రేషన్‌కార్డుదారుల వేలిముద్రల సేకరణ | finger prints collected | Sakshi
Sakshi News home page

రేషన్‌కార్డుదారుల వేలిముద్రల సేకరణ

Published Mon, Jul 18 2016 12:10 AM | Last Updated on Thu, Sep 13 2018 3:15 PM

finger prints collected

కాకినాడ సిటీ : జిల్లావ్యాప్తంగా రేషన్‌కార్డుదారుల చేతివేళ్ల ముద్రలు సేకరించే ప్రక్రియను పౌర సరఫరాల అధికారులు ఆదివారం ప్రారంభించారు. జిల్లాలోని అన్ని చౌకదుకాణాల పరిధిలో ఉన్న  రేషన్‌కార్డుల్లోని సభ్యుల చేతివేళ్ల ముద్రలను డీలర్లు ఇంటింటికీ వెళ్లి తీసుకోనున్నట్టు జిల్లా పౌరసరఫరాల అధికారి జి.ఉమామహేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని 15 లక్షల రేషన్‌కార్డులకు సంబంధించి 43 లక్షల మంది సభ్యులు ఉన్నారని, ఇప్పటికే 15 లక్షల మంది వేలిముద్రల సేకరణ పూర్తి చేశామని చెప్పారు. మిగిలినవారి చేతివేళ్ల ముద్రలు సేకరిస్తున్నామని తెలిపారు. కార్డుదారులు రేషన్‌ తీసుకునే సమయంలో వేలిముద్రలు సక్రమంగా పడకపోవడంవంటి ఇబ్బందులను అధిగమించేందుకు.. కార్డుదారుల కుటుంబంలోని సభ్యులందరి చేతివేళ్ల ముద్రలూ సేకరిస్తున్నట్టు ఉమామహేశ్వరరావు వివరించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement