రేషన్ దుకాణాల్లో మంత్రి సునీత తనిఖీ
రేషన్ దుకాణాల్లో మంత్రి సునీత తనిఖీ
Published Tue, Sep 6 2016 11:18 PM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
నగదు రహితంపై ఆరా
విజయవాడ (భవానీపురం) :
స్థానిక చౌక ధరల దుకాణాలలో పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. 3, 4 షాపులలో నగదు రహిత సరుకుల పంపిణీ విధానాన్ని పరిశీలించి, దానిపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణాజిల్లాలో ప్రప్ర«థమంగా నగదు రహిత పంపిణీని ప్రారంభించి అమలు చేస్తున్నామని అన్నారు. అర్హులైన ప్రతి కార్డుదారునికి పారదర్శకంగా సరుకులను అందిస్తున్నామని చెప్పారు. ఈ నెలలో ఇ–పోస్ ద్వారా ఇప్పటికే 69 శాతం సరుకులను పంపిణీ చేశామన్నారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 87 శాతం పంపిణీ పూర్తి అయ్యిందని తెలిపారు. బతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాలలో ఉంటున్నవారు పోర్టబులిటీ విధానాన్ని వినియోగించుకోవాలన్నారు. పోర్టబులిటీ ద్వారా గత నెలలో 48వేల మంది సరుకులు పొందగా, ఈ నెలలో 7లక్షల మంది పొందారని వివరించారు. ఆమెతోపాటు డీఎస్‌ఓ రవికిరణ్, 27వ డివిజన్ కార్పొరేటర్ షేక్ హబిబుల్లా, ఏఎస్‌ఓ శ్యామ్‌కుమార్ ఉన్నారు.
Advertisement