కష్టంగా ఉంది. ప్రజలు ఏదైనా నిర్ణయిస్తామనుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ దోరణి విపరీతంగా కనిపిస్తోంది. ఆ ఫొటోలు నా ప్రయివేట్ ఇన్స్టాగ్రామ్ నుంచి లీకయ్యాయి. చాలా మంది వాటి గురించి మాట్లాడుతున్నారు. విమర్శించే వారు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. కానీ ఈ విమర్శలతో నేను బాధపడటం లేదని మనస్పూర్తిగా చెప్పలేకపోతున్నా. ఇది చాలా బాధను కలిగిస్తోంది. విమర్శించే వారికి నేనో పెద్ద సమస్యగా మారాను’ అని సుహాన తనపై వచ్చిన విమర్శల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. -
స్టార్ డైరెక్టర్ తనయుడికి చేదు అనుభవం..!
దిగ్గజ దర్శకుడు మణిరత్నం, సీనియర్ నటి సుహాసినల కొడుకు నందన్‌కు వెనిస్ లో చేదు అనుభవం ఎదురైంది. వెనిస్ పర్యటనలో ఉన్న నందన్ ను దొంగలు దోచుకున్నారు. చేతిలో ఒక్క పైసా కూడా లేకపోవటంతో అతను ఎయిర్ పోర్ట్ కు చేరుకోవటం కూడా కష్టమైంది. విషయం తెలుసుకున్న సుహాసిని ట్విట్టర్ ద్వారా సాయం కోరటంతో అక్కడివారు స్పందించి నందన్ కు సాయమందించారు. తన అభ్యర్థనను మన్నించి తన కుమారుడికి సాయమందించిన వారికి సుహాసిని కృతజ్ఞతలు తెలియజేసింది. నందన్ హోటల్ కు చేరుకున్నట్టుగా తెలిపిన సుహాసిని అతను సురక్షితంగా ఉన్నట్టు తెలిపారు. sos anyone near venice airport ? can u help our son who was robbed in Belunno .he needs to reach airport pls help — Suhasini Maniratnam (@hasinimani) 27 August 2017 anyone near venice st mark square police station Pls pls help — Suhasini Maniratnam (@hasinimani) 27 August 2017 ppl who can't help in venice pls don't call the number i posted earlier as your drain out his battery & he ll lose contact — Suhasini Maniratnam (@hasinimani) 27 August 2017 people from india pls don't call and harass some one who already is in distress — Suhasini Maniratnam (@hasinimani) 27 August 2017 Help is on the way for our son. So those from Twitter who offered help. Thank you. He's fine now — Suhasini Maniratnam (@hasinimani) 27 August 2017 Our son checked into a hotel. He is safe tonight — Suhasini Maniratnam (@hasinimani) 27 August 2017 -
'అల్లాహూ అక్బర్.. అంటే కాల్చిపారేయండి'
వెనిస్: ప్రపంచలోని సుందరమైన ప్రదేశాల్లో ఇటలీలోని వెనిస్ కూడా ఒకటి. ఉగ్రవాద దాడుల నేపధ్యంలో వెనిస్ మేయర్ ఓ సంచలన ప్రకటన చేశారు. నగరంలో ఏ వ్యక్తయినా 'అల్లాహూ అక్బర్' అని అరిస్తే.. అతన్ని అక్కడికక్కడే కాల్చిపారేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నగరానికి వచ్చే వారిపై నిరంతర నిఘా పెట్టాలని సూచించారు. అందుకు తగిన వనరులన్నింటిని పోలీసులకు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. బార్సిలోనా కంటే వెనిస్ చాలా సురక్షితమైన ప్రదేశమని అన్నారు. వెనిస్లోని సెయింట్ మార్క్ స్క్వేర్ వద్ద ఎవరైనా 'అల్లాహూ అక్బర్' అని అరిస్తే.. ఆ వ్యక్తిని నాలుగు సెకన్లలో తమ స్నైపర్లు నేలకూల్చుతారని చెప్పారు. టెర్రిరిస్టులను తాము డైరెక్టుగా అల్లా వద్దకు పంపుతామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.