‘తల్లీబిడ్డపై నిర్లక్ష్యం’ వద్దు | minister sunitha visit government hospital | Sakshi
Sakshi News home page

‘తల్లీబిడ్డపై నిర్లక్ష్యం’ వద్దు

Oct 19 2016 10:55 PM | Updated on Jun 1 2018 8:39 PM

‘తల్లీబిడ్డపై నిర్లక్ష్యం’ వద్దు - Sakshi

‘తల్లీబిడ్డపై నిర్లక్ష్యం’ వద్దు

ప్రసవానంతరం తల్లీబిడ్డ సంరక్షణే ధ్యేయంగా ప్రవేశపెట్టిన ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని మంత్రి పరిటాల సునీత సూచించారు.

అనంతపురం మెడికల్‌ : ప్రసవానంతరం తల్లీబిడ్డ సంరక్షణే ధ్యేయంగా ప్రవేశపెట్టిన ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని మంత్రి పరిటాల సునీత సూచించారు.  సర్వజనాస్పత్రిలో ప్రసవమై ఇంటికి వెళ్లేందుకు 102 వాహనం కోసం రోజంతా నిరీక్షించిన ఓ బాలింత దీనస్థితి, జిల్లాలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహన సేవల్లో జరుగుతున్న నిర్లక్ష్యంపై ‘తల్లీబిడ్డపై నిర్లక్ష్యం’ శీర్షికతో బుధవారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన మంత్రి మధ్యాహ్నం సర్వజనాస్పత్రిలోని ప్రసూతి వార్డులను ఆకస్మికంగా పరిశీలించారు.

పలువురు గర్భిణులు, బాలింతలతో వైద్య సేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో మాత్రమే డిశ్చార్జ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జేసీ రెడ్డి, ఆర్‌ఎంఓ వైవీ రావుకు సూచించారు. జిల్లాలో వైద్య సేవలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement