
'ఎంసెట్-2 ను రద్దు చేయవద్దు'
హైదరాబాద్: ఎంసెట్ - 2 ను రద్దు చేయవద్దంటూ విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంసెట్-2 పరీక్షను మళ్లీ రాయడం చాలా కష్టమని మొరపెట్టుకున్నారు. గురువారం తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డితో ఎంసెట్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భేటీ అయ్యారు. ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ లీకేజీ వ్యవహారంపై సీఐడీ విచారణ ఇంకా కొనసాగుతోందని ఆయన అన్నారు. సమస్యను తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని విద్యార్థులకు నాయిని హామీ ఇచ్చారు.