విశాఖపట్నం: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అష్టకష్టాలు పడి ఎంసెట్ పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. పరీక్ష కేంద్రానికి హాల్‌టికెట్‌తో వచ్చిన విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించకుండా.. రిజిస్ట్రేషన్ ఫామ్ పై కళాశాల ప్రిన్సిపల్ సంతకం, ఫోటోలు, గెజిటెడ్ సంతకం... అంటూ అధికారులు షరతులు పెడుతున్నారు. దీంతో ఎంసెట్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంఘటన విశాఖపట్నంలోని ఆంధ్రాయునివర్సిటి కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.