EAMCET Students
-
నీట్, ఎంసెట్ విద్యార్థులకు సాక్షి మాక్‌టెస్టులు
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్, లేదా మెడిసిన్. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్/మెడికల్ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అందుకు ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్‌లో చేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్/అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో అడ్మిషన్ కల్పించే ఎంసెట్‌కు లక్షల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. చదవండి👉: Competitive Exams: ఏ పోటీ పరీక్షలకైనా.. రాజకీయ అవగాహన తప్పనిసరి.. ఈ వ్యూహాలను అనుసరిస్తే..! ఈ నేపథ్యంలో విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో ఎంసెట్, నీట్ పరీక్షలకు సాక్షి మాక్‌టెస్టులు నిర్వహించనుంది. పరీక్షకు కొద్దిరోజుల ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే సాక్షి మాక్ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకుని, ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరచుకోవచ్చు. అంతేకాకుండా సాక్షి మాక్ టెస్టుల్లో ఉత్తమ ప్రతిభను చూపడం ద్వారా టాప్ టెన్ ర్యాంకర్లు ఆకర్షణీయ బహుమతులూ గెలుచుకోవచ్చు. సాక్షి మాక్ ఎంసెట్ (ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్) పరీక్ష 25 జూన్, 2022, 26 జూన్, 2022 (శనివారం, ఆదివారం) తేదీల్లో ఆన్లైన్లో జరగనుంది. సాక్షి మాక్ నీట్ పరీక్ష 3 జూలై, 2022 (ఆదివారం) ఆన్లైన్/ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది. ఒక్కో పరీక్షకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.250. అభ్యర్థులు https://www. arenaone.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు పూర్తిచేసిన అభ్యర్థుల ఈమెయిల్‌కు హాల్‌టికెట్ నంబర్ వస్తుంది. వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 96666 97219, 99126 71555, 96662 83534 -
తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థుల సత్తా
సాక్షి, హైదరాబాద్, సాక్షి నెట్వర్క్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. టాప్ టెన్ ర్యాంకుల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో తొలి 10 ర్యాంకుల్లో ఆరింటిని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే కైవసం చేసుకోవడం విశేషం. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలోనూ ఏపీకి టాప్ టెన్‌లో నాలుగు దక్కాయి. ఫలితాలు ప్రకటించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంజనీరింగ్ విభాగంలో 82.08 శాతం, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 92.48 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు. ఇంటర్మీడియట్ మార్కులను ఈసారీ వెయిటేజ్‌గా తీసుకోలేదు. ఇంటర్ సబ్జెక్టుల్లో కనీస మార్కుల అర్హత నిబంధనను ఎత్తివేశారు. ఎస్సీ, ఎస్టీలు మినహా కటాఫ్ మార్క్ 40గా నిర్ణయించారు. తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 1,64,963 మంది దరఖాస్తు చేయగా.. 1,47,991 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1,21,480 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 86,641 మంది దరఖాస్తు చేయగా.. 79,009 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 73,070 మంది అర్హత సాధించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లో శాస్త్రవేత్తనవుతా ఐఐటీ, ముంబైలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లో శాస్త్రవేత్తగా రాణించాలని ఉంది. ఇంజనీరింగ్ పూర్తయ్యాక దేశంలోని ప్రముఖ మేనేజ్మెంట్ కళాశాలలో చదివేందుకు క్యాట్ పరీక్ష రాస్తా. – సత్తి కార్తికేయ, ఇంజనీరింగ్ ఫస్ట్ ర్యాంకర్, పాలకొల్లు 158.49 పర్సంటైల్‌తో ప్రథమ ర్యాంక్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సత్తి కార్తికేయ తెలంగాణ ఎంసెట్‌లో 158.497905 పర్సంటైల్ సాధించి ప్రథమ ర్యాంకర్‌గా నిలిచాడు. వ్యాపారి సత్తి త్రినాథరావు, కృష్ణకుమారి దంపతుల రెండో కుమారుడైన కార్తికేయ ఇప్పటికే 99.99 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా ర్యాంక్‌లో ఉన్నాడు. ఆలిండియా ఒలింపియాడ్‌లో 5వ ర్యాంకు సాధించాడు. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్‌లోనూ సత్తా చాటాడు. ఐఐటీ చేయాలని.. తెలంగాణ ఎంసెట్‌లో వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం శెవనవారిపల్లికి చెందిన దుగ్గినేని వెంకట ప్రణీత్ ఇంజనీరింగ్ విభాగంలో రెండో ర్యాంక్ సాధించాడు. ప్రణీత్ తండ్రి దుగ్గినేని యుగంధర్ ఏపీఎస్పీడీసీఎల్లో డీఈఈగా గుంతకల్లులో పని చేస్తున్నారు. ఇటీవల రాసిన జేఈఈ మెయిన్స్‌లో నూటికి నూరు శాతం మార్కులు సాధించాడు. ముంబైలో ఐఐటీ చేయాలన్నది తన లక్ష్యమని ప్రణీత్ చెప్పాడు. అమ్మా, నాన్నల బాటలోనే.. అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో అనంతపురం రామచంద్రనగర్‌కు చెందిన శ్రీనివాస కార్తికేయ రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకుతో సత్తా చాటాడు. మొత్తం 160 మార్కులకు గాను 150.04 మార్కులు సాధించాడు. ఇతని తల్లి పద్మజ, తండ్రి సుధీంద్ర ఇద్దరూ వైద్యులే. ప్రస్తుతం నీట్‌కు సిద్ధమవుతున్నానని, మెడిసిన్ చదవాలనేది తన లక్ష్యమని శ్రీనివాస కార్తికేయ తెలిపాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తెలంగాణ ర్యాంకు సాధించగలిగానని చెప్పాడు. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో.. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ చెందిన చందం విష్ణువివేక్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో ఐదో ర్యాంకు సాధించాడు. పదో తరగతిలో 10 జీపీఏ పాయింట్లు సాధించిన విష్ణు వివేక్ చిన్నతనం నుంచి చదువుపై ఆసక్తి కనబరుస్తున్నట్టు అతడి తల్లి లక్ష్మి తెలిపింది. ప్రస్తుతం విష్ణు నీట్‌కు సిద్ధమవుతున్నాడు. డాక్టర్ కావడమే తన లక్ష్యమని తెలిపాడు. వైద్యుడిగా రాణించాలని.. కాకినాడకు చెందిన కోలా పవన్‌రాజు అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో 149.63 మార్కులతో 6వ ర్యాంక్ సాధించాడు. ఇతని తండ్రి కేఎస్వీవీఎస్ రాజు రైల్వేలో అసిస్టెంట్ సెక్షన్ ఇంజినీర్. తల్లి గంగాభవాని గృహిణి. నీట్ పరీక్ష రాసి వైద్య కోర్సు అభ్యసించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేది తన జీవిత లక్ష్యమని పవన్ తెలిపాడు. సత్తా చాటిన క్లాస్మేట్స్ ఇంజనీరింగ్ విభాగంలో విజయనగరం పట్టణానికి చెందిన మిడతాన ప్రణయ్ 7వ ర్యాంకు, ఎస్.దివాకర్ సాయి 9వ ర్యాంకు సాధించారు. ఇద్దరూ ఐదో తరగతి నుంచి 9వ తరగతి వరకు విజయనగరంలో చదివారు. టెన్త్, ఇంటర్ విజయవాడలో చదువుకున్నారు. అక్కడ ఇద్దరూ రూమ్ మేట్స్ కూడా. మిడతాన ప్రణయ్ తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. తల్లి వి.జ్యోతి గంట్యాడ మండలం రామవరం జెడ్పీ హైస్కూల్లో తెలుగు టీచర్ కాగా.. తండ్రి ఎంవై రామారావు లక్కిడాం జెడ్పీ హైస్కూల్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు. ఐఐటీ ముండైలో కంప్యూటర్ సైన్స్ చేయాలన్నదే లక్ష్యమని ప్రణయ్ తెలిపారు. 9వ ర్యాంకరైన దివాకర్ సాయి తండ్రి శ్రీనివాసరావు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో హెడ్ కానిస్టేబుల్. తల్లి కాసు మల్లేశ్వరి గృహిణి. ఐఐటీలో చేరాలన్న లక్ష్యంతో చదివినట్టు దివాకర్ సాయి తెలిపాడు. 8వ ర్యాంక్ సాధించిన నెల్లూరు విద్యార్థి నెల్లూరు మాగుంట లేఅవుట్‌కు చెందిన డి.సాయిప్రణవ్ 8వ ర్యాంక్ సాధించాడు. ఇతడి తల్లిదండ్రులు మాధవ్, పద్మజ ఇద్దరూ వైద్యులు. తాను మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానని ప్రణవ్ చెప్పాడు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించానన్నాడు. -
'ఎంసెట్-2 ను రద్దు చేయవద్దు'
-
'ఎంసెట్-2 ను రద్దు చేయవద్దు'
హైదరాబాద్: ఎంసెట్ - 2 ను రద్దు చేయవద్దంటూ విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంసెట్-2 పరీక్షను మళ్లీ రాయడం చాలా కష్టమని మొరపెట్టుకున్నారు. గురువారం తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డితో ఎంసెట్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భేటీ అయ్యారు. ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ లీకేజీ వ్యవహారంపై సీఐడీ విచారణ ఇంకా కొనసాగుతోందని ఆయన అన్నారు. సమస్యను తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని విద్యార్థులకు నాయిని హామీ ఇచ్చారు. -
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు
► ఏర్పాట్లు పూర్తి నేడు విజయవాడలో 86 కేంద్రాల్లో పరీక్షలు ► నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ► జిల్లా నుంచి వచ్చే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం ► బస్టాండ్, రైల్వేస్టేషన్లో హెల్ప్ డెస్క్‌లు ► వివాహాల సీజన్‌కు చివరి ముహూర్తం ► ఇదేరోజు కావటంతో పెరగనున్న ట్రాఫిక్ రద్దీ సాక్షి, విజయవాడ : ఎంసెట్ విద్యార్థులకు ప్రత్యేక సేవలు అందించటానికి విజయవాడ కమిషనరేట్ పోలీసులు, ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పరీక్ష రాయటానికి వచ్చే విద్యార్థులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించింది. పోలీసులు యథావిధిగా సెంటర్ల వద్ద బందోబస్తు మొదలుకొని పరీక్షా కేంద్రాల మార్గంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వరకు అన్నింటినీ పర్యవేక్షించనున్నారు. దూర ప్రాంత విద్యార్థుల సౌకర్యం కోసం బస్టాండ్, రైల్వేస్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచే ఇవి పనిచేయనున్నాయి. ఎంసెట్ కన్వీనర్‌తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఎంసెట్ నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఉచిత రవాణా ఆర్టీసీ అధికారులు ఎంసెట్ విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నారు. నగరంలోని పరీక్షా కేంద్రాల రూట్లకు ఆర్టీసీ సిటీ బస్సుల్ని ఏర్పాటు చేశారు. 400 సిటీ బస్సులు నగరంలో నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. ఎంసెట్ విద్యార్థులు హాల్‌టిక్కెట్ చూపించి వాటిలో ప్రయాణం చేయవవచ్చు. జిల్లా నుంచి వచ్చే విద్యార్థులు కూడా హాల్‌టిక్కెట్ చూపించి బస్సులో ఉచితంగా విజయవాడకు చేరుకోవచ్చు. ఆర్టీసీ ఆర్ఎం రామారావు ఇప్పటికే డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం నుంచి ఆర్ఎంతో పాటు అధికారులు పరిస్థితిని సమీక్షించనున్నారు. శుభకార్యాలకూ చివరి ముహూర్తం... వివాహాలు తదితర శుభకార్యాలకు ఈ సీజన్లో శుక్రవారం చివరి ముహూర్తం. నగరంలో సుమారు 120కి పైగా వివాహాలు జరగనున్నాయి. ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉంది. పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. నగరంలో వివాహాల ఊరేగింపులపై నిషేధం విధించారు. విద్యార్థులు రెండు గంటలు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని పోలీసులు సూచించారు. రద్దీ ప్రాంతాల్లో రెగ్యులర్ ట్రాఫిక్ పోలీసులతో పాటు అదనంగా మరికొంత మందిని నియంత్రణకు కేటాయించారు. ఉదయం ఇంజినీరింగ్.. మధ్యాహ్నం మెడిసిన్.. విజయవాడలో శుక్రవారం 86 పరీక్ష కేంద్రాల్లో ఎంసెట్ (ఇంజినీరింగ్, మెడిసిన్) ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. దీనికి జిల్లాలో 42,224 మంది విద్యార్థులకు ఉన్నత విద్యామండలి హాల్ టికెట్లు జారీ చేసింది. ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు ఇంజినీరింగ్ , మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడిసిన్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. 86 పరీక్ష కేంద్రాల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. -
ప్రశాంతంగా ఎంసెట్
ఇంజినీరింగ్‌కు 6812, మెడిసిన్‌కు 2925 మంది హాజరు మొత్తం హాజరు శాతం 95.6 ఆర్టీసీ సమ్మెతో పరీక్ష కేంద్రాలకు ముందే చేరుకున్న అభ్యర్థులు కడప ఎడ్యుకేషన్ : వైద్య, ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశానికి శుక్రవారం నిర్వహించిన ఎంసెట్-2015 జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఇంజినీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు మెడిసిన్ పరీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగంలో 7,070 మంది విద్యార్థులకు గాను 6812 మంది (96 శాతం) పరీక్ష రాశారు. మెడిసిన్ విభాగంలో 3080 మందికి గాను 2925 మంది (95 శాతం) పరీక్ష రాశారు. కడప నగరంలో 10 పరీక్ష కేంద్రాల్లో, ప్రొద్దుటూరులో నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించారు. కడప నగరంలోని ఆరు కేంద్రాల్లో మెడిసిన్ పరీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగంలో కడపలో 95.96 శాతం, ప్రొద్దుటూరులో 97 శాతం మంది పరీక్ష రాశారు. ముందే చేరుకున్న విద్యార్థులు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అభ్యర్థులు ముందు జాగ్రత్తగా తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకున్నారు. ప్రయివేట్ వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలతో పాటు పలు ప్రయివేట్ కళాశాలలు, పాఠశాలలకు చెందిన వాహనాల్లో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష కేంద్రంలోకి వచ్చే ప్రతి విద్యార్థిని గేటు వద్దే నిర్వాహకులు, పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లకుండా నిరోధించారు. ప్యాడ్లను కూడా అనుమతించలేదు. రీజనల్ కోఆర్డినేటర్ పరిశీలన నగరంలోని పరీక్ష కేంద్రాలను ఎంసెట్ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్. రఘునాథరెడ్డి, స్పెషల్ అబ్జర్వర్ డాక్టర్ ఎం. రామకృష్ణారెడ్డి, అబ్జర్వర్లు మాధవరెడ్డి, సుబ్రమణ్యం శర్మ పరిశీలించారు. విద్యార్థులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు వారు తెలిపారు. -
గట్టెక్కించిన పోలీస్
- ఆర్టీసీ సమ్మె, మండుటెండతో అల్లాడిన ఎంసెట్ విద్యార్థులు - ప్రత్యేక వాహనాల్లో పరీక్ష కేంద్రాలకు తరలించిన పోలీస్ - మేముసైతం అంటూ ముందుకొచ్చిన ప్రయవేటు, స్వచ్ఛంద సంస్థలు - ఇంజినీరింగ్ 96, మెడిసిన్ 97.15 శాతం హాజరు నమోదు కృష్ణలంక : నగరంలో శుక్రవారం జరిగిన ఎంసెట్ పరీక్షార్థులను పోలీసులే ఆదుకున్నారు. ఓవైపు ఆర్టీసీ సమ్మె, మరోవైపు ట్రాఫిక్ రద్దీ, ఇంకోవైపు మండుటెండలో సమయానికి పరీక్ష కేంద్రానికి వెళ్తామో, లేదో అనే మీమాంసలో కొట్టుమిట్టాడిన విద్యార్థులను దగ్గరుండి నడిపించారు. సీపీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు పోలీస్ శాఖకు చెందిన వాహనాలు, సొంత వాహనాలను విద్యార్థుల కోసం సిద్ధం చేశారు. బైకులపై విద్యార్థులను సరైన సమయానికి చేర్చారు. ఉదయం ఇంజినీరింగ్, మధ్యాహ్నం మెడిసిన్ పరీక్షలు పూర్తయ్యేంత వరకు సీపీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పోలీస్ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లే ప్రాంతాల్లో ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్ యంత్రాంగం మొత్తం మోహరించింది. వీరితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు కూడా మానవతా దృక్పథంతో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూశాయి. దీంతో ఆర్టీసీ సమ్మె ఉన్నా.. విద్యార్థులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా సజావుగా పరీక్షలు రాశారు. పోలీసుల తీరును విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశంసించారు. సీపీ కృతజ్ఞతలు ఎంసెట్ ప్రశాంతంగా ముగిసేందుకు నగరవాసులు స్వచ్ఛందంగా చూపిన చొరవకు సీపీ వెంకటేశ్వరరావు అభినందనలు తెలిపారు. డీసీపీ (లా అండ్ ఆర్డర్) కాళిదాసు వెంకట రంగారావు, ఏడీసీపీ ట్రాఫిక్ టీవీ నాగరాజు, ట్రాఫిక్ ఏసీపీ చిదానందరెడ్డి, శ్రావణ్‌కుమార్, ఇన్స్పెక్టర్లు ఎం.శ్రీనివాస్, జి.శ్రీనివాస్, ఏసీపీ అమర్నాథ్ నాయుడు, ప్రభాకర్ బాబు, అభిషేక్ మహంతి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఎంసెట్ విద్యార్థులకు కొత్త కష్టాలు
విశాఖపట్నం: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అష్టకష్టాలు పడి ఎంసెట్ పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. పరీక్ష కేంద్రానికి హాల్‌టికెట్‌తో వచ్చిన విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించకుండా.. రిజిస్ట్రేషన్ ఫామ్ పై కళాశాల ప్రిన్సిపల్ సంతకం, ఫోటోలు, గెజిటెడ్ సంతకం... అంటూ అధికారులు షరతులు పెడుతున్నారు. దీంతో ఎంసెట్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంఘటన విశాఖపట్నంలోని ఆంధ్రాయునివర్సిటి కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఎంసెట్ విద్యార్థులకు ప్రత్యేక బస్సులు
గుంటూరు ఎడ్యుకేషన్ : ఆర్టీసీ సమ్మె ప్రభావంతో ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాయి. గుంటూరు పాటు, శివారు ప్రాంతాల్లోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు విద్యార్థులను ఉచితంగా తరలించేందుకు పలు కళాశాలలు మందుకొచ్చాయి. బస్సులను ఏర్పాటు చేసిన కళాశాలల వివరాలు... గుంటూరు రూరల్ మండలం చోడవరంలోని ఆర్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంసెట్‌కు పరీక్ష రాసేందుకు హాజరుకానున్న మూడు వేల మంది విద్యార్థులను తరలిచేందుకు 20 బస్సులను ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి సుధాకర్ తెలిపారు. ఉచిత రవాణాతో పాటు విద్యార్థులు, వారి వెంట వచ్చే తల్లిదండ్రులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి 4, బీఆర్ స్టేడియం, మణిపురం ఆర్వోబీ, నాజ్ సెంటర్ నుంచి ఒక్కొక్క బస్సు చొప్పున, లక్ష్మీపురం నుంచి మూడు, రాజేంద్ర నగర్ నుంచి ఒకటి, విజయపురి నుంచి, విద్యానగర్ నుంచి రెండు, అమరావతిరోడ్డు నుంచి రెండు, రైల్వే స్టేషన్ నుంచి ఒకటి, బ్రాడీపేట 4/14 నుంచి ఒకటి, ఎస్వీఎన్ కాలనీ నుంచి రెండు, శంకర్‌విలాస్ సెంటర్ నుంచి ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన బస్సులు ఉదయం 7.10 గంటలకు బయలు దేరుతాయని తెలిపారు. పెదకాకాని మండలం నంబూరులోని వీవీఐటీ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులను తరలించేందుకు అమరావతి, చిలకలూరిపేట, మంగళగిరి, పేరేచర్ల, పొన్నూరు, తెనాలి, విజయవాడలోని ఆర్టీసీ బస్టాండ్ల నుంచి ఉదయం 7 గంటలకు ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయని వీవీఐటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. గుంటూరులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కళాశాల బస్సులను అందుబాటులో ఉంచుతున్నామని ప్రకటించారు. గుంటూరు రూరల్ మండలం చోడవరంలోని కళ్ళం ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష రాసేందుకు హాజరుకానున్న విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు కళాశాల డెరైక్టర్ డాక్టర్ ఎం.ఉమా శంకర్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్, మార్కెట్ సెంటర్ నుంచి ఉదయం 8 గంటలకు బస్సులు బయలు దేరుతాయని తెలిపారు. కళాశాల క్యాంటీన్లో అల్పాహారం అందుబాటులో ఉంచుతామన్నారు. విద్యార్థులను శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఎన్టీఆర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఏసీ కళాశాల మీదుగా అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మశీ కళాశాల వరకూ ఉన్న పరీక్షా కేంద్రాలకు మ్యాగ్నజీల్ కళాశాల బస్సులో ఉచితంగా చేరవేస్తామని మ్యాగ్నజీల్ సీఏ విద్యాసంస్థ చైర్మన్ రేపాల రవికుమార్ తెలిపారు. వివరాలకు 96522 33336 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ఎంసెట్‌కు ప్రత్యేక బస్సులు
కర్నూలు(జిల్లా పరిషత్) : ఎంసెట్ విద్యార్థులను వేసవి వడగాడ్పులను మించి ఆర్టీసీ సమ్మె గుబులు పుట్టిస్తోంది. సాధారణ రోజుల్లోనే ఎంసెట్ పరీక్ష రాసేందుకు జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం చూశాం. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించని నేపథ్యంలో ప్రస్తుత ఆర్టీసీ సమ్మె ఆందోళన రేకెత్తిస్తుంది. సమ్మె ఉన్నా ప్రత్యేక బస్సులతో ఎంసెట్ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం నాటి పరీక్షకు గంట ముందుగానే పరీక్ష కేంద్రం చేరుకునేందుకు విద్యార్థులు గురువారం నుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. కొందరు విద్యార్థులు రాత్రికే కర్నూలు, నంద్యాలలోని బంధువుల ఇళ్లకు, లాడ్జిలకు చేరుకున్నారు. మరికొందరు శుక్రవారం ఉదయమే పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు సమాయత్తమయ్యారు. ప్రధానంగా ఆలూరు, ఆస్పరి, హొళగుంద, కౌతాళం నుంచి కర్నూలుకు, చాగలమర్రి, శ్రీశైలం, ఆత్మకూరు తదితర ప్రాంతాల నుంచి నంద్యాలకు వెళ్లేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉండటంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. ఆర్టీసీ ఆధ్వర్యంలో 154 ప్రత్యేక బస్సులు ఎంసెట్ కోసం 154 ప్రత్యేక బస్సులు తిప్పుతున్నట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ టి.వి.రామం తెలిపారు. కర్నూలు, నంద్యాల పరీక్షల కేంద్రాలకు ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, గూడూరు, డోన్, బేతంచర్ల, ఆత్మకూరు, మహానంది, గడివేముల, బనగానపల్లి, కోవెలకుంట్ల, నంద్యాల తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు వేశామన్నారు. ఇప్పటికే రెగ్యులర్ సర్వీసుల్లో భాగంగా 312 బస్సులను వివిధ ప్రాంతాల్లో తిప్పుతున్నామన్నారు. ప్రైవేటు కాలేజీల ఆధ్వర్యంలో... ఎంసెట్ పరీక్షలకు నగర శివారులోని పలు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల సౌకర్యార్థం బస్సు సౌకర్యాన్ని కల్పించాయి. నగరంలోని ఆయా ప్రధాన కూడళ్ల మీదుగా ఈ బస్సులు విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు చేర్చనున్నాయి. పరీక్ష కేంద్రాలకు జి.పుల్లయ్య కళాశాల బస్సులు నగర శివారులోని జి.పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఎంసెట్ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ బస్సులు పాతబస్టాండ్, కొత్తబస్టాండ్, వెంకటరమణకాలని, బళ్లారిచౌరస్తా, రాజవిహార్, సి.క్యాంపు నుంచి విద్యార్థులను ఎక్కించుకుని పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్తాయన్నారు. పరీక్షల అనంతరం ఆయా పాయింట్ల వద్ద విద్యార్థులను వదిలేలా ఏర్పాటు చేశామన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఉదయం 8 గంటలకు, మెడికల్ విద్యార్థుల కోసం మధ్యాహ్నం 1 గంటకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ఏవీఆర్, ఎస్వీఆర్ బస్సులు నగరంలోని ఎంసెట్ పరీక్ష నిర్వహించే కేంద్రాలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు నన్నూరులోని ఏవీఆర్, ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 8 గంటలకు స్థానిక బళ్లారిచౌరస్తా నుంచి కొత్తబస్టాండ్, శ్రీరామథియేటర్, రాజవిహార్ సెంటర్, కర్నూలు మెడికల్ కాలేజి, కలెక్టరేట్, సి.క్యాంపు మీదుగా ఆయా పరీక్ష కేంద్రాలకు రెండు బస్సులను ఉచితంగా తిప్పుతామన్నారు. బృందావన్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో.. నగర శివారులోని బృందావన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు కళాశాల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలోని నంద్యా ల చెక్‌పోస్టు, సంతోష్‌నగర్, పాతబస్టాండ్, ప్రకాష్‌నగర్, బస్టాండ్, బళ్లారిచౌరస్తా, మెడికల్ కాలేజి, కృష్ణానగర్ల నుంచి ఉదయం 8.15 గంటలకు బస్సులు అందుబాటులో ఉంచుతామన్నారు. ఒక్క రోజు సమ్మె విరమించండి కర్నూలు(అగ్రికల్చర్): విద్యార్థుల భవితవ్యాన్ని నిర్ణయించే ఎంసెట్ పరీక్షను దృష్టిలో ఉంచుకొని శుక్రవారం ఒక్కరోజు మానవతా దృక్పథంతో సమ్మెను విరమించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్.విజయమోహన్ ఆర్టీసీ యూనియన్ నేతలను కోరారు. గురువారం మధ్యాహ్నం ఆయన ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కృష్ణమోహన్‌తో కలిసి కర్నూలు ఆర్టీసీ-2 డిపోలో యూనియన్ల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శుక్రవారం కర్నూలు, నంద్యాల్లో జరిగే ఎంసెట్ పరీక్షకు మారుమూల గ్రామాల నుండి సైతం విద్యార్థులు హాజరు కానున్నారని.. ఆర్టీసీ సమ్మె కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారన్నారు. విద్యార్థుల జీవితాలను మలుపుతిప్పే పరీక్ష అయినందున సమ్మె నుండి ఒక్క రోజు మినహాయింపు ఇవ్వాలని కోరారు. యూనియన్ నేతలు స్పందిస్తూ ఇది ఒక జిల్లాకు సంబంధించిన ఆందోళన కాదని, మొత్తం రాష్ట్రానికి సంబంధించినదన్నారు. రాష్ట్ర స్థాయిలో చర్చించి తగు నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. -
సెంటర్‌కు చేరుకుంటామా ? లేదా ?