new problems
-
మందులు విఫలమైతే కొత్త సమస్యలు
రోగకారక బ్యాక్టీరియాను నిర్మూలించే యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోవడం అతిపెద్ద ఉత్పాతానికి దారితీయనుంది. అవసరానికి మించి యాంటీబయాటిక్స్ ఉపయోగించడం కారణంగా బ్యాక్టీరియాపై వాటి ప్రభావం సన్నగిల్లిపోతోందని రెండు అంతర్జాతీయ అధ్యయనాలు బయట పెట్టాయి. కోవిడ్–19 మహమ్మారి ప్రభావంతో వీటిని ఎవరూ పట్టించుకోలేదు. 2019లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో దాదాపు 50 లక్షలు ఏఎంఆర్ (యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్) సంబంధిత మరణాలే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయవలసిన సాంక్రమిక వ్యాధుల నియంత్రణ వ్యూహాల్లో మార్పులు తప్పనిసరి. యాంటీబయాటిక్స్‌ను హేతుపూర్వకంగా వాడేలా బలమైన క్రమబద్ధీరణ వ్యవస్థలు అవసరం. అంతర్జాతీయ వైద్య పత్రికల్లో ఈ సంవ త్సరం రెండు ప్రమాదకరమైన కథనాలు ప్రచురితమయ్యాయి. సూక్ష్మజీవులు నిరోధకత పెంచుకుంటున్న విషయాన్ని అవి ఎత్తి చూపాయి. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి వాటి కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లను నిరోధించడానికి వాడే మందులు పనిచేయడం లేదని తెలిపాయి. టైఫాయిడ్ జ్వరానికి కారణమయ్యే బ్యాక్టీరియా అయిన సాల్మోనెల్లా టైఫీకి వాడే మందులు పనిచేయక పోవడం గురించి ‘లాన్సెట్’ తాజా అధ్యయనం చర్చించింది. జనవరి మొదట్లో లాన్సెట్ ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ బ్యాక్టీరియల్ యాంటీమై క్రోబియల్ రెసిస్టెన్స్ ఇన్ 2019’ అనే మరొక అధ్యయనం కూడా చేసింది. సూక్ష్మజీవుల ఏజెంట్లలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు వాటిపై వాడే మందులు పనిచేయడం లేదని కూడా ఈ అధ్యయనం తెలిపింది. పొంచి ఉన్న విపత్తు గురించి ఈ రెండు అధ్యయనాలు వెల్లడించిన అంశాలను కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, భారతదేశం నుంచి 2016–19 మధ్య టైఫాయిడ్ బ్యాక్టీరియాకు సంబంధించిన జీనోమ్ స్వీక్వెన్స్ను పరిశీలించినందున టైఫాయిడ్‌పై చేసిన తాజా అధ్యయనం చాలా పెద్దదనే చెప్పాలి. 1905 నుంచి 2018 వరకు 70కి పైగా దేశాలనుంచి 4,000 సూక్ష్మజీవి రకాలను పరిశీలించగా, పై నాలుగు దేశాలనుంచి వేరుపర్చిన 3,489 కొత్త సీక్వెన్స్ రకాలను పరిశోధకులు తాజాగా ఆవిష్కరించారు. సూక్ష్మజీవి సంహారకాలకు తట్టుకుని, వివిధ భౌగో ళిక ప్రాంతాలకు బ్యాక్టీరియా వ్యాప్తి చెందిన విధాన్ని వీరు పరిశీలిం చారు. బ్యాక్టీరియా జన్యు ఉత్పరివర్తనాలు సిప్రోఫ్లాక్సాసిన్, ఎరిత్రో మైసిన్ వంటి సాధారణంగా ఉపయోగించే యాంటీబయాటిక్స్‌కు నిరోధకత పెంచుకున్నాయి. గత 30 సంవత్సరాల్లో ఒక ఖండంలో కానీ, ఇతర ఖండాల్లో కానీ యాంటీబయాటిక్స్‌కి నిరోధకత దాదాపు 200 రెట్లు పెరిగిందని గుర్తించారు. జన్యు ఉత్పరివర్తనాలు, వ్యాప్తి మూలాలకు సంబంధించి చూస్తే దక్షిణాసియా 90 శాతం మ్యుటే షన్లతో అతిపెద్ద ప్రాంతంగా నిలిచింది. అలాగే దక్షిణాసియా నుంచి అగ్నేయాసియాకు, దక్షిణాఫ్రికాకు ఈ మ్యుటేషన్లు విస్తరించాయిని తాజా అధ్యయనం తెలిపింది. పైగా యూరప్‌కూ, రెండు అమెరికన్ భూఖండాలకూ ఇవి వ్యాపించాయని కనుగొన్నారు. దీనివల్ల రోగులకు ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టసాధ్యమైపోయింది. చికిత్స చేస్తున్నప్పుడు వైఫల్యాల సంఖ్య పెరిగింది. రోగులు ఆసుపత్రుల్లో గడపాల్సిన వ్యవధి పెరగడంతో ఖర్చు పెరిగింది. మరణాల రేటు కూడా పెరిగింది. నిరోధకత పెంచుకున్న బ్యాక్టీరియా రకాలు వివిధ దేశాలకే కాకుండా వివిధ ఖండాలకు కూడా వ్యాపిం చాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయవలసిన సాంక్రమిక వ్యాధుల నియంత్రణ వ్యూహాల్లో మార్పు చేయడం తప్పనిసరి. యాంటీబయాటిక్స్‌కి ఏమాత్రం లొంగని బ్యాక్టీరియా రకాల ఆవి ర్భావం కారణంగా, వ్యాధి నిరోధక పద్ధతులను కూడా మార్చు కోవాలి. టైఫాయిడ్ సాంక్రమికంగా వచ్చే దేశాల్లో టైఫాయిడ్ వ్యాక్సిన్లను కూడా మార్చవలసి ఉంటుంది. ఈ సంవత్సరం మొదట్లో ప్రచురితమైన అధ్యయనం సూక్ష్మజీవి సంహారకాలకు నిరోధకత (ఏఎంఆర్) అంతర్జాతీయ తలనొప్పిగా మారినట్లు పేర్కొంది. దాదాపు 200 దేశాల్లో ఇది పొడసూపటమే కాదు, 20 పైగా బ్యాక్టీరియా వ్యాధికారకాలు కూడా బయటపడ్డాయి. 2019లో చేసిన ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభ వించిన మరణాల్లో దాదాపు 50 లక్షల మరణాలు ఏఎమ్ఆర్ (యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్) సంబంధిత మరణాలే. అంటే బ్యాక్టీరియాను సంహరించే మందులు పనిచేయక ఇన్ని మరణాలు సంభవించాయన్నమాట. వీటిలో నాలుగింట మూడొంతుల మర ణాలు ప్రధానంగా ఆరు బ్యాక్టీరియా రకాల వల్లే సంభవించాయి. ఈ ఆరింటిలో ఈష్చెరిషియా కోలి అనేది ప్రమాదకరమైనదిగా పరిణ మించింది. శ్వాససంబంధ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకాయని ఈ అధ్య యనం తెలిపింది. దీన్నే సాధారణ పరిభాషలో నిమోనియా అని పిలుస్తుంటారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఆరు కీలక బ్యాక్టీరియాలు అత్యధికంగా మందులకు నిరోధకతను సాధించడం ఆందోళన కలిగిస్తోంది. బ్యాక్టీరియా నిరోధక యాంటీబయాటిక్స్‌ను డాక్టర్లు అతిగా సిఫార్సు చేయడం లేదా దుర్వినియోగం చేయడం వల్ల సమస్య తీవ్రమైంది. 2016లో అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం అమెరికాలో డాక్టర్లు సిఫార్సు చేసిన యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్లలో 30 శాతం వరకు అనవసరమని తేలింది. జ్వరం, గొంతు నొప్పి, సైనస్ వంటి సాధారణ సమస్యలకు కూడా యాంటీబయాటిక్స్‌ను సిఫార్సు చేశారని తేలింది. భారతదేశం విషయంలో ఇది మరింత ఎక్కువగానే ఉంటుందనడంలో సందేహమే లేదు. మన దేశంలో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లతో పనిలేకుండా, ఫార్మసిస్టులు, అనధికారిక వ్యక్తులు కూడా వీటిని నేరుగా రోగులకు ఇచ్చేయడం రివాజు. దగ్గు, డయే రియా, పొత్తికడుపు నొప్పి వంటి అతి సాధారణ జబ్బులకు కూడా వీటిని సిఫార్సు చేస్తున్నారు. చెప్పాలంటే ఆసుపత్రుల్లో చేరే ప్రతి వాళ్లకూ వేగంగా ఉపశమించేలా బ్యాక్టీరియా సంహారక మందులను రాసిపడేస్తున్నారు. నాణ్యత లేని మందులు కూడా బ్యాక్టీరియా విస్తరణకు కారణం అవుతున్నాయి. అవసరం లేని చోట వాడుతున్న యాంటీబయాటిక్స్ జన్యు ఉత్పరిపర్తనాలకు దారి తీస్తోంది. దీనివల్ల ఒక ప్రత్యేక ఏజెంట్ కంటే మొత్తం డ్రగ్స్‌కే బ్యాక్టీరియా అలవాటుపడుతోంది. కొన్నేళ్ల క్రితం చేసిన ఒక అధ్యయనంలో, పేదదేశాల్లో వాడే యాంటీబయా టిక్స్‌లో ఎనిమిదింట ఒకటి, మలేరియా మందుల్లో ఐదింట ఒకటి నాణ్యత లేకుండా ఉన్నాయని బయటపడింది. నాణ్యత లేని లేబ రేటరీ పరీక్షలు, డాక్టర్లు సూచించిన చికిత్సను రోగి చివరివరకూ పాటించకపోవడం, యాంటీబయాటిక్స్ని ఇష్టానుసారం మార్చడం కూడా పరిస్థితిని దిగజార్చుతున్నాయి. కోళ్ల పరిశ్రమలో, జంతువుల్లో యాంటీబయాటిక్స్ ఉపయోగించడం భయానక పరిస్థితిని సృష్టిస్తోంది. మందులను, ఆసుపత్రుల్లో వ్యర్థాలను డిస్పోజ్ చేయడంలో లోపాలతో పాటు కొన్ని పరిశ్రమల వల్ల పర్యావరణం నేరుగా కాలుష్యానికి గురవుతోంది. వాతావరణంలో మానవ, జంతు సూక్ష్మజీవికణాలు కలగలిసిపోతున్నాయి. దీంతో మానవులు, జంతువులలో కూడా బ్యాక్టీరియా వ్యతిరేక నిరోధకత తగ్గిపోతోంది. యాంటీబయాటిక్ మందు అయిన కోలిస్టిన్‌ను దశాబ్దాలుగా పశువులకు ఇస్తూ రావడం వల్ల అవి నేరుగా మానవుల్లో ఇన్ఫెక్షన్లకు దారితీసి బీభత్సం సృష్టించింది. ఇన్ఫెక్షన్కు చివరి ప్రయత్నంగా మాత్రమే కోలిస్టిన్ వాడాల్సి ఉంటుంది. కానీ ఆ అంశానికి ఎవరూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రోగక్రిమి నాశకాల శక్తి తగ్గిపోవడానికి సంబంధించి భారత్ మేలుకోవలసిన తరుణం ఆసన్నమైంది. యాంటీబయాటిక్స్‌ను హేతుపూర్వకంగా రాసే, ఉపయోగించే బలమైన క్రమబద్ధీరణ వ్యవస్థలు అవసరం. వీటి ఉత్పత్తిలో నాణ్యతను తప్పక పాటించేలా చూడాలి. ‘ఏఎంఆర్’ను కనుగొని పర్యవేక్షించే పద్ధతులను ప్రారంభిం చాలి. యూరప్, అమెరికాల్లో లాగా మన ఆసుపత్రుల్లో సాంక్రమిక వ్యాధుల విభాగాల ప్రత్యేక వ్యవస్థను తప్పక ఏర్పాటుచేయాలి. అప్పుడే అధికంగా యాంటీబయాటిక్స్ ఉపయోగించడాన్ని నియంత్రించడం, పర్యవేక్షించడం సాధ్యపడుతుంది. రాకేశ్ కోచర్ వ్యాసకర్త మాజీ అధ్యక్షుడు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఉద్యోగుల బదిలీలకు కొత్త చిక్కులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. బదిలీల దరఖాస్తులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్డర్ టు సర్వ్ కింద చేసిన తాత్కాలిక కేటాయింపులను క్రమబద్ధీకరించకుండా బదిలీలకు అవకాశమిస్తే పాత జిల్లా కేంద్రాల్లోని వారు బదిలీలపై వెళ్లేందుకు ఇష్టపడే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త జిల్లాలకు ఆర్డర్ టు సర్వ్ కింద వెళ్లిన ఉద్యోగులు పాత జిల్లాల పరిధిలోకి వచ్చేందుకు దరఖాస్తు చేసుకునే పరిస్థితి నెలకొంది. అలాంటివారికి ఇప్పుడు ఎక్కడ పోస్టింగ్ ఇస్తారన్నదే ప్రధాన సమస్య. అసలు బదిలీలను ఎవరు చేయాలన్నదీ సమస్యగానే మారింది. బదిలీల కోసం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో పాత జిల్లాల ప్రకారం బదిలీలు చేస్తారని పేర్కొన్నారే తప్ప పాత జిల్లా కలెక్టర్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించలేదు. అలాంటప్పుడు కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను పాత జిల్లాల కలెక్టర్లు ఏ అధికారంతో బదిలీ చేస్తారని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అవేమీ సమస్యలు కాబోవని మరికొన్ని సంఘాల నేతలు చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రధానంగా పేర్కొంటున్న అంశాలు.. ► కొత్త జిల్లాల్లో కేడర్ స్ట్రెంత్ నిర్ణయించలేదు. ఆర్డర్ టు సర్వ్‌పై వెళ్లిన వారిని అక్కడ క్రమబద్ధీకరించలేదు. అలాంటప్పుడు బదిలీలపై కొత్త జిల్లాల్లో ఉద్యోగులను ఏ పోస్టుల్లోకి పంపిస్తారు? ► ఆర్డర్ టు సర్వ్ కింద వెళ్లినవారికి పనిచేస్తున్న చోట రెండేళ్ల సర్వీసు లేకపోయినా బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు వారు దరఖాస్తు చేసుకొని పాత జిల్లాలకు వెళ్లే వీలుంది. కానీ పాత ఆదిలాబాద్ వంటి జిల్లాలకు చెందిన, ఆర్డర్ టు సర్వ్‌పై ఆసిఫాబాద్‌కు వెళ్లిన ఉద్యోగులు ఇప్పుడు బదిలీపై ఆదిలాబాద్ వచ్చేందుకు ఇష్టపడతారు. అదే ఆదిలాబాద్‌లో ఉన్న వారు మాత్రం ఆసిఫాబాద్ వెళ్లేందుకు ఇష్టపడే పరిస్థితి లేదు. ► పునర్విభజనతో జిల్లాల పరిధులు మారాయి. ఒక జిల్లాలోని ఉద్యోగులు మరో జిల్లా పరిధిలోకి వచ్చారు. ఇప్పుడు వారిని పాత జిల్లా కలెక్టర్లు ఎలా బదిలీ చేస్తారన్నది ప్రశ్న. ఉదాహరణకు కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ ప్రాంతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వచ్చింది. వారిప్పుడు భూపాలపల్లి జిల్లా పరిధిలోనే ఉంటామనే అవకాశముంది. ► రాష్ట్రంలో 2013 తర్వాత ఉద్యోగుల బదిలీలు లేవు. దీంతో ప్రస్తుత నిబంధన ప్రకారం పనిచేసే చోట రెండేళ్ల సర్వీసున్న ప్రతివారూ బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశముంది. కానీ 40 శాతం మందినే బదిలీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగతా 60 శాతం మందికి బదిలీకి అర్హత ఉన్నా పాత స్థానాల్లోనే ఉండక తప్పదు. వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ► త్వరలో పంచాయతీ ఎన్నికలున్నందున ఇప్పుడు బదిలీలు చేస్తే ఎన్నికల నిర్వహణ కొత్తవారికి సమస్యగా ఉంటుందేమోనంటున్నారు. రెవెన్యూ రికార్డుల సవరణకూ ఇదే ఇబ్బంది ఎదురు కావచ్చు. ► బదిలీ స్టేషన్‌కు టౌన్, విలేజ్ అని బదిలీ ఉత్తర్వుల్లో వివరణ ఇచ్చారు. దాని ప్రకారం జీహెచ్ఎంసీ ఒక యూనిట్ అవుతోంది. జోన్, మల్టీ జోన్ పోస్టుల్లోని ఇతర జిల్లాల్లో పని చేస్తున్న వారు జీహెచ్ఎంసీకి వచ్చే వీలుంది. కానీ జీహెచ్ఎంసీ పరిధిలోని కార్యాలయాల్లో పని చేస్తున్న వారు మాత్రం ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ఇష్టపడే పరిస్థితి కనిపించడం లేదు -
తండాలన్నీ ఎస్టీలకు కాదు!
సాక్షి, హైదరాబాద్ : .. ఈ పరిస్థితి రెండు గ్రామ పంచాయతీలకే పరిమితం కావడం లేదు. కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటవుతున్న వందలాది తండాల్లో ఈ సమస్య తలెత్తనుంది. ఇతర వర్గాల ఓటర్లు కనీసం పది మంది కూడా లేనిచోట రిజర్వేషన్ల రొటేషన్లతో ఆయా వర్గాలకు సర్పంచ్ పదవి కేటాయించే పరిస్థితి ఉంటుంది. దీనితో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఎస్టీలకు పాలనా అవకాశం కల్పించాలన్న లక్ష్యం నీరుగారిపోనుంది. ఈ పరిస్థితిని ఊహించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఏం చేయాలనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించేలా కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ప్రత్యేకంగా నిబంధనలు చేర్చే విషయంపై న్యాయశాఖతో కలసి అధ్యయనం చేస్తున్నారు. 4,122 కొత్త పంచాయతీలు రాష్ట్రంలో జనాభా ఎక్కువగా ఉన్న శివారు గ్రామాలు, పల్లెలు, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మైదాన ప్రాంతాల్లో 500 మంది జనాభా ప్రాతిపదికన.. కొండలు, గుట్టల ప్రాంతాల్లో, ప్రత్యేక భౌగోళిక ప్రాంతాల్లో 300 జనాభా ప్రాతిపదికన ఆవాసాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చేలా మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని 30 జిల్లాల నుంచి 4,122 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. అందులో 1,879 సాధారణ ఆవాసాలు, 2,243 తండాలు ఉన్నాయి. చివరిగా మరోసారి జిల్లాల నుంచి నివేదికలు తెప్పిస్తున్నారు. కొత్త పంచాయతీలతో కలిపి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు మొత్తంగా 12,806కు చేరనున్నాయి. 957 కొత్త పంచాయతీల్లో సమస్యలు స్థానిక సంస్థల ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి ఐదేళ్లకు సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ మారుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని పదవులను పూర్తిగా ఎస్టీ వర్గం వారికే కేటాయిస్తారు. కానీ మైదాన ప్రాంతాల్లోని తండాల్లో రిజర్వేషన్ల రొటేషన్ సమస్య తలెత్తనుంది. రాష్ట్రంలో కొత్తగా 2,243 తండాలు గ్రామ పంచాయతీగా ఏర్పాటు కానుండగా.. ఇందులో 100 శాతం ఎస్టీ జనాభా ఉన్నవి 1,286 మాత్రమే. మిగతా 957 తండాల్లో ఇతర వర్గాలకు చెందినవారు కొద్ది సంఖ్యలో నివసిస్తున్నారు. దీంతో సర్పంచ్‌తోపాటు కొన్ని వార్డు సభ్యుల పదవులు ఇతర వర్గాలకు రిజర్వు అయ్యే పరిస్థితి ఉండనుంది. ప్రత్యేక నిబంధనపై కసరత్తు! గ్రామ పంచాయతీలుగా మారే తండాల్లోని ఓటర్లలో ఏ వర్గం వారు ఎంత మంది ఉన్నారన్న విషయంపై పంచాయతీరాజ్ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న తండాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు పూర్తిగా ఎస్టీ వర్గం వారికే రిజర్వు అయ్యేలా కొత్త పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనను చేర్చాలన్న అంశాన్ని న్యాయ శాఖ దృష్టికి తీసుకువచ్చారు. ఇక కేవలం నలుగురైదుగురు ఇతర వర్గాల వారున్న పంచాయతీల్లో రిజర్వేషన్ల రొటేషన్ అంశంపైనా చర్చిస్తున్నారు. త్వరలోనే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. డీసీ తండా.. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఒక గ్రామ పంచాయతీ. నాలుగు తండాలు కలిపి గ్రామ పంచాయతీగా ఉంది. సమీపంలోని ఓ గ్రామం నుంచి నలుగురు బీసీ వర్గం వారు డీసీ తండాలో స్థిరపడ్డారు. 2013 పంచాయతీ ఎన్నికల సమయంలో డీసీ తండా సర్పంచ్ పదవి రొటేషన్‌లో బీసీలకు వచ్చింది. నలుగురే ఓటర్లున్న వర్గానికి రిజర్వేషన్ రావడంతో గిరిజనులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దాంతో ఎవరూ నామినేషన్ వేయక, సర్పంచ్ ఎన్నిక జరగలేదు. వార్డు సభ్యులలో ఒకరు ఉప సర్పంచ్ అయ్యారు. ఆయనే ఇన్చార్జి సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారు. రాంధన్ తండా.. వర్ధన్నపేట మండలంలోని మరో గ్రామ పంచాయతీ. ఒక్క కుటుంబం మినహా అంతా లంబాడీ తెగవారే. కానీ 2013 ఎన్నికలప్పుడు రిజర్వేషన్ రొటేషన్‌లో సర్పంచ్ పదవి బీసీలకు కేటాయించారు. ఉన్న ఒక్క కుటుంబంలోని వారే సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. -
కొత్త చిక్కులు
నగదు రహిత రేష¯ŒSకు తిప్పలు చౌకడిపోల్లో వర్తించని పోర్టబులిటీ లబ్ధిదారులకు సరుకులు తిరస్కరిస్తున్న డీలర్లు కార్డు ఉన్నచోటకే వెళ్లాలంటూ సూచన ఉపాధి కోసం వచ్చినవారిలో అయోమయం నగదు రహిత రేష¯ŒS పంపిణీ వల్ల లబ్ధిదారులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. నగదు రహిత లావాదేవీల్లో రేష¯ŒS పోర్టబులిటీ వర్తించడం లేదు. ఎప్పటిలాగే ఈ నెల కూడా రేష¯ŒS డిపోలకు వెళ్తే ఇతర ప్రాంతాల లబ్ధిదారులకు డీలర్లు సరుకులు నిరాకరిస్తున్నారు. తమ పరిధిలోనివారికే సరుకులు ఇస్తామని, ఇతర ప్రాంతాలవారు కార్డు జారీ అయిన రేష¯ŒS డిపోకే వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం : రేష¯ŒS పోర్టబులిటీ ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేష¯ŒS తీసుకునే సౌకర్యం ఉంది. గత నెల వరకూ కూడా ఈ విధానంలోనే రేష¯ŒS సరుకులు పంపిణీ చేశారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా చౌకడిపోల్లో కూడా నగదు రహిత లావాదేవీలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం అధికారులు రేష¯ŒS డిపోల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధానంలో ఈ–పోస్ యంత్రాల్లో లబ్ధిదారుల ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతాలను, రేష¯ŒS కార్డు నంబర్‌తో అనుసంధానం చేస్తారు. తద్వారా తీసుకు న్న సరుకులకు సంబంధించిన నగదు లబ్ధిదారు ఖాతా నుంచి డీలర్ ఖాతాకు జమ అవుతుంది. దీని అమలును గత నెల నుంచే చేపట్టినా, ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడం, పెద్ద నోట్ల రద్దు, చిల్లర సమస్యల తో ఆ నెలలో నగదు తీసుకోకుండానే సరుకులు పంపిణీ చేశారు. నగదు రహిత లావాదేవీలు ప్రారంభించాక జనవరిలో తీసుకుందామని అందరికీ అరువు కింద సరుకులు ఇచ్చారు. ‘పోర్టబులిటీ’ సరుకులకు ‘నో’ ఈ నెల నుంచి చౌకడిపోల్లో నగదు రహిత లావాదేవీలు ప్రారంభించారు. కొత్త విధానంలో లబ్ధిదారు బ్యాంకు ఖాతా అతడు రేష¯ŒS కార్డు పొందిన డీలర్ ఖాతాకే అనుసంధానమవుతోంది. దీంతో పోర్టబులిటీ విధానం కింద వేరేచోట నుంచి సరుకులు పొందే లబ్ధిదారు ఖాతా నుంచి నగదు ఆ డీలర్‌కే చేరుతోంది. సరుకులు ఇచ్చిన డీలర్ ఖాతాకు ఆ సొమ్ములు చేరడంలేదు. ఫలితంగా డీలర్లు పోర్టబులిటీ ద్వారా సరుకులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. సరుకులు కావాలంటే కార్డు పొందిన డీలర్ వద్దకే వెళ్లాలని సూచిస్తున్నారు. జిల్లాలోని 2,444 చౌకడిపోల పరిధిలో 15,79,555 రేష¯ŒS కార్డులున్నాయి. ఇందులో సుమారు 1.50 లక్షలమంది కార్డుదారులు ఇన్నాళ్లుగా పోర్టబులిటీ ద్వారా సరుకులు తీసుకుంటున్నారు. వీరిలో జిల్లాలోని కార్డుదారులతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలవారు కూడా ఉన్నారు. ఈ నెల సరుకులు ఇవ్వలేదు మాది అమలాపురం. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగ రీత్యా రాజమహేంద్రవరంలో ఉంటున్నాను. నాలుగు నెలల నుంచి ఒకే రేష¯ŒS దుకాణంలో సరుకులు తీసుకుంటున్నాను. గత నెలలో క్రెడిట్ ఇచ్చారు. ఆ నగదు తన ఖాతాకు జమ అయితే వచ్చే నెలలో సరుకులిస్తామని డీలర్ అంటున్నారు. సోమవారం సరుకులకు వెళితే నగదు తన ఖాతాకు జమ కాలేదని, కార్డు ఎక్కడ జారీ చేశారో ఆ డీలర్ వద్దకే వెళ్లాలని చెప్పారు. నా ముందు మరో ముగ్గురికి కూడా ఇదే సమస్య ఎదురైంది. – కె.వెంకటసురేష్, లలితానగర్, రాజమహేంద్రవరం జిల్లా పరిధిలోని కార్డుదారులకు ఇబ్బంది లేదు నగదు రహిత లావాదేవీలవలన జిల్లాపరిధిలోని కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందీ లేదు. వారందరికీ పోర్టబులిటీ వర్తిస్తుంది. ఇప్పటివరకూ 7 వేల మందికి పోర్టబులిటీ ద్వారా సరుకులు పంపిణీ చేశాం. నగదు రహిత లావాదేవీల వలన ఇతర జిల్లాల కార్డుదారులకు పోర్టబులిటీ వర్తించడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో పై స్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయి. – వేమూరి రవికిరణ్, జిల్లా పౌరసరఫరాల అధికారి -
కొత్త కొట్లాట
వరంగల్ రూరల్ జిల్లా పరిధి ఓ చోట.. పాలనా కేంద్రం మరోచోట జిల్లాలోని మూడు ప్రాంతాల్లో కేంద్రం కోసం ఆందోళనలు నర్సంపేట, పరకాల, గీసుకొండల్లో విడివిడిగా ఉద్యమాలు మొదటి ముసాయిదా మార్చినప్పటి నుంచే రగడ తూర్పు నియోజకవర్గాన్నిరూరల్లో కలిపితే అందరికీ ఆమోదయోగ్యం! సాక్షి, హన్మకొండ : రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కొన్నిచోట్ల సరికొత్త పంచాయితీలకు తెరతీసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 21జిల్లాలు చేయడంతో జిల్లాల సంఖ్య మొత్తం 31కి చేరుకుంది. దీన్ని ప్రజలు ఆమోదించినప్పటికీ వరంగల్ రూరల్ జిల్లాలో మాత్రం విభిన్న పరిస్థితి నెలకొంది. ఈ పరిణామంతో జిల్లాలో గందరగోళ వాతావరణం నెలకొంది. వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్న 15 మండలాల్లోని మూడు ప్రాంతాల్లో జిల్లా కేంద్రం కోసం ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఇందులో ఒక నియోజకవర్గంలోనే రెండు చోట్ల విడివిడిగా ఆందోళనలు చేపట్టడం విశేషం. ఎక్కడా లేని పరిస్థితి రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా వరంగల్ రూరల్ జిల్లా రెవెన్యూ పరిధిలో లేని వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్న హన్మకొండలో రూరల్ జిల్లా కలెక్టరేట్, వరంగల్ నగరంలో వివిధ రూరల్ జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో ఈ ప్రత్యేకమైన పరిస్థితి నెలకొంది. వరంగల్ రూరల్ జిల్లాకు ఒక ప్రత్యేక జిల్లా కేంద్రం లేకపోవడంతో వరంగల్ రూరల్ రెవెన్యూ జిల్లా పరిధిలోనే కలెక్టరేట్, ఇతర అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలంటూ రూరల్ జిల్లా పరిధిలోని మూడు ప్రాంతాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ప్రత్యక్ష పోరాటాలు సైతం ప్రాంరభించారు. ఇవి రోజురోజుకూ మరింత ఉధృతం దాలుస్తున్నాయి. ఒకవైపు నర్సంపేటలో జిల్లా కేంద్రం కోసం కొన్ని నెలలుగా జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు నడుస్తున్నాయి. మరోవైపు పరకాలలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ వివిధ సంఘాలు ఆందోళనలు చేపట్టగా, అదే పరకాల నియోజకవర్గం పరిధిలోని గీసుకొండ మండలంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ మరో ఉద్యమం ప్రారంభమైంది. ఇక్కడ అఖిలపక్షాలు ఇప్పటికే మూడు సార్లు సమావేశాలు నిర్వహించుకుని ప్రత్యక్ష కార్యాచరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు విడిగా ప్రయత్నించిన టీఆర్ఎస్ కూడా అఖిలపక్షంతో కలిసి వస్తోంది. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోకి వచ్చే మండలాలు అర్బ¯ŒS జిల్లా పరిధిలోని వరంగల్ నగరం చుట్టూ విస్తరించి ఉన్నాయి. రూరల్ జిల్లా పరిధిలోని 15మండలాల్లో గీసుకొండ, సంగెం మండలాలు నగరానికి ఆనుకుని ఉన్నాయి. దీంతో గీసుకొండ మండలంలో జిల్లా కేంద్రం కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సాధన కమిటీ ఏర్పాటు చేసుకుని ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. గీసుకొండ మండలంలో ప్రభుత్వ భూములు సైతం అందుబాటులో ఉన్నందున ఇక్కడే కార్యాలయాలు నెలకొల్పాలనేది అఖిలపక్ష నాయకుల డిమాండ్. ’పాకాల’ జిల్లా కోసం.. జిల్లాల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కాకముందునుంచే నర్సంపేటలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రభుత్వం జిల్లాల ప్రక్రియకు సంబంధించి విడుదల చేసిన మొదటి ముసాయిదాలో వరంగల్, హన్మకొండ అనే రెండు జిల్లాలు ఉండడంతో హన్మకొండ బదులు నర్సంపేటను జిల్లా కేంద్రంగా చేసి పాకాల జిల్లాగా పేరు పెట్టాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేశారు. చివరకు వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటు కావడంతో జిల్లా కార్యాలయాలు నర్సంపేటలో ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికీ జేఏసీ ఆందోళనలు చేస్తోంది. గతం నుంచే రెవెన్యూ డివిజ¯ŒSగా ఉన్న నర్సంపేటలో సబ్ డీఎఫ్‌వో కార్యాలయం, సబ్ కోర్టు, మినీ స్టేడియం, సమీపంలో పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడంతో పాటు డీసీపీ కార్యాలయం ఇక్కడే ఏర్పాటు చేస్తుండడంతో జిల్లా కేంద్రం డిమాండ్ మరింత పెరుగుతోంది. పరకాలలో రెండు డిమాండ్లు చారిత్రక ప్రాధాన్యం కలిగిన పరకాలలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ పరకాలలోనూ వారం కిందట ఆందోళనలు ప్రారంభమయ్యాయి. అఖిల భారత విద్యార్ధి పరిషత్, తెలంగాణ విద్యార్ధి సంఘం, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. పరకాలను జిల్లా కేంద్రంగా చేయాలని, లేనిపక్షంలో రెవెన్యూ డివిజ¯ŒSగా చేసి భూపాలపల్లి జిల్లాలో కలపాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పరకాల ఉనికి దెబ్బతింటున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే చ ల్లా ధర్మారెడ్డి పట్టించుకోవడం లేదంటూ ఆందోళనలు చేయడంతో పాటు, ఎమ్మెల్యే దిష్టిబొమ్మ సైతం తగులబెట్టి పరకాల ప్రాంతం వారు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి.ఏది ఏమైనా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ వరంగల్ రూరల్ జిల్లా విషయంలో మాత్రం సరికొత్త పంచాయతీకి తెరతీసినట్లైంది. నర్సంపేట, పరకాల నియోజకవర్గ కేంద్రాల్లో పోరాటాలు ఎక్కడికక్కడ జరుగుతుండగా, పరకాల నియోజకవర్గంలోని గీసుకొండ మండలంలో జిల్లా కేంద్రం ప్రత్యేకంగా మరో పోరాటం ప్రారంభం కావడం గమనార్హం. ‘తూర్పు’ కలిపితే ఓకే.. వరంగల్ రూరల్ జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో వివిధ ప్రాంతాల మధ్య విభిన్నమైన ఆకాంక్షలు ఉన్నప్పటికీ.. ఒక్క విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని రూరల్ జిల్లాలో కలిపితే జిల్లా కేంద్రం రగడకు తెర పడే అవకాశాలు ఉన్నాయి. జిల్లాకు అదే రెవెన్యూ ప్రాంతంలో ఒక పాలనా కేంద్రం ఉండడంతో పాటు జిల్లాలో నగరం చేరినట్లవుతుంది. మూడు ప్రాంతాల మధ్య జిల్లా కేంద్రం రగడకు ఫుల్స్టాప్ పడే అవకాశం ఉంది. రెవెన్యూ డివిజన్ చేస్తే చాలు.. పోరాటల పురిటి గడ్డ, తెలంగాణ ఉద్యమంలో వెన్ను చూపకుండా పోరాడిన చరిత్ర పరకాల వాసులది. అయితే, జిల్లాల పునర్విభజనతో పరకాలకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి పరకాలను రెవెన్యూ డివిజ¯ŒSగా మార్చాలి. ఆ తర్వాత రూరల్ జిల్లా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటుచేసినా మాకు అభ్యంతరం లేదు. కుమార్, టీఆర్ఎస్ నాయకుడు, పరకాల ’తూర్పు’ను జిల్లా కేంద్రం చేయాలి వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని వరంగల్ అర్బన్ జిల్లా నుంచి విడదీసి రూరల్ జిల్లాలో చేర్చి జిల్లా కేంద్రం చేస్తే బాగుంటుంది. దీంతో జిల్లా కేంద్రం ఎక్కడ ఉండాలనే వివాదాలు, ఆందోళనలు సమసిపోతాయి. లేదంటే మా రెండో డివిజ¯ŒS ప్రాంతాన్ని వరంగల్ అర్బ¯ŒS జిల్లాలోనే చేర్చాలి. అప్పటి వరకు మా ఆందోళనలు కొనసాగుతాయి. ఆడెపు రమేశ్, జేఏసీ కన్వీనర్, మొగిలిచర్ల ‘తూర్పు’ అందరికీ అనుకూలం వరంగల్ రూరల్ జిల్లా కేంద్రంగా వరంగల్ తూర్పును చేయాలి. పరకాల, నర్సంపేట కాకుండా వరంగల్ తూర్పు అయితే అందరికీ అనుకూలంగా ఉంటుంది. జిల్లా కేంద్రంగా తూర్పు ప్రాంతాన్ని ఎంపిక చేస్తే కార్యాలయాల ఏర్పాటు, ప్రజలు వచ్చివెళ్లేందుకు కానీ అనువుగా ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వ పెద్దలు కృషి చేయాలి. ఉప్పునూతుల శ్రీనివాస్, ఆత్మకూరు -
అటూ.. ఇటూ..!
ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ముక్కలు హుస్నాబాద్ మూడు జిల్లాల్లోకి.. మిగిలినవి రెండు జిల్లాలోకి.. మూడు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించనున్న హుస్నాబాద్ ఎమ్మెల్యే మిగిలిన ఎమ్మెల్యేలు రెండేసి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం నాలుగు జిల్లాలకు కరీంనగర్ ఎంపీ, మూడు జిల్లాలకు పెద్దపల్లి 6 నుంచి 11 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించనున్న ఎమ్మెల్సీలు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాల పునర్విభజనతో ఎంపీలు, ఎమ్మెల్యేలకు కొత్త చిక్కు వచ్చింది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదా ప్రకారం వీటిలో ఏడు సెగ్మంట్ల పరిధిలో గల కొన్ని మండలాలు ఇతర జిల్లాలోకి వెళ్తున్నాయి. దీంతో ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇకనుంచి రెండు మూడు జిల్లాల్లో ప్రాతినిధ్యం వహించాల్సి వస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగేంత వరకు ప్రజాప్రతినిధులకు ఈ పరిస్థితి తప్పదు. పునర్విభజనలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గం మూడు ముక్కలవుతుండగా, సిరిసిల్ల, చొప్పదండి, వేములవాడ, ధర్మపురి, మంథని, మానకొండూరు, హుజూరాబాద్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు రెండేసి జిల్లాల్లోకి వెళుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, కోహెడ మండలాలు సిద్దిపేటలోకి, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు హన్మకొండలోకి వెళ్తుండగా.. సైదాపూర్, చిగురుమామిడి మండలాలు మాత్రమే కరీంనగర్లో మిగులుతాయి. దీంతో హుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్ మూడు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వీణవంక మినహా మిగిలిన మూడు మండలాలు హన్మకొండ జిల్లాలోకి వెళుతున్నాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఈటల రాజేందర్ రెండు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండలం సిద్దిపేటకు, సిరిసిల్ల, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాలను కరీంనగర్ జిల్లాకు కేటాయించారు. ముసాయిదా యథాతథంగా ఆమోదం పొందితే సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ సైతం కరీంనగర్, సిద్దిపేట జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సిందే. వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, కథలాపూర్ మండలాలు జగిత్యాల జిల్లాకు, వేములవాడ, కోనరావుపేట, చందుర్తి మండలాలు కరీంనగర్ జిల్లాకుSకేటాయించారు. ధర్మపురి నియోజకవర్గాన్ని తొలుత జగిత్యాల జిల్లాకే కేటాయించినప్పటికీ చివరి నిమిషంలో ధర్మారం మండలాన్ని పెద్దపల్లి జిల్లాకు మార్చారు. చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల, మల్యాల మండలాలు జగిత్యాల జిల్లాలోకి వెళ్తుండగా, చొప్పదండి, గంగాధర, బోయినపల్లి, రామడుగు మండలాలు కరీంనగర్ జిల్లాలో ఉంటాయి. మంథని నియోజకవర్గంలోని మహదేవపూర్, కాటారం, మల్హర్, మహాముత్తారం మండలాలు భూపాలపల్లి జిల్లాలోకి, మంథని, ముత్తారం, కమాన్‌పూర్ మండలాలు పెద్దపల్లి జిల్లాలోకి వెళ్తున్నాయి. మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం సిద్దిపేట జిల్లాకు మార్చగా, శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్, బెజ్జంకి మండలాలు కరీంనగర్‌కు కేటాయించారు. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రెండు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాలు పెద్దపల్లి జిల్లాలో, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు జగిత్యాల జిల్లాలో, కరీంనగర్ నియోజకవర్గం పూర్తిగా కరీంనగర్ జిల్లాలోనే కొనసాగుతుండటంతో సదరు ఎమ్మెల్యేలు ఒకే జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. – ఎంపీల విషయానికొస్తే... కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ ఇకపై కరీంనగర్, హన్మకొండ, సిద్దిపేట, జగిత్యాల జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే పరిస్థితి ఏర్పడింది. అట్లాగే పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కొత్త జిల్లాల విభజన నేపథ్యంలో పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలకు, నిజామాబాద్ ఎంపీ కవిత ఇకపై నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సిందే. – ఇక ఒక్కో ఎమ్మెల్సీ ఏకంగా 6 నుంచి 11 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు ఇకపై కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, సిద్దిపేట జిల్లాలకు ప్రాతినిధ్యం వహించనున్నారు. శాసనమండలి చైర్మన్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వామిగౌడ్, టీచర్స్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి ప్రస్తుతం కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాల విభజన నేపథ్యంలో వీరు ఏకంగా 11 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించనున్నారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలు మూడేసి జిల్లాలుగా.. నిజామాబాద్ రెండు జిల్లాలుగా ఏర్పడుతున్నందున మొత్తం 11 జిల్లాలకు ఈ ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహించాల్సి రావడం విశేషం. – జిల్లా పరిషత్ చైర్పర్సన్, డీసీసీబీ, డీసీఎంస్ చైర్మన్లు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్‌లోని మండలాలు ఆరు జిల్లాల్లోకి వెళుతున్నప్పటికీ ఆయా పదవులు గడువు ముగిసే వరకు వారి పరిధిలోనే కొనసాగిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో వారంతా ఒకే జిల్లాకు ప్రాతినిధ్యం వహించడంతోపాటు సమావేశాలు నిర్వహించిన సమయంలో ఆయా స్థానిక, సహకార సంఘాల ప్రతినిధులు కరీంనగర్ జిల్లాకే రావాల్సి ఉంటుంది. జిల్లా నుంచి 742 అభ్యంతరాలు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి బుధవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 2564 అభ్యంతరాలు ప్రభుత్వ వెబ్సైట్లో నమోదవగా, అందులో ప్రస్తుత కరీంనగర్ జిల్లా నుంచి ఏకంగా 759 ఉండటం గమనార్హం. వీటిలోనూ అత్యధికంగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన కొత్త రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి ఏకంగా 514 అభ్యంతరాలు వెల్లడించడం గమనార్హం. అందులో మెజారిటీ అభిప్రాయాలు కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని రావడం విశేషం. మిగిలిన విషయానికొస్తే జిల్లాల ఏర్పాటుపై 195, మండలాల ఏర్పాటుపై 50 అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. -
ఎంసెట్ విద్యార్థులకు కొత్త కష్టాలు
విశాఖపట్నం: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అష్టకష్టాలు పడి ఎంసెట్ పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. పరీక్ష కేంద్రానికి హాల్‌టికెట్‌తో వచ్చిన విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించకుండా.. రిజిస్ట్రేషన్ ఫామ్ పై కళాశాల ప్రిన్సిపల్ సంతకం, ఫోటోలు, గెజిటెడ్ సంతకం... అంటూ అధికారులు షరతులు పెడుతున్నారు. దీంతో ఎంసెట్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంఘటన విశాఖపట్నంలోని ఆంధ్రాయునివర్సిటి కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. -
కేంద్ర మంత్రులకు కొత్త చిక్కులు!
-
కొత్త రాజధాని కొత్త వివాదాలకు దారి తీస్తుందా?
పార్లమెంటు ఉభయసభల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను ఆమోదించారు. విభజన జరిగిపోయింది. రాష్ట్రపతి సంతకంతో 29వ రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినట్లు ప్రకటన వెలువడుతుంది. ఇక రాజధాని ఎక్కడనేదే పెద్ద సమస్య. ఇది చిన్నాచితకా సమస్య కాదు. ఈ విషయంలో జుట్లుపట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి ఎమంటారా అన్నారో అది అక్షరాల నిజం. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఒక రాయి ఇస్తే, ఆమె దానిని విసిరితే, అది ఎక్కడపడితే అదే కొత్తరాజధాని అని ఆయన చెప్పారు. ఆయన వ్యంగ్యంగా ఆ మాట చెప్పినా అదే నిజమవుతుందా? ఏదిఏమైనా కొత్త రాజధాని ఎంపిక కొత్త వివాదాలకు దారి తీసే ప్రమాదం ఉంది. ఇప్పుడు కొత్త రాజధానిపైనే సర్వత్రా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సీమాంధ్రలో ఈ విషయంమే ప్రస్తుతం ప్రధాన టాపిక్‌గా ఉంది. ప్రధానంగా విజయవాడ - గుంటూరు, ఒంగోలు, కర్నూలు పేర్లు వినవస్తున్నాయి. అందరూ ఈ నగరాలపైనే దృష్టి పెట్టారు. విజయవాడ - గుంటూరు మధ్య అయితే అన్నివిధాల అనుకూలంగా ఉంటుంది. గన్నవరం విమానాశ్రయం, 5వ నెంబరు జాతీయరహదారి, రైల్వే, స్టార్హొటల్స్తోపాటు అటు ఉత్తరాంధ్రకు, ఇటు సీమాంధ్రకు మధ్యలో ఉండటం ఈ జంట నగరాలకు కలసివచ్చే అంశం. అంతేగాక ఈ ప్రాంతం ఇప్పటికే విస్తరించి హైటెక్ హంగులు సంతరించుకుంది. అటు,ఇటూ అందరికి సమదూరంలో ఉంటుంది. సీమాంధ్రకు మధ్యలో ఉంటుంది. రాజధానికి కావలసిన అన్ని హంగులు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో రాజధానికి కావలసినన్ని ఎకరాల భూమి లభించడం కష్టం. అదీగాక ఇక్కడ ఎక్కువగా పంట పొలాలే ఉన్నాయి. మాగాణి భూములు ఎక్కువ. ఒంగోలులో అయితే కావలసినన్ని భూములు లభించే అవకాశం ఉంది. దీనికి 5వ నెంబరు జాతీయ రహదారి, రైల్వేలు అందుబాటులో ఉంటాయి. దొనకొండ వద్ద పాత విమానాశ్రయం ఉంది. మెట్ట భూమికి కొదవలేదు. ఆ విధంగా ఈ జిల్లా కూడా కొత్తరాజధానికి పరిశీలనలో ఉంది. అయితే గతంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా ఉంది. తాము రాజధానిని కోల్పోయినందున, ఇప్పుడు మళ్లీ ఆ నగరాన్నే రాజధాని చేయడం న్యాయం అని అక్కడివారు వాదిస్తున్నారు. అయితే విజయవాడ - గుంటూరు, ఒంగోలులతో పోల్చుకుంటే ఈ నగరం అంతసౌకర్యవంతమైనదికాదు. అదీగాక ఉత్తరాంధ్రవారికి దూరం అవుతుంది. కేంద్రం నియమించే కమిటీ ఈ ప్రాంతాలన్నింటిని, అక్కడ లభించే మౌలిక సదుపాయాలను పరిశీలించి కొత్త రాజధానిని ఎంపిక చేస్తుంది. అయితే ఈ విషయంలో మళ్లీ గొడవలు వచ్చే అవకాశం ఉంది. s.nagarjuna@sakshi.com