Minister Sunitha
-
సునీతమ్మా.. ఇదేనా శిశు సంక్షేమం?
సాక్షి, అనంతపురం సిటీ: స్వయానా జిల్లా మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న శాఖ అది. తరచూ పర్యవేక్షణ ఉంటుందన్న భయంతో ఉద్యోగులు పని చేయాల్సి ఉంది. కానీ అనంతపురం జిల్లాలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. చివరికి బరి తెగించి అభం శుభం తెలియని అమాయక చిన్నారులను అమ్మకానికి పెట్టారంటే తెలుగుదేశం పాలనలో అవినీతి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అమ్మకానికి శిశువులు అసలే వారు అనాథ చిన్నారులు, చెత్తకుప్పల్లోనూ. ముళ్ల పొదల్లోనూ దొరికిన వారు. అలాంటి వారిని తీసుకువచ్చి స్త్రీ, శిశు సంక్షేమశాఖకు చెందిన శిశు గృహలో ఉంచి కంటికి రెప్పలా కాపాడాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా శిశువులను అమ్మకానికి పెడుతున్నారు. ఓ విదేశీయురాలు ఇందుకు సంబంధించి నేరుగా కేంద్ర మంత్రి మేనకాగాంధీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కెనడాకు చెందిన ఓ మహిళ శిశు గృహంలోని ఓ చిన్నారిని దత్తత తీసుకుంది. ఆ సమయంలో అక్కడి సిబ్బంది ఖర్చులకని చెప్పి ఆమెతో రూ.లక్ష తీసుకున్నట్లు తెలిసింది. దత్తత సమయంలో కోర్టు ఇచ్చే అనుమతి పత్రంలో చిన్నారి పేరు తప్పు పడింది. దీంతో ఆ చిన్నారికి పాస్‌పోర్ట్ రావడం ఆలస్యమైంది. దీంతో మరోసారి జిల్లాలోని శిశుగృహ సిబ్బందిని సంప్రదించింది. దీన్ని వరంగా మార్చుకున్న సిబ్బంది ఆ విదేశీ మహిళను మరోసారి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రికి ఫిర్యాదు భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడంతో ఆ విదేశీయురాలు దిక్కుతోచని స్థితిలో నేరుగా కేంద్ర స్త్రీ శిశు సంక్షేమశాఖా మంత్రి మేనకాగాంధీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే విచారణ జరిపి సదరు సిబ్బందిని టర్మినేట్ చేయాలని స్త్రీ శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఆయన శిశు గృహ అధికారి సుబ్రమణ్యంను శుక్రవారం ఆఘమేఘాల మీద గుంటూరుకు పిలిపించారు. అక్కడ ఇలాంటి సిబ్బందిని ఎలా పెట్టుకున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కమిషనర్, కలెక్టర్ విషయాన్ని సమీక్షించి శిశుగృహ కోఆర్డినేటర్‌ను టర్మినేట్ చేయాలని ఫైలు తయారు చేయాలని పీడీ చిన్మయాదేవిని ఆదేశించారు. టర్మినేటర్ ఆర్డర్‌ను తయారు చేసి శుక్రవారం రాత్రి కలెక్టర్‌కు పంపించారు. గతంలోనూ ఇలాగే... 3 సంవత్సరాల క్రితం మడకశిరకు చెందిన ఓ చిన్నారిని ఇదే సిబ్బంది రూ.40 వేలకు ఉరవకొండకు చెందిన వారికి అమ్మేశారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి బయటకు పొక్కింది. దీంతో విచారణ జరిపిన అప్పటి సీడీపీఓ విజయశ్రీ సంఘటన జరిగిన మాట వాస్తవమేనని, చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చింది. అయితే అప్పుడు కూడా తమకున్న రాజకీయ పలుకుబడితో ఈ విషయాన్ని తొక్కిపెట్టినట్లు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు శిశు గృహలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడ వీరు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోందని ఆ శాఖ సిబ్బందే చెబుతున్నారు. ఎవరైనా వీరు చేసే అక్రమాల గురించి ప్రశ్నిస్తే వారిని తమకున్న రాజకీయ పలుకుబడితో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అందుకే ఎవరూ నోరు విప్పరని సిబ్బంది చెబుతున్నారు. తెలుగుదేశం పాలనలో స్వయంగా మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
అట్టుడికిన అనంత
అనంతపురం న్యూసిటీ: అనంతపురం మండలం కందుకూరులో శుక్రవారం ప్రత్యర్థుల చేతిలో వైఎస్సార్సీపీ కార్యకర్త శివారెడ్డి దారుణహత్యకు గురయ్యారు. సర్వజనాస్పత్రి మార్చురీలో శివారెడ్డి మృతదేహాన్ని శనివారం ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, శంకరనారాయణ, రాప్తాడు, తాడిపత్రి, అనంతపురం నియోజకవర్గ సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, నదీం అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రిష్టప్ప, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైటీ శివారెడ్డి సందర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మృతదేహాన్ని సందర్శించిన వారిలో వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు నరేంద్రబాబు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, పార్టీ నేతలు పైలా నర్సింహయ్య, మహానందరెడ్డి, నరేంద్రరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, ఆలమూరు సుబ్బారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కొండమ్మ, కృష్ణవేణి, ప్రశాంతి తదితరులు ఉన్నారు. పరిటాల శ్రీరామ్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చండి పరిటాల శ్రీరామ్ అండతోనే శివారెడ్డి హత్య జరిగిందని, ఎఫ్ఐఆర్లో ఆయన పేరును చేర్చాలని మార్చురీ ఆవరణలోనే వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన చేశారు. సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ మంత్రి సునీతకు తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ జోక్యం చేసుకుని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. పరిటాల సునీత, శ్రీరామ్‌తోపాటు పరిటాల మహేంద్ర, మురళి ప్రమేయంతోనే హత్య జరిగిందని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. సీఐ ఉదాసీనతే హత్యకు కారణమని డీఎస్పీ దృష్టికి తెచ్చారు. పోలీసులు పచ్చ చొక్కాలకు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాను రాజకీయంగా శాసించాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు దారుణాలకు తెగిస్తున్నారని, ఎన్నికల ఎత్తుగడలో భాగంగా టీడీపీ నేతలు హత్యాకాండకు తెరదీశారని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. శివారెడ్డిది ప్రభుత్వ హత్యేనని, ఈ హత్యకు సీఎం చంద్రబాబు, మంత్రి పరిటాల సునీత పూర్తి బాధ్యత వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు శంకరనారాయణ డిమాండ్ చేశారు. మృత దేహంతో ర్యాలీ శివారెడ్డి మృతదేహంతో ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాలని వైఎస్సార్సీపీ నేతలు సర్వజనాస్పతి నుంచి ర్యాలీగా బయలు దేరారు. తెలుగుతల్లి విగ్రహం వద్దకు రాగానే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన హత్యాకాండపై డీఎస్పీ వెంకట్రావ్‌కు ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎంపీ ‘అనంత’, ప్రకాశ్‌రెడ్డి వివరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. మంత్రి సునీత బాధ్యత వహించాలి పోలీసుల మెతక వైఖరితోనే శివారెడ్డి హత్యకు గురయ్యాడు. వ్యవసాయం చేస్తూ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవారిని హత్య చేయడం కిరాతకం. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న వరుస హత్యలకు మంత్రి పరిటాల సునీత పూర్తి బాధ్యత వహించాలి. హత్యలు జరుగుతుంటే, అదుపు చేయాల్సిన బాధ్యత మంత్రిపై ఉంది. కేసులో భాగస్వామ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరతాం. పీర్ల పండుగలో జరిగిన గొడవ తర్వాత హత్యకు ప్రయత్నిస్తున్నారని తమ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలకు రాచమర్యాదాలు చేస్తున్నారు. – వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఉరవకొండ కిరాయి హంతకులతో హత్యలు రౌడీలు, కిరాయి హంతకులను మంత్రి సునీత, శ్రీరామ్, మహేంద్ర, మురళి దగ్గరపెట్టుకుని ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను హత్యలు చేయిస్తున్నారు. శివారెడ్డి ప్రజాదరణ కలిగిన కార్యకర్త. అతన్ని హత్య చేస్తే పార్టీ శ్రేణులు భయోత్పాతానికి గురవుతారనే చంపేశారు. కందుకూరులో పరిటాల మహేంద్ర దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీ వస్తుందనే కుట్రతోనే హత్య చేయించారు. బీకేఎస్ మండలానికి చెందిన రౌడీషీటర్ బాలకృష్ణకు ఇక్కడ పార్టీ పగ్గాలు అప్పగించారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం చేతకాక, ఓటమి భయంతో మంత్రి సునీత దాడులకు ఉసిగొల్పుతున్నారు. నసనకోటలో బోయ సూర్యంపై దాడి చేయించారు. శ్రీరామ్ తనను తీసుకెళ్లి చితకబాదాడని సూర్యం రెండుసార్లు ఎస్పీకి రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. టీడీపీ ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు చేసినా పోలీసులు వెనుకేసుకొస్తున్నారు. శివారెడ్డి హత్య కేసులో మంత్రి, వారి బంధువులను తప్పించాలని చూస్తున్నారు. – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, రాప్తాడు -
విధులకు ఎగనామం
పంచాయతీరాజ్ ఉద్యోగి నిర్వాకం.. మంత్రి పరిటాల సునీత పీఏ పేరుతో విధులకు డుమ్మా పీఏగా అనర్హుడైనా చక్రం తిప్పుతున్న వైనం చర్యలకు వెనకడుగేస్తున్న ఉన్నతాధికారులు అనంతపురం సిటీ: ఉద్యోగ సంఘం నేత.. ఆపై అధికార పార్టీ అండదండలు.. మంత్రి అనుచరుడిగా గుర్తింపు.. ఇంకేముంది తాను ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. అర్హత లేకపోయినా మంత్రి పీఏగా చెలామణి అవుతున్నాడు. సొంత విధులకు ఎగనామం పెడుతున్నాడు. ఎంచక్కా జీతమూ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా తన సొంత శాఖలో ఉన్నతాధికారులను సైతం శాసించేస్థాయికి ఎదిగాడు. ఆయనెవరో కాదు పంచాయతీరాజ్ శాఖ ధర్మవరం సబ్‌డివిజనల్ కార్యాలయం సూపరింటెండెంట్ గంధం శ్రీనివాసులు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన విధులకు వెళ్లలేదు. మంత్రి పరిటాల సునీతకు పీఏగా అనధికారికంగా కొనసాగుతూ ఆమె వెంటే ఉంటున్నాడు. వాస్తవానికి ప్రభుత్వం నుంచి ఈయన్ని పీఏగా నియమించినట్లు ఉత్తర్వులు లేవు. రికార్డుల్లో ఈ విషయాన్ని ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా స్పష్టం చేయలేదు. మూడేళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు డుమ్మా కొడుతున్న ఈయన వ్యవహరం ప్రస్తుతం ఆ శాఖలోని ఉన్నతాధికారులకు కూడా తలనొప్పిగా మారింది. తనకు కావాల్సిన వారిని కోరిన చోటుకు బదిలీ చేయించుకోవడం, సమాచారం ఏదైనా కావాలంటే మంత్రి పేరు చెప్పి అధికారులను బెదిరించడం పరిపాటిగా మారింది. చమన్ హయాంలో జరిగిన బదిలీల విషయంలో కూడా నలుగురు ఉద్యోగులకు నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్ ఇప్పించినట్లు తెలిసింది. మంత్రి అండదండలు ఉండటంతో సూపరింటెండెంట్‌ను ఉన్నతాధికారులెవరూ ప్రశ్నించే సాహసం కూడా చేయడం లేదు. పీఏగా ఉండాలంటే.. ప్రజాప్రతినిధికి ప్రభుత్వం నుంచి పీఏని ఏర్పాటు చేయాల్సి వస్తే సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఉద్యోగిని ఎంపిక చేస్తారు. సూపరింటెండెంట్ స్థాయి అధికారి ఇందుకు అనర్హులు. అయినా అధికారుల అత్యుత్సాహం, లెక్కలేనితనంతో గంధం శ్రీనివాసులు మూడేళ్లుగా అనధికారిక పీఏగా కొనసాగుతున్నాడు. అన్నీ తెలిసినా చర్యలు లేవ్ ఆర్‌డబ్ల్యూఎస్‌లో ముగ్గురు సిబ్బంది సమావేశానికి హాజరుకాలేదని, రెవెన్యూలో ఒకరిని, ఎంపీడీఓల్లో ఒకరిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఓ చిరుద్యోగి రూ.1500 లంచం తీసుకున్నాడని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరి మూడేళ్లుగా పంచాయతీరాజ్ శాఖలో సూపరిండెంటెంట్ స్థాయి అధికారి పని చేయకుండా అప్పనంగా వేతనం తీసుకుంటుంటే ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. మంత్రి సునీత కూడా స్పందించని తీరు: తనకు దూరపు చుట్టమంటూ చెప్పుకుని తిరుగుతున్న అనధికారిక పీఏ గంధం శ్రీనివాసులు వ్యవహార శైలిపై ఎన్ని అభియోగాలున్నా మంత్రి పరిటాల సునీత పట్టించుకోలేదని సమాచారం. పైగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాకున్నా ఓ అధికారి నిత్యం వారి వెంటే తిరుగుతున్నా కనీసం ఆరా కూడా తీయలేదంటే మంత్రికి బంధుప్రీతి ఏమేరకు ఉందో ఇట్టే అర్థమవుతుంది. -
మితిమీరిన మంత్రి బంధువుల ఆగడాలు
రామగిరి: మంత్రి పరిటాల సునీత బంధువుల ఆగడాలు మండలంలో పెచ్చుమీరుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొన్న మంత్రిగారి బంధువైన ఓ కాంట్రాక్టర్‌కు లబ్ధిచేకూర్చేందుకు బాగున్న ఎంపీడీఓ కార్యాలయాన్ని కూల్చేశారు. ఆ తరువాత ఆ భవనానికి ఉన్న రూ.లక్షలు విలువజేసే రాళ్లను మరొక బంధువుకు కారు చౌకగా అప్పగించారు. మరో బంధువుకు సిమెంట్ గోడౌన్ కోసం బస్‌షెల్టర్‌ను అప్పగించారు. ఇవన్నీ చాలవన్నట్లు అధికారం ఉంది.. అడిగేవారెవరు? అన్నరీతిలో రామగిరి మండలంలో మంత్రి బంధువులు, అనుచరులు చెలరేగి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారు. వీటిని కట్టడి చేయాల్సిన అధికారులు వారికి అడుగులు మడుగులు ఒత్తుతూ జీ హుజూర్ అంటున్నారు. ఇక మంత్రిగారి సొంత పంచాయతీ నసనకోటలో ఇటీవల తాగునీటి సమస్య తీర్చేందుకు రూ.2కోట్లతో పనులు చేపట్టారు. 4 బోరుబావులను ఇటీవలే తవ్వించారు. మిగిలిన ట్యాంకుల నిర్మాణం పైపులైన్ల ఏర్పాటు కొనసాగుతోంది. కొత్తగా తవ్విన బోరుబావుల్లో పుష్కలంగా నీరుపడింది. ఇక ఆలస్యమెందుకు అనుకున్నారో ఏమో ప్రభుత్వ బోర్ల నుంచి వచ్చే నీటితో గంగంపల్లికి చెందిన మంత్రి గారి ఇద్దరు బంధువులు 8 ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగు చేశారు. వారి పంటలు పూర్తయ్యే వరకు నీటిని వదలాలని మంత్రే స్వయంగా అధికారులు ఆదేశాలిచ్చారు. ఇక అడ్డేముంది యథేచ్ఛగా ప్రభుత్వ నిధులతో తమ పంటపొలాలకు పైపులు ఏర్పాటు చేసుకొని నీటిని తరలించేస్తున్నారు. -
ఇంటికి చేరని రేషన్
- మీ ఇంటికి ... మీ రేషన్ అమలు అంతంతే - మంత్రి సొంత మండలంలోనూ అధ్వానం - 26 మంది ఉంటే 6 మందికే అందిన వైనం అనంతపురం అర్బన్ : జిల్లాలో మీ ఇంటికి.. మీ రేషన్ పంపిణీ అంతంత మాత్రంగానే జరుగుతోంది. చౌక దుకాణాలకు వచ్చిన రేషన్ తీసుకోలేని కార్డు దారుల ఇంటికి వీఆర్ఓలు నేరుగా వెళ్లి రేషన్ అంచాల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ విధానం ఇప్పుడు మొక్కుబడి మారింది. పౌర సరఫరాల శాఖ మంత్రి సొంత మండలం రామగిరిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 1,246 మందిలో 836 మంది పంపిణీ జిల్లా వ్యాప్తంగా 63 మండలాల పరిధిలో ప్రస్తుత నెలలో 1,286 మంది లబ్ధిదారులకు మీ ఇంటికి... మీ రేషన్ ద్వారా సరకులను వీఆర్ఓలు అందించాల్సి ఉంది. అధికారిక నివేదిక ప్రకారం 836 మంది మాత్రమే సరుకులను వీఆర్ఓలు అందజేశారు. 410 మందికి సరుకులు అందలేదు. పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సొంత మండలం రామగిరిలోనూ మీ ఇంటికి... మీ రేషన్ సక్రమంగా అమలు కాలేదు. అక్కడ 26 మందికి మీ ఇంటికి– మీరేషన్ కింద సరుకులు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఆరుగురికి మాత్రమే పంపిణీ చేశారు. మరికొన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. గార్లదిన్నె మండలంలో ఇద్దరు ఉంటే ఇక్కడ మాత్రమే ఆ ఇద్దరికి అందజేశారు. పదహైదు మండలాల్లో ఫర్వాలేదు అనే విధంగా పంపిణీ జరిగింది. దీన్ని బట్టి చూస్తే విధానం అమలులో చిత్తశుద్ధి లోపించిందనేది స్పష్టమవుతోంది. మచ్చుకు కొన్ని మండలాల్లో పంపిణీ మండలం వీఆర్ఓలకు అప్పగించిన కార్డులు వీఆర్ఓలు పంపిణీ చేసింది సరుకులు అందని సంఖ్య అనంతపురం 147 104 43 ధర్మవరం 60 36 24 గుంతకల్లు 51 13 38 రామగిరి 26 6 20 అమరాపురం 24 7 17 బొమ్మనహళ్ 25 15 10 రొద్దం 34 19 15 తాడిపత్రి 35 21 14 మడకశిర 25 12 13 -
‘తల్లీబిడ్డపై నిర్లక్ష్యం’ వద్దు
అనంతపురం మెడికల్ : ప్రసవానంతరం తల్లీబిడ్డ సంరక్షణే ధ్యేయంగా ప్రవేశపెట్టిన ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని మంత్రి పరిటాల సునీత సూచించారు. సర్వజనాస్పత్రిలో ప్రసవమై ఇంటికి వెళ్లేందుకు 102 వాహనం కోసం రోజంతా నిరీక్షించిన ఓ బాలింత దీనస్థితి, జిల్లాలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహన సేవల్లో జరుగుతున్న నిర్లక్ష్యంపై ‘తల్లీబిడ్డపై నిర్లక్ష్యం’ శీర్షికతో బుధవారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన మంత్రి మధ్యాహ్నం సర్వజనాస్పత్రిలోని ప్రసూతి వార్డులను ఆకస్మికంగా పరిశీలించారు. పలువురు గర్భిణులు, బాలింతలతో వైద్య సేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో మాత్రమే డిశ్చార్జ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ జేసీ రెడ్డి, ఆర్ఎంఓ వైవీ రావుకు సూచించారు. జిల్లాలో వైద్య సేవలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణకు సూచించారు. -
రేషన్ దుకాణాల్లో మంత్రి సునీత తనిఖీ
నగదు రహితంపై ఆరా విజయవాడ (భవానీపురం) : స్థానిక చౌక ధరల దుకాణాలలో పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. 3, 4 షాపులలో నగదు రహిత సరుకుల పంపిణీ విధానాన్ని పరిశీలించి, దానిపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణాజిల్లాలో ప్రప్ర«థమంగా నగదు రహిత పంపిణీని ప్రారంభించి అమలు చేస్తున్నామని అన్నారు. అర్హులైన ప్రతి కార్డుదారునికి పారదర్శకంగా సరుకులను అందిస్తున్నామని చెప్పారు. ఈ నెలలో ఇ–పోస్ ద్వారా ఇప్పటికే 69 శాతం సరుకులను పంపిణీ చేశామన్నారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 87 శాతం పంపిణీ పూర్తి అయ్యిందని తెలిపారు. బతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాలలో ఉంటున్నవారు పోర్టబులిటీ విధానాన్ని వినియోగించుకోవాలన్నారు. పోర్టబులిటీ ద్వారా గత నెలలో 48వేల మంది సరుకులు పొందగా, ఈ నెలలో 7లక్షల మంది పొందారని వివరించారు. ఆమెతోపాటు డీఎస్ఓ రవికిరణ్, 27వ డివిజన్ కార్పొరేటర్ షేక్ హబిబుల్లా, ఏఎస్ఓ శ్యామ్‌కుమార్ ఉన్నారు. -
దేవుడి సేవలో ఆనందం
విజయవాడ(లబ్బీపేట) : దేవుడి, సమాజ సేవలోనే ఆనందం ఉందని రాష్ట్ర పౌరసరఫరాల, గృహనిర్మాణ శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా స్వరాజ్య మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా ఏర్పాటు చేయగా, వారి ఆధ్వర్యంలో ప్రతి రోజూ లక్ష మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. అన్నప్రసాదానికి గాను నగరానికి చెందిన మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి ప్రతిరోజూ ఐదు టన్నుల కూరగాయలను అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబరావు నేతృత్వంలో ఘన్‌సన్‌సార్ సంస్థ, అరవపల్లి ఆదిత్య, మండవ సస్య, మనీష్ అగర్వాల్, సతీష్ అగర్వాల్‌లు మంగళవారం ఐదు టన్నుల కూరగాయలను టీటీడీ శ్రీవారి అన్నప్రసాదానికి అందజేశారు. ఈ సందర్భంగా కూరగాయల లారీని బృందావనకాలనీలోని ఎ కన్వెన్షన్ సెంటర్ వద్ద మంత్రి సునీత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత జెండా ఊపి ప్రారంభించారు. సునీత మాట్లాడుతూ డబ్బును సంపాదించే వారు చాలా మంది ఉంటారని, సంపాదన ఇతరులకు పెట్టే వారు తక్కువ మంది ఉంటారన్నారు. మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ ప్రస్తుత కృష్ణాపుష్కరాలో సేవలు చేసేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారని, అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వల్లూరు అశోక్, బీఏ నాగు, మండవ శ్రీనివాస్, నువ్వుల రాజేష్, మండవ శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. -
మీ ఇంటికి...మీ రేషన్ అమలు అం‘తంతే’
► పండుటాకులకు అందని సరుకులు ► ఈ నెల 1,343 మంది పంపిణీ చేయని వైనం జిల్లాలో నిస్సహాయులు – 4,190 వీఆర్ఓ అథెంటికేషన్ ద్వారా పంపిణీ– 2,837 సరుకులు అందని నిస్సహాయులు– 1,343 అనంతపురం అర్బన్: నిస్సహాయులు చౌక దుకాణానికి వచ్చి సరుకులు తీసుకుని పోలేని పరిస్థితి. దీంతో చాలా మందికి సమస్యగా మారింది. ఈ క్రమంలో చౌక దుకాణానికి రాలేని వారి ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీఆర్ఓ అథెంటికేషన్ ద్వారా ఇలాంటి వారికి రేషన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లాలో ప్రారంభించారు. ఇంత వరకు బాగానే ఉంది. జూన్ నెల వరకు సవ్యంగానే సాగింది. అయితే ప్రస్తుత (జూలై) నెలలో మాత్రం నిర్లక్ష్యం చోటు చేసుకుంది. పర్యవసానంగా రేషన్ దుకాణాలకు వెళ్లేలేని స్థితిలో ఉన్న వృద్ధులకు రేషన్ అందలేదు. జిల్లా 1,343 మందికి అందలేదు జిల్లాలో 4,190 మంది నిస్సహాయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరిMీ ప్రతి నెలా 7వ తేదీ నుంచి ఇళ్ల వద్దకే వెళ్లి వీఆర్ఓలు సరుకులు అందజేయాలి. అయితే ప్రస్తుత నెలలో వీఆర్ఓ అథెంటికేషన్ ద్వారా నిస్సహాయులకు సరుకులు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం చోటు చేసుకుంది. సీఎం డ్యాష్ బోర్డులో అధికారులు ఉంచిన అధికారిక సమాచారం ప్రకారం 4,190 నిస్సహాయుల్లో 2,847 మందికి మాత్రమే రేషన్ అందించారు. 1,343 మందికి ఇవ్వలేదు. అటు రేషన్ దుకాణానికి వెళ్లి తీసుకోక, ఇటు వీఆర్ఓలు ఇవ్వకపోవడంతో చాలా మంది సరుకులు పొందలేకపోయారు. జిల్లాలోని 63 మండలాల్లో ఒకటి రెండు చోట్ల తప్ప మిగతా అన్ని మండలాల్లోనూ ఈ నెల పూర్తి స్థాయిలో నిస్సహాయులకు సరకులు అందజేయలేదు. సాంకేతిక కారణాలతో రేషన్ దూరం సాంకేతిక కారణాలను చూపిస్తూ కొందరు నిస్సహాయులకు రేషన్ ఇవ్వడం లేదు. వేలిముద్రలు సరిపోలడం లేదని కొందరికి, ఆధార్ అనుసంధానం కాలేదంటూ మరికొందరికి రేషన్ ఇవ్వడం లేదు. రేషన్ కార్డు ఉండి, వేలిముద్రలు సరిపోలని, ఆధార్ అనుసంధానం కాని వారికి వీఆర్ఓ అథెంటికేషన్ ద్వారా సరుకులు అందజేయాలని మంత్రే స్వయంగా చెప్పినా, వారికి మాత్రం సరుకులు అందడం లేదు. కొందరు రేషన్ షాపుల్లో తీసుకున్నారు నిస్సహాయులుగా ఉన్నవారు కొందరు రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తీసుకున్నారు. మాకు తెలిసినంత వరకు సరుకులు అందలేదనే ఫిర్యాదులు రాలేదు. ఇప్పటికీ రేషన్ అందని వారికి తక్షణం అందించాలని అధికారులను ఆదేశిస్తాం. – ప్రభాకర్‌రావు, డీఎస్ఓ మచ్చుకు కొన్ని మండలాలు మండలం నిస్సహాయులు ఈ నెల రేషన్ అందుకున్నది రేషన్ అందని వారు కుందుర్పి 254 112 142 ధర్మవరం 298 134 164 అనంతపురం 213 172 41 అమరాపురం 70 38 32 బొమ్మనహాళ్æ 24 10 14 గోరంట్ల 90 48 42 గుమ్మగట్ట 24 11 13 పెనుకొండ 44 22 22 -
నేడు మంత్రి సునీతతో ఫోన్‌ఇన్
అనంతపురం అర్బన్ : పౌర సరఫరాల అంశాలపై ఈనెల 18న ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి పరిటాల సునీత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. డ్వామా సమావేశ మందిరంలో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు తానే స్వయంగా నిర్వహిస్తానని తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ, తూనికలు కొలతలు, దీపం, తదితర సమస్యలు, ఫిర్యాదులను ప్రజలు 08554– 274058లో ఫోన్ చేసి తెలియజేÄñæ¬చ్చని మంత్రి తెలిపారు. -
నిధులన్నీ ‘నీళ్ల’పాలు
► మంత్రి సునీత నియోజకవర్గంలో దాహం తీర్చని రూ.14.69 కోట్ల పథకం ► పదేళ్లుగా చుక్కనీరు అందలేదంటున్న గ్రామీణులు ► ఎక్కడికక్కడ పగులుతున్న పైప్‌లైన్ రామగిరి : జిల్లాలో అత్యంత వెనుకబడిన రామగిరి, కనగానపల్లి మండలాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన తాగునీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. వీటి ద్వారా ఏ ఒక్కరోజూ నీరు సక్రమంగా అందలేదంటూ గ్రామీణులు చెబుతున్నారు. మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గంలోనే ఈ దుస్థితి నెలకొనడం గమనార్హం. ఈ రెండు మండలాల్లోని 54 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ. 14.69 కోట్లతో రామగిరి మండలం గంగంపల్లి వద్ద సత్యసాయి తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. దీన్ని 2003 మే 21న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ప్రారంభంలో కొన్ని రోజుల పాటు నీరు సక్రమంగా అందింది. తర్వాత పైప్లైన్లు తరచూ పగిలిపోతుండటంతో పథకం కాస్తా నీరుగారిపోయింది. ఫలితంగా రామగిరి మండలంలో 30, కనగానపల్లి మండలంలోని 24 గ్రామాలకు నీరు అందడం లేదు. పథకం నిర్వహణలో 54 మంది కార్మికులు ఈ పథకం కింద పీఏబీఆర్ నుంచి ఆత్మకూరు, కొండపల్లి, నర్సంపల్లి, పీఆర్ కొట్టాల మీదుగా పైప్‌లైన్ అమర్చి నీటిని సరఫరా చేసేవారు. పథకం నిర్వహణకు 54 మంది కాంట్రాక్ట్ కార్మికులను కూడా నియమించారు. కొండపల్లి నుంచి గరిమేకలపల్లి వరకు సుమారు 250 కిలోమీటర్ల పైపులైన్ ద్వారా ఆయా గ్రామాలకు తాగునీరు చేరాల్సి ఉండగా.. ఎక్కడికక్కడ పైపులు పగిలిపోతుండటంతో చుక్కనీరు అందడం లేదు. పదమూడేళ్లుగా మరమ్మతు పనులు కూడా సక్రమంగా చేపట్టడం లేదు. కాంట్రాక్టర్లు మారుతున్నారు కానీ, ఏ ఒక్క పనీ సక్రమంగా చేపట్టలేదన్న ఆరోపణలున్నాయి. ప్రధాన పైప్లైన్లోనే లోపాలు ప్రధాన పైప్‌లైన్ సక్రమంగా లేకపోవడంతో తరచూ లీకేజీలు ఏర్పడేవి. మరమ్మతులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఆయా కాంట్రాక్టర్ల జేబులను మాత్రమే నింపాయి. లీకేజీల నివారణకు సంబంధించి పనులు చేపట్టిన దాఖలాలు లేవు. -
మంత్రి సునీతకి చేదు అనుభవం
-
కర్ణాటక వోల్వో బస్సు దగ్ధం
గార్లదిన్నె (అనంతపురం): మరో వోల్వో బస్సు మంటల్లో దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో 34 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేట క్రాస్ వద్ద హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారి(ఎన్‌హెచ్-44)పై ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కేఏ 01ఏపీ4114 నంబరు గల కర్ణాటకకు చెందిన వోల్వో బస్సు శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్న కాలికట్కు బయలుదేరింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తిమ్మంపేట క్రాస్ వద్దకు చేరుకోగానే బస్సులోని ఫైర్ అలారం మోగింది. వెంటనే డ్రైవర్ తిమ్మరాజు బస్సును రోడ్డు పక్కన ఆపేశాడు. అతను కిందకు దిగి బస్సు వెనుక వైపు వెళ్లి చూడగా అప్పటికే మంటలు వ్యాపించాయి. దీంతో డ్రైవర్ గట్టిగా కేకలు వేయడంతో కొంతమంది ప్రయాణికులు నిద్రలేచి కిందకు దిగారు. మిగిలిన ప్రయాణికులను కూడా డ్రైవర్ నిద్రలేపి బస్సులో నుంచి కిందకు దించేశాడు. వారు దిగిన కొద్దిసేపటికే బస్సు మొత్తం దగ్ధమైంది. డ్రైవరు అప్రమత్తంగా లేకపోతే తమ ప్రాణాలు మంటల్లో కలిసిపోయేవని ప్రయాణికులు వాపోయారు. విషయం తెలిసిన వెంటనే గార్లదిన్నె ఎస్ఐ శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకుని ఫైరింజిన్‌కు ఫోన్ చేసి రప్పించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి సునీత ఘటనా స్థలాన్ని మంత్రి పరిటాల సునీత ఆదివారం తెల్లవారుజామున పరిశీలించారు. విజయవాడ నుం చి అనంతపురం వెళుతూ మార్గమధ్యంలోని ఘటనా స్థలం వద్ద ఆమె ఆగారు. అధికారులతో మాట్లాడి అనంతపురం నుంచి మరో వోల్వో బస్సును రప్పించి ప్రయాణికులను గమ్యస్థానానికి పంపించారు.