కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలోనూ చాలా మంది ఉపాధి కోల్పోయి అవస్తలు పడుతున్నారు. అలాంటి వారికి సాయం చేసేందుకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ముందుకు వచ్చారు. సుమారు 3600మంది డ్యాన్సర్‌లకు ప్రతి నెలా ఉచితంగా రేషన్ అందిచనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మీడియాకు తెలిపారు. ఇటీవలె కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య 50వ బర్త్‌డేను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఏ గిఫ్ట్ కావాలో కోరుకోమని అక్షయ్ అడగ్గా..పదహారు వందలమంది జూనియర్ కొరియోగ్రాఫర్లు, వృద్ధ నృత్యకారులకు ఒక నెల రేషన్‌తో పాటు సుమారు 2000 మంది ఇతర సహాయ డ్యాన్సర్లకు సహాయం చేయమని ఆయన కోరినట్టు తెలిపాడు. దీంతో వెంటనే అంగీకరించిన అక్షయ్..గణేష్ ఆచార్య ఫౌండేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న డ్యాన్సర్లకు ప్రతినెలా రేషన్ అందించనున్నారు. ఇక గతేడాది కూడా కరోనా నేపథ్యంలో అక్షయ్ పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.25 కోట్లు అందించిన సంగతి తెలిసిందే. కష్టకాలంలో ఆయన ఎన్నోసార్లు కోట్ల రూపాయలు విరాళాలు ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. క్లిష్టపరిస్థితుల్లో తన వంతు సాయం చేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు.
చదవండి : బెదిరింపులు రావడంతో చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన యాంకర్
నెలకు రూ.లక్ష పైనే, నన్ను పెళ్లి చేసుకుంటావా?
Comments
Please login to add a commentAdd a comment