నగదు రహితానికే ప్రాధాన్యం
Published Mon, Mar 13 2017 12:53 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM
- సమస్యలుంటే తప్ప నగదు లావాదేవీలు వద్దు
- ప్రజా పంపిణీపై జేసీ హరికిరణ్ ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): చౌక ధరల దుకాణాల్లో నగదు రహితంపై మాత్రమే సరుకుల పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ సి.హరికరణ్ తెలిపారు. నగదు రహిత లావాదేవీల నిర్వహణకు సాంకేతిక సమస్యలు ఏర్పడినప్పుడు, సరుకుల పంపిణీ నిలిచిపోయిన కార్డుదారులు ఇక్కట్లు పడుతున్న సందర్బాల్లో మాత్రమే నగదుపై సరుకులు ఇవ్వాలని జేసీ ఆదివారం ఒక ప్రకటనలో డీలర్లకు సూచించారు. ముందుగా నగదు రహిత లావాదేవీలకే ప్రయత్నించాలన్నారు. ఈ పాస్ మిషన్‌పై సాంకేతిక సమస్యలు (ఎర్రర్‌కోడ్) కనిపించినపుడు మాత్రమే నగదుపై సరుకులు పంపిణీ చేయవచ్చన్నారు.
Advertisement