అందని ఆదరువు | no pention yet | Sakshi
Sakshi News home page

అందని ఆదరువు

Published Sun, Dec 18 2016 3:59 AM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

అందని ఆదరువు

అందని ఆదరువు

► 15వ తేదీ వచ్చినా  పంపిణీ కాని పింఛన్లు
► పండుటాకులకు ఇక్కట్లు
►అందజేసింది 20 శాతమే


సామాజిక పింఛన్ల పంపిణీలో ప్రతి నెలా ఓ ప్రయోగమే. రెండు నెలలు బాగా ఇచ్చారంటే చాలు మరో రెండు నెలల పాటు నరకయాతనే. నిబంధనల పేరుతో ఆంక్షలు పెడుతూ íపింఛనుదారుల జీవితాలతో చలగాటమాడుతోంది సర్కారు. తాజాగా పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పింఛన్  కోసం బడుగు జీవులకు నరకం చూపిస్తోంది. బ్యాంకుల చుట్టూ తిప్పిస్తోంది. రోజుల తరబడి బ్యాంకుల వద్ద పడిగాపులు కాయిస్తోంది. అయినా కరుణించేవారు లేరు. పట్టించుకునేవారు కానరారు. ఐదో తేదీలోగా అందాల్సిన పింఛన్ 15 రోజులైనా చేతిక రాని పరిస్థితి నెలకొంది.    – సాక్షి, విశాఖపట్నం
 

డిసెంబర్‌ నెలకు జిల్లాలో 3,24,707 మందికి రూ.35.42కోట్ల పింఛన్ మొత్తాన్ని మంజూరు చేస్తే ఇప్పటి వరకు 2,86,403 మందికి రూ.31 కోట్లు జమచేసినట్టుగా అధికారులు ప్రకటించారు. ఇంకా 41వేల మందికి పింఛన్లు జమకాలేదని వీరంతా బ్యాంకు ఖాతాలు తెరవకపోవడం వల్లే జమ చేయలేదని చెబుతున్నారు. పోనీ కనీసం బ్యాంకుల్లో జమ చేసిన వారిౖకెనా సొమ్ములిచ్చారా అంటే అదీ లేదు. 2.86 లక్షల మందిలో కనీసం లక్షమందికి కూడా నేటి కి పింఛన్లు అందలేదని అధికారులే చెబుతున్నా రు.

పింఛన్ లు అందుకుంటున్న వారిలో జిల్లాలో 1,48,784 మంది వృద్ధులు, 1,33,430 మంది వితంతువులు, 39,125 మంది దివ్యాంగులు, 2305 మంది చేనేత, 1063 మంది కల్లుగీత కార్మికులు ఉన్నారు. వీరిలో నేటికి సగం మందికి రూపేకార్డుల్లేవు. కార్డులున్నప్పటికీ యాక్టివేట్‌ కాకపోవడంతో రూపేకార్డుల ద్వారా తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఉదయం లేచింది మొదలు వృద్ధులు, వికలాంగులు, వితంతువు లకు బ్యాంకుల వద్ద పడిగాపులు తప్పడం లేదు.   

పింఛన్
నగర పరిధిలోనిపింఛన్ దారులకు నూటికి 65 శాతంమందికి పింఛన్లు అందినప్పటికీ గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం కనీసం 30 శాతం మందికి కూడా సొమ్ములు చేతికందని పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ తిరగడం, డబ్బుల్లేవని తిప్పి పంపించడం పరిపాటిగా మారింది. పింఛన్లు తీసుకోలేని వారిలో ఎక్కువ మంది వృద్ధాప్య, వికలాంగులే ఎక్కువగా ఉన్నారు. వీరిలో కనీసం 20 శాతం మందికి కూడా ఇప్పటి వరకు పింఛన్ సొమ్ము చేతికందని పరిస్థితి నెలకొంది. ఇప్పటికేపింఛన్ అందక అచ్యుతాపురం మండలంలో ఓ వృద్ధుడు ప్రాణాలొదలగా, ప్రతిరోజు ఏదో మూల స్పృహ తప్పిపడిపోతున్న ఘటనలు రోజు సర్వసాధారణమై పోయాయి. శుక్రవారం మునగపాక గ్రామానికి చెందిన దివ్యాంగుడు పిల్లా సూరిబాబు మునగపాక ఎస్‌బీఐ బ్యాంకు వద్ద ఎండలో నిల్చొలేక ఒక్కసారిగా ఫిట్స్‌ రావడంతో కుప్పకూలిపోయాడు.

అదే సమయంలో ఖాతాదారు లకు అందుతున్న సేవలను పరిశీలించేందుకు వచ్చిన మండల ప్రత్యేకాధికారి చంద్రశేఖర్, తహసీల్దార్‌ రాంబాబు, ఎంపీడీవో శాంతలక్షి్మలు అతనిని లేపి సపరిచర్యలు చేసి ఆస్పత్రికి తరలించారు. ఇలా క్యూలైన్లలో ప్రాణాలుకోల్పోయే బదులు బతికి బాగుంటే తర్వాత తీసుకోవచ్చు అన్న చందాన వేలాది మంది వృద్ధులు ఇళ్లకే పరిమితమైపోతున్నారు.

ప్రభుత్వం దృష్టికి సమస్య
శుక్రవారం జరిగిన వీడియోకాన్ఫరెన్్సలో ఈ విషయా న్ని జిల్లా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. బ్యాంకు ఖాతాల్లో జమైన వృద్ధులు, వికలాంగులకు నేరుగా వారి ఆధార్,పింఛన్ కార్డుల ఆధారంగా సొమ్ములు చేతికిస్తే బాగుంటుందన్న సూచన చేశారు. అదే విధంగా ఈ నెల వరకు ఖాతాల్లేని వారికి కూడా అదే రీతిలో సొమ్ములివ్వాలన్న ప్రతిపాదన చేశారు. దీనిపై సర్కార్‌ కూడా సానుకూలంగా స్పందించిందని గ్రామీణాభివృద్ధిశాఖాధికారులు చెబుతున్నారు. ఒకటి రెండ్రోజుల్లో ఈ మేరకు ఉత్తర్వులొస్తాయని..నగదు నిల్వలను బట్టి బ్యాంకుల పరిధిలో ఉన్నపింఛన్ దారులకు ఇవ్వాలని యోచనలో ఉన్నట్టుగా చెప్పారు.

చిక్కిన రేషన్
మరో పక్క రేషన్ కార్డుదారుల పరిస్థితి అదే విధంగా ఉంది. జిల్లాలో ఈ–పాస్‌ వర్తింపచేసిన 1625 షాపుల పరిధిలో 9,79,813 మంది కార్డుదారులకు ఈనెల రేషన్ ఇవ్వాల్సి ఉంది. కాగా 1312 షాపుల్లో మాత్రమే ఈపాస్‌ మిషన్లు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో ఇప్పటి వరకు 8,61,151 మందికి మాత్రమే సరుకులు ఇవ్వగలిగారు. వీరిలో 3529 మందికి నగదు రహిత పద్ధతిలో ఇవ్వగలిగారు. ఈపాస్‌ వర్తింపచేయని మిగిలిన షాపుల్లో అరువుకు రేషన్  సరుకులు ఇస్తుండడంతో చాలా వరకు ఇబ్బంది లేకుండా పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement