
షారుఖ్ ఖాన్ గారాల పట్టి సుహానా ఖాన్ (18) బాలీవుడ్ ఎంట్రీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుహానా ఖాన్‌ని బాలీవుడ్‌కు పరిచయం చేయడానికి సంజయ్‌లీలా బన్సాలీ నుంచి కరణ్ జోహార్ వరకు ఆసక్తిని కనబరుస్తున్నారని సమాచారం. ఇటీవలే ఓ ఫ్యాషన్ మేగజైన్ కవర్ పేజీపై మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు ఇటలీలోని వెనిస్ పర్యటనలో ఎంజాయ్ చేస్తున్నారు. రేపనేది లేదన్నట్టుగా ఉత్సాహంగా ఉరకలేస్తున్నారు. తన స్నేహితురాలితో కలిసి పడవలో ప్రయాణిస్తూ సుహానా ఫోటోలకు పోజిచ్చారు. కాఫీ బార్, షాపింగ్స్, పడవ ప్రయాణంలో సందడి చేస్తూ తన టీనేజీ హుషారును కుర్రకారుకు పరిచయం చేస్తున్నారు.
కాగా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ స్టార్ కిడ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన టూ పీస్ బికినీ ఫొటోపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ‘ఇంట్లో బానే ఉంది. కానీ బయటే కొంచెం కష్టంగా ఉంది. ప్రజలు ఏదైనా నిర్ణయిస్తామనుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ దోరణి విపరీతంగా కనిపిస్తోంది. ఆ ఫొటోలు నా ప్రయివేట్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి లీకయ్యాయి. చాలా మంది వాటి గురించి మాట్లాడుతున్నారు. విమర్శించే వారు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. కానీ ఈ విమర్శలతో నేను బాధపడటం లేదని మనస్పూర్తిగా చెప్పలేకపోతున్నా. ఇది చాలా బాధను కలిగిస్తోంది. విమర్శించే వారికి నేనో పెద్ద సమస్యగా మారాను’ అని సుహాన తనపై వచ్చిన విమర్శల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment