- నగదు రహిత రేష¯ŒSకు తిప్పలు
- చౌకడిపోల్లో వర్తించని పోర్టబులిటీ
- లబ్ధిదారులకు సరుకులు
- తిరస్కరిస్తున్న డీలర్లు
- కార్డు ఉన్నచోటకే వెళ్లాలంటూ సూచన
- ఉపాధి కోసం వచ్చినవారిలో అయోమయం
కొత్త చిక్కులు
Published Mon, Jan 2 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM
నగదు రహిత రేష¯ŒS పంపిణీ వల్ల లబ్ధిదారులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. నగదు రహిత లావాదేవీల్లో రేష¯ŒS పోర్టబులిటీ వర్తించడం లేదు. ఎప్పటిలాగే ఈ నెల కూడా రేష¯ŒS డిపోలకు వెళ్తే ఇతర ప్రాంతాల లబ్ధిదారులకు డీలర్లు సరుకులు నిరాకరిస్తున్నారు. తమ పరిధిలోనివారికే సరుకులు ఇస్తామని, ఇతర ప్రాంతాలవారు కార్డు జారీ అయిన రేష¯ŒS డిపోకే వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
సాక్షి, రాజమహేంద్రవరం :
రేష¯ŒS పోర్టబులిటీ ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేష¯ŒS తీసుకునే సౌకర్యం ఉంది. గత నెల వరకూ కూడా ఈ విధానంలోనే రేష¯ŒS సరుకులు పంపిణీ చేశారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా చౌకడిపోల్లో కూడా నగదు రహిత లావాదేవీలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం అధికారులు రేష¯ŒS డిపోల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధానంలో ఈ–పోస్ యంత్రాల్లో లబ్ధిదారుల ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతాలను, రేష¯ŒS కార్డు నంబర్‌తో అనుసంధానం చేస్తారు. తద్వారా తీసుకు న్న సరుకులకు సంబంధించిన నగదు లబ్ధిదారు ఖాతా నుంచి డీలర్ ఖాతాకు జమ అవుతుంది. దీని అమలును గత నెల నుంచే చేపట్టినా, ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడం, పెద్ద నోట్ల రద్దు, చిల్లర సమస్యల తో ఆ నెలలో నగదు తీసుకోకుండానే సరుకులు పంపిణీ చేశారు. నగదు రహిత లావాదేవీలు ప్రారంభించాక జనవరిలో తీసుకుందామని అందరికీ అరువు కింద సరుకులు ఇచ్చారు.
‘పోర్టబులిటీ’ సరుకులకు ‘నో’
ఈ నెల నుంచి చౌకడిపోల్లో నగదు రహిత లావాదేవీలు ప్రారంభించారు. కొత్త విధానంలో లబ్ధిదారు బ్యాంకు ఖాతా అతడు రేష¯ŒS కార్డు పొందిన డీలర్ ఖాతాకే అనుసంధానమవుతోంది. దీంతో పోర్టబులిటీ విధానం కింద వేరేచోట నుంచి సరుకులు పొందే లబ్ధిదారు ఖాతా నుంచి నగదు ఆ డీలర్‌కే చేరుతోంది. సరుకులు ఇచ్చిన డీలర్ ఖాతాకు ఆ సొమ్ములు చేరడంలేదు. ఫలితంగా డీలర్లు పోర్టబులిటీ ద్వారా సరుకులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. సరుకులు కావాలంటే కార్డు పొందిన డీలర్ వద్దకే వెళ్లాలని సూచిస్తున్నారు. జిల్లాలోని 2,444 చౌకడిపోల పరిధిలో 15,79,555 రేష¯ŒS కార్డులున్నాయి. ఇందులో సుమారు 1.50 లక్షలమంది కార్డుదారులు ఇన్నాళ్లుగా పోర్టబులిటీ ద్వారా సరుకులు తీసుకుంటున్నారు. వీరిలో జిల్లాలోని కార్డుదారులతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలవారు కూడా ఉన్నారు.
ఈ నెల సరుకులు ఇవ్వలేదు
మాది అమలాపురం. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగ రీత్యా రాజమహేంద్రవరంలో ఉంటున్నాను. నాలుగు నెలల నుంచి ఒకే రేష¯ŒS దుకాణంలో సరుకులు తీసుకుంటున్నాను. గత నెలలో క్రెడిట్ ఇచ్చారు. ఆ నగదు తన ఖాతాకు జమ అయితే వచ్చే నెలలో సరుకులిస్తామని డీలర్ అంటున్నారు. సోమవారం సరుకులకు వెళితే నగదు తన ఖాతాకు జమ కాలేదని, కార్డు ఎక్కడ జారీ చేశారో ఆ డీలర్ వద్దకే వెళ్లాలని చెప్పారు. నా ముందు మరో ముగ్గురికి కూడా ఇదే సమస్య ఎదురైంది.
– కె.వెంకటసురేష్, లలితానగర్, రాజమహేంద్రవరం
జిల్లా పరిధిలోని కార్డుదారులకు ఇబ్బంది లేదు
నగదు రహిత లావాదేవీలవలన జిల్లాపరిధిలోని కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందీ లేదు. వారందరికీ పోర్టబులిటీ వర్తిస్తుంది. ఇప్పటివరకూ 7 వేల మందికి పోర్టబులిటీ ద్వారా సరుకులు పంపిణీ చేశాం. నగదు రహిత లావాదేవీల వలన ఇతర జిల్లాల కార్డుదారులకు పోర్టబులిటీ వర్తించడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో పై స్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయి.
– వేమూరి రవికిరణ్, జిల్లా పౌరసరఫరాల అధికారి
Advertisement
Advertisement