మహానగరంలో ‘మాయా’పాలకుడు
Published Sat, Mar 18 2017 11:39 PM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM
లక్కింశెట్టి శ్రీనివాసరావు :
అది ఒక కాకనందివాడ అనే పల్లెటూరు. బ్రిటిష్ పాలనలోకి వచ్చేసరికి ఆ ఊరు పేరు కో–కెనడాగా మారింది. తెల్ల దొరల పాలన పోయాక కో–కెనడా కాస్తా కాకినాడ అయింది. ఇప్పుడా కాకినాడ ఒక మహానగరంగా అవతరించింది. విద్య, వైద్య సదుపాయాలు మెండుగా ఉన్న నగరమది. కాకినాడకు పెన్షన ర్స్ పేరడైజ్‌గా రాష్ట్రవ్యాప్తంగా మం చి పేరు కూడా ఉంది. స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా జాతిపిత మహత్మాగాంధీ నడయాడిన ప్రాంతం ఇది. ఈ మధ్యనే ఆ మహానగరం దేశంలో ఎంపికైన స్మార్ట్ సిటీలలో ఒకటిగా నిలిచింది. ప్రజలను దోచుకోవడంలో మాత్రం మహా స్మార్ట్‌గా మారిపోయారు. ప్రజలకు సేవ చేయాలనే తపన ముఖ్యనేతకే లేనప్పుడు వంది మాగధులకు ఉంటుందనుకోవడం అవివేకమే అవుతుంది. చాలా కాలం క్రితం అనుకుంటా ప్రజా రవాణా వ్యవస్థ కేంద్రానికి ఆనుకుని ఉన్న చౌక ధరలతో కూరగాయలు అమ్మే బజార్‌లో దుకాణాలపై పడి ముఖ్య పాలకుడు, అనుచర గణం లక్షలు మూటగట్టుకుపోయారు. రెక్కాడితే కానీ డొక్కాడని రైతుల దుకాణాలు బినావీు లనే కుంటిసాకులు చూపించి ఖాళీ చేయాల్సి వస్తుందని, ఇది పాలకుడి మాటగా చెవిలో వేశారు. ఆ దుకాణాల వారికి జీవనాధారం కావడంతో మరోదారి లేక అధిక వడ్డీలకు అప్పులుచేసి అంతా కలిసి రూ.పాతిక లక్షలు మూటగట్టి చేతిలో పెట్టడంతో ఆ పాలకుడు శాంతించాడు.
దోపిడీలో కొత్తదారులిలా...
ఇది ఒకప్పటి మాట..ఇప్పుడు ఆ తరహాలోనే ప్రధాన పాలకుడు మరో దోపిడీకి తెరదీశారు. ఆ నేతకు ఇక్కడే జిల్లా పాలనా వ్యవస్థంతా కేంద్రీకృతమై ఉంది, పరువు ప్రతిష్టలు మంటగలుస్తాయనే స్పృహ కూడా లేకుండా పోయింది. అమరావతి కేంద్రంగా రాజ్యాన్ని ఏలుతున్న చంద్రవంశ చక్రవర్తి బాటలోనే ఇక్కడి పాలకుడు పనిచేస్తున్నాడు. చంద్రవశం చక్రవర్తే చేయగా లేంది నేనెందుకు చేయకూడదనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ దోపిడీలో కొత్తదారులు వెతుక్కుంటూ ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టే ఉద్ధేశం ఆ పాలకుడికి లేదన్నట్టుగా ఉంది. అప్పుడేమో పేద రైతుల పొట్టకొట్టి లక్షలు వెనకేసుకుంటే ఇప్పుడు అతని కన్ను పేద, మధ్య తరగతికి రాయితీ బియ్యం, పంచదార, కిరోసి¯ŒS పంపిణీ చేసే దుకాణాలపై పడింది. అటువంటి దుకాణాలు మహానగరంలో 117 ఉన్నాయని లెక్కతీశారు. వాటిలో కేసులు పెట్టగా రద్దుచేసేవి కొన్ని. నిర్వాహకులు మృతితో ఖాళీ ఏర్పడ్డవి మరికొన్ని ఉన్నాయి. పేదల బియ్యం, పంచదార తదితర సరుకులు కాజేశారని ప్రజా పంపిణీని పక్కదారిపట్టకుండా నియంత్రించే అధికారులు ఈ మధ్యనే కేసులు పెట్టారు. కేసులు పెట్టడమే ఆ పాలకుడికి కలిసి వచ్చినట్టుంది. కేసులు పెట్టిన దుకాణాలు రద్దుచేయాల్సిన సమయం రానే వచ్చింది. పాలకుడి తరఫున మహానగరంలో ఒక అధికారి ద్వారా రాయబారం నడిపించారు. ఆ తొమ్మిది దుకాణాలు రద్దుచేసినట్టే రద్దు చేసి వాటిని మరొక బినామీ పేరుతో పాత వారికే ఇస్తామని పాలకుడు చెప్పిన మాటనే వారి చెవుల్లో వేశారు. అందుకు తలో లక్ష, లక్షన్నర ఇవ్వాలనేది డిమాండ్. అంటే మొత్తంగా రూ.10 లక్షలు పైనే జేబులో వేసుకోవాలని పాలకుడు ప్లా¯ŒS వేశాడు. ఆ ప్లా¯ŒSలో 15, 16, 28, 29, 63, 78, 82, 84, 89 నంబర్లు కలిగిన చౌకధరల దుకాణాలు న్నాయి. ఇందులో నిర్వాహకుడు చనిపోతే ఖాళీ అయిన దుకాణం కూడా ఉంది. అయినా కనీసం కనికరం చూప లేదు. పైసలివ్వందే ఇవ్వడం కుదరదని పాలకుడి మాటగా చెప్పారు. కాకుంటే ప్రత్యామ్నాయంగా లక్షన్నరకు మరో డీల్ సిద్ధంగా ఉంచుకున్నారు. ఈ రెండింటిలో పాలకుడు దేనికి ‘పచ్చ’జెండా ఊపుతారో తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.
Advertisement
Advertisement