రాష్ట్రంలో రెండు కోట్ల మేరకు కుటుంబ కారు్డదారులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నేతృత్వంలోని రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేస్తున్నారు.
► పోరుబాటకు డీఎంకే నిర్ణయం
► నేడు జిల్లాల కార్యదర్శులతో స్టాలిన్ భేటీ
రేషన్ దుకాణాల్లో పామోలిన్, ఉద్ది, కంది పప్పువంటి నిత్యావసర వస్తువుల సరఫరా నిలుపుదలపై డీఎంకే కన్నెర్ర చేసింది. పాలకుల తీరుపై మండి పడుతూ పోరుబాట పట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ జిల్లాల కార్యదర్శులతో సమావేశానికి డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ పిలుపునివ్వడంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో రెండు కోట్ల మేరకు కుటుంబ కార్డుదారులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నేతృత్వంలోని రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేస్తున్నారు. బియ్యం ఉచితంగా, చౌక ధరకే చక్కెర, కంది, ఉద్ది, పామోలిన్, కిరోసిన్ చేస్తున్నారు. బయటి మార్కెట్లో కంటే మరీ తకు్కవగా కంది, ఉద్ది పప్పు ఇక్కడ లభిస్తున్నది. ప్రస్తుతం రేషన్ డిమాండ్‌కు తగ్గ నిత్యావసర వస్తువుల సరఫరాలో పౌరసరఫరాల విభాగం విఫలం కావడం వివాదానికి దారి తీసింది. కేంద్ర ఆహార భద్రతా చటా్టన్ని రాష్ట్రంలోకి ఆహ్వానించిన దృష్ట్యా, తాజాగా, పప్పు ధాన్యాలు, పామోలిన్ పంపిణీకి తగ్గ టెండర్లను పిలవలేని పరిస్థితి. గత వారం రోజులుగా నిత్యావసర వస్తువుల సరఫరా ఆగడంతో పాటుగా బియ్యంకు బ దులు గోధుమ పంపిణీకి మార్చి ఒకటో తేదీ నుంచి అధికారులు చర్యలు తీసుకున్నారన్న సమాచారం కుటుంబ కారు్డదారుల్లో ఆగ్రహాన్ని, ఆందోళన రేపుతోంది.
పాలకుల వైఖరితో రేషన్ సరఫరాలో నెలకొన్న గందరగోళంపై డీఎంకే కన్నెర్ర చేసింది. డీఎంకే నిర్వాహక కార్యదర్శి ఎంకే స్టాలిన్ సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆహార భద్రతా చటా్టన్ని దొడ్డిదారిన ఆహ్వానించిన దోషి శశికళ నేతృత్వంలోని బినామీ ప్రభుత్వం, ఇప్పుడు పేద ప్రజల కడుపు మాడ్చేందుకు సిద్ధం అయిందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం నెలకొన్న గందరగోళానికి, సమస్యకు పరిష్కారం చూపించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరు బాట సాగించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కోర్టు తీరు్పతో దోషులుగా తేలిన వారి జయంతి వేడుకల్లో బిజీ బిజీగా కాలంనెట్టుకు రావడం మానుకుని, రేషన్ కొరతను అధిగమించేందుకు తగ్గ చర్యలు చేపటా్టలని డిమాండ్ చేశారు.
నేడు జిల్లాల కార్యదర్శులతో భేటీ:
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి తెలిసిందే. పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చి అధికార పగ్గాలు తమ గుప్పెట్లోకి తీసుకోవడం లేదా, మళ్లీ ఎన్నికలో్లకి వెళ్లడం లక్ష్యంగా డీఎంకే అడుగులు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాల కార్యదరు్శల భేటీకి స్టాలిన్ పిలుపు నివ్వడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. తేనాం పేటలోని అన్నా అరివాలయంలో జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉదయం పది గంటలకు స్టాలిన్ సమావేశం ప్రారంభం కానుంది. రేషన్ కోత, హైడ్రో కార్బన్, మేఘాధాతులో కర్ణాటక డ్యాం నిర్మాణం, తదితర అంశాలపై చర్చించి ఆందోళన బాటను ఉధృతం చేయడానికి కసరత్తు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.