
సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు జిల్లాలోని ఓబులేశునిపల్లెలో కుష్టు వ్యాధిగ్రస్తులకు రేషన్ అందేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌కి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. వారికి బొటనవేలు కానీ ఇతర చేతి వేళ్లు లేకపోవడం వల్ల బయోమెట్రిక్‌లో వేలిముద్రలు వేయలేకపోయారని, అందువల్ల రేషన్ ఇచ్చేందుకు నిరాకరించారని ఆదివారం పత్రికల్లో వార్తలు చదివినట్టు పేర్కొన్నారు.
ఈ మేరకు సీఎస్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేశారు. దీనిపై సీఎస్ స్పందిస్తూ బాధితులకు వెంటనే రేషన్ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment