
నో ప‘రేషన్’!
⇒ యథాతథంగా రేషన్ సరఫరా
⇒ సమ్మెపై డీలర్ల వెనకడుగు.. త్వరలో సమస్యల పరిష్కారం: ఈటల
సాక్షి, హైదరాబాద్:
వినియోగదారులకు ఆగస్టులో రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు సివిల్ సప్లైస్ అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. తమ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1 నుంచి సమ్మెకు వెళ్లాలని రేషన్ డీలర్ల సంఘాలు నిర్ణయిం చడంతో రేషన్‌షాపులు మూతపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మొదలుపెట్టారు. పీడీఎస్ యాక్టు మేరకు నిత్యా వసర సరుకుల పంపిణీని అడ్డుకునే వారి డీలర్ షిప్పులను రద్దు చేసి, వారి స్థానంలో మహిళా సంఘాలకు అప్పజెప్పేందుకు కసరత్తు పూర్తి చేశారు. దీంతో డీలర్లు పునరాలోచనలో పడ్డారు. మొత్తం 17వేల 200 రేషన్ షాపులకు గాను శుక్ర వారం నాటికే 11వేల మంది రేషన్ డీలర్లు ఆగస్టు నెల సరుకులు తీసుకునేందుకు డీడీలు చెల్లించారు. మూడ్రోజుల గడువు ఉండడంతో మిగిలిన డీలర్లు కూడా డీడీలు చెల్లిస్తారన్న ఆశాభావంతో అధికా రులు ఉన్నారు.
సమ్మె వద్దు: రేషన్ డీలర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరిస్తామని పౌరసరఫ రాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సమ్మె విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సచివాలయంలో కమిషనర్ సీవీ ఆనంద్, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపారు.