కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్‌ కార్డుదారులకు శుభవార్త! | Cabinet Approves Extending Free Ration Scheme For 5 Years For 81 Crore Poor People - Sakshi
Sakshi News home page

PMGKAY Free Ration Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్‌ కార్డుదారులకు శుభవార్త!

Published Wed, Nov 29 2023 5:09 PM | Last Updated on Wed, Nov 29 2023 6:21 PM

Cabinet Approves Extending Free Ration Scheme For 5 Years - Sakshi

రేషన్‌ కార్డ్‌ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని పొడిగిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకం కింద 81 కోట్ల మంది రేషన్‌ కార్డ్‌ దారులకు మరో ఐదేళ్లు రేషన్‌ను ఉచితంగా అందిచనుంది. 

ఇటీవల ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్‌ 31తో ముగియనున్న పీఎంజీకేఏవై పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తామని స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర కేబినెట్‌ దీనికి ఆమోదం తెలిపింది. కేబినెట్‌ నిర్ణయాలపై మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. 

కోవిడ్‌-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కేంద్రం పేదలకు అండగా నిలుస్తూ పీఎంజీకేఏవై పథకాన్ని ఏప్రిల్‌ 2020లో ప్రారంభించింది. ఈ స్కీంలో జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే ప్రజలకు ఉచిత రేషన్‌ను మూడు నెలల పాటు అందించింది. ఆ తర్వాత పొడిగిస్తూ వచ్చింది. ఈ డిసెంబర్‌ 31తో ఈ పథకం వ్యవధి ముగియనుండగా.. తాజాగా దీన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement