'అల్లాహూ అక్బర్‌.. అంటే కాల్చిపారేయండి' | Venice mayor instructs police to shoot anyone who yells "Allahu Akbar" | Sakshi
Sakshi News home page

'అల్లాహూ అక్బర్‌.. అంటే కాల్చిపారేయండి'

Published Fri, Aug 25 2017 9:02 AM | Last Updated on Sun, Sep 17 2017 5:58 PM

'అల్లాహూ అక్బర్‌.. అంటే కాల్చిపారేయండి'

'అల్లాహూ అక్బర్‌.. అంటే కాల్చిపారేయండి'

వెనిస్‌: ప్రపంచలోని సుందరమైన ప్రదేశాల్లో ఇటలీలోని వెనిస్‌ కూడా ఒకటి. ఉగ్రవాద దాడుల నేపధ్యంలో వెనిస్‌ మేయర్‌ ఓ సంచలన ప్రకటన చేశారు. నగరంలో ఏ వ్యక్తయినా 'అల్లాహూ అక్బర్‌' అని అరిస్తే.. అతన్ని అక్కడికక్కడే కాల్చిపారేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నగరానికి వచ్చే వారిపై నిరంతర నిఘా పెట్టాలని సూచించారు.

అందుకు తగిన వనరులన్నింటిని పోలీసులకు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. బార్సిలోనా కంటే వెనిస్‌ చాలా సురక్షితమైన ప్రదేశమని అన్నారు. వెనిస్‌లోని సెయింట్‌ మార్క్‌ స్క్వేర్‌ వద్ద ఎవరైనా 'అల్లాహూ అక్బర్‌' అని అరిస్తే.. ఆ వ్యక్తిని నాలుగు సెకన్లలో తమ స్నైపర్లు నేలకూల్చుతారని చెప్పారు. టెర్రిరిస్టులను తాము డైరెక్టుగా అల్లా వద్దకు పంపుతామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement