The Department of Revenue
-
రేషన్ సరుకుల కోసం గ్రామస్తుల ఆందోళన
ప్రకాశం జిల్లా దర్శి మండలం అబ్బాయిపాలెం గ్రామస్తులు రేషన్ సరుకుల కోసం శనివారం ధర్నాకు దిగారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన సరుకులను ఇంతవరకు డీలర్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. 25 ఏళ్లుగా ఉన్న రేషన్ డీలర్‌ను రాజకీయ కారణాలతో తొలగించి నాలుగు నెలల క్రితం ఇరుగు పోల్‌రెడ్డి అనే వ్యక్తికి డీలర్షిప్ అప్పగించారని గ్రామస్తులు అంటున్నారు. కొత్తగా వచ్చిన డీలర్ సరుకులను పంపిణీ చేయకుండా అక్రమంగా విక్రయించుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన రేషన్ కోటా డీలర్‌కు వచ్చిననప్పటికీ వాటిని ఇంతవరకు ఇవ్వలేదని గ్రామస్తులు తెలిపారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా విషయం తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సర్కారు తోటల్లో అక్రమాల చెడుగుడు
ఆ తోటలు ఎవరికీ చెందవని కోర్టు తేల్చి చెప్పింది. సర్కారు ఆధీనంలో ఉంచాలని ఆదేశించింది. పుష్కర కాలం తర్వాత లక్షల విలువైన ఆ తోటలు నరికివేతకు, తరలింపునకు గురవుతున్నాయి. ‘అధికారం మా వెంట ఉంటే.. ఏ తీర్పు ఉన్నా మాకేంటి’ అన్నట్లు కొందరు బడాబాబులు ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. తమ ఆధీనంలోనే ఉన్న వీటిని కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం అధికార ఒత్తిళ్లకు తలొగ్గి మౌనం వహిస్తోంది. స్థానికులు పలుమార్లు చేసిన ఫిర్యాదులు బట్టదాఖలవుతున్నాయి. శ్రీకాకుళం రూరల్ : రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉన్న సుమారు రూ. 50 లక్షల విలువైన సరుగుడు తోటలు అక్రమార్కుల గొడ్డలివేటుకు నేలకూలి కలపగా మారి తరలిపోతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో జరుగుతున్న ఈ దందాను ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సీఆర్‌జెడ్ జోన్లోకి వచ్చే శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని కనుగులవానిపేట, మోపసుబందురు రెవెన్యూ గ్రామాలకు చెందిన సుమారు 30 ఎకరాల అన్సర్వ్డ్ భూములను గతంలో కొందరు ఆక్రమించుకుని, ఫలసాయాన్ని అనుభవించేవారు. అయితే 30 ఎకరాల ప్రభుత్వ భూములను ఒకరిద్దరు మాత్రమే అనుభవించడేమిటి?.. వాటిని పేదలు పంచాలని కోరుతూ ఈ గ్రామాలకు చెందిన పలువురు హైకోర్టును ఆశ్రయించారు. 30 ఏళ్లపాటు ఈ వివాదం కోర్టులో నలిగింది. చివరికి 2002లో హైకోర్టు దీనిపై తీర్పు ప్రకటిస్తూ ఈ భూములపై ఎవరికీ హక్కు లేదని తేల్చి చెప్పింది. సీఆర్‌జెడ్ జోన్లో ఉన్నందున జిల్లా కలెక్టర్‌కు ఈ భూముల సంరక్షణ బాధ్యత అప్పగించింది. అప్పటినుంచి రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉన్న ఈ భూముల్లో పెరిగిన సరుగుడు తోటల ఫలసాయాన్ని 2012లో అప్పటి తహశీల్దార్ ఆధ్వర్యంలో వేలం వేయగా రూ. 29 లక్షలకు పాట ఖరారైంది. మళ్లీ కోర్టుకు.. ఈ తరుణంలో గతంలో ఈ తోటల ఫలసాయాన్ని అనుభవించిన ఆక్రమణదారులు వేలాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు మళ్లీ జోక్యం చేసుకున్న ఖరారైన వేలం పాట అమలు కాకుండా నలిపివేసింది. అయితే భూములపై హక్కును మాత్రం మార్చలేదు. ఆ మేరకు ఈ భూములు, తోటలు రెవెన్యూ ఆధీనంలోనే ఉన్నాయి. కాగా గత నెల రోజులుగా ఈ తోటల్లోని సరుగుడు చెట్లను కొందరు ఆక్రమంగా నరికి, తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈ తోటల విలువ రూ. 50 లక్షలకుపైగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇంత విలువైన ఆస్తి కరిగిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తహశీల్దారుకు, ఆర్డీవోకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని, కనీసం ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసుకున్న పాపాన పోలేదని అంటున్నారు. గత సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్సులో కూడా ఫిర్యాదు చేశామని గ్రామస్తులు చెప్పారు. కొద్దిమంది వ్యక్తులు అధికార పార్టీ అండదండలతో అక్రమంగా నరికి తరలిస్తుంటే చూసి చూడనట్లు వ్యవహరించడం తగదని అంటున్నారు. ఆ తోటలను గ్రామంలో నిరుపేదలకు పంచిపెట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి. ఇంతవరకు రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉన్న తోటలను అధికార పార్టీ నాయకులకు తలొగ్గి అప్పగించడం తగదు. ఇప్పటికైనా చెట్ల నరికివేతను నిలువరించాలి. - కనుగులు జనార్దనరావు, మాజీ ఎంపీటీసీ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి సీఆర్‌జెడ్ జోన్ పరిధిలోని చెట్లను అక్రమంగా నరికి, తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. సుమారు రూ. 50 లక్షల విలువైన ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి. - ఇప్పిలి రామారావు, స్థానికుడు వేలం వేసిన ఆస్తిని తరలిస్తున్నారు గతంలో తహశీల్దార్ ఆధ్వర్యంలో రూ. 29 లక్షలకు వేలం వేసిన ప్రభుత్వ ఆస్తిని అక్రమంగా తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. పలుమారు ఫిర్యాదులు చేసినా స్పందన లేదు. - కనుగుల ఆమ్మాజమ్మ, మాజీ సర్పంచ్ -
ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూములపై సర్వే!
టీఎస్ అవసరానికి వినియోగించకుంటే వెనక్కి హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, గృహనిర్మాణ సంస్థలను ఆదేశించిన ప్రభుత్వం ఈ సంస్థలతోపాటు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోనూ సర్వే హైదరాబాద్: ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను నిర్ణీత వ్యవధిలో సద్వినియోగం చేసుకోని పక్షంలో వాటిని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించింది. తెలంగాణలోని భూములను ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు వివిధ సంస్థలు, పరిశ్రమలు, పర్యాటకాభివృద్ధి, గృహ నిర్మాణ సంస్థల కార్యక్రమాల కోసం కేటాయించారుు. కాగా, ఇలా కేటారుుంచిన భూవుుల్లో నిరుపయోగంగా ఉన్న స్థలాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, పరిశ్రమల మౌలిక సదుపాయల సంస్థ, గృహ నిర్మాణ సంస్థ, పర్యాటక శాఖల ద్వారా ఇచ్చిన భూములపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గత ప్రభుత్వాలు తెలంగాణలో నేరుగానే 16వేల ఎకరాలకుపైగా భూమిని వివిధ సంస్థలకు కేటాయించినట్లు సమాచారం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం కేటాయించిన ఆ భూవుులను నిజంగానే నిర్దేశిత అవసరాలకే వినియోగిస్తున్నారా? లేక ఏదైనా ఇతరత్రా వాటికి వినియోగిస్తున్నారా? వృథాగా ఉ న్నాయా? అన్న అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రాం తాలనుంచి పూర్తి సవూచారాన్ని తెప్పించుకుంటున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే ఎపీ ఎన్జీవోలు, ఎపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు కేటారుుంచిన స్థలాలను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖ తాజాగా ఇలాంటి భూములపై సర్వే చేపట్టింది. నిర్దేశిత లక్ష్యం మేరకు భూవుులను వినియోగించని వారికి నోటీసులు జారీ చేస్తూ.. ఆ భూములను స్వాధీనం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇదే విధానాన్ని హెచ్ఎండీఏ, టీఎస్ ఐఐసీ, పర్యాటక శాఖలు కూడా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి కోసం పలు సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. అందులో దాదాపు 90 శాతం మేరకు సంబంధిత సంస్థలు కనీసం పనులు కూడా మొదలుపెట్టలేదని అందువల్ల అలాంటి సంస్థల నుంచి భూములు వెనక్కి తీసుకోవాలని రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. తవు సర్వేలో నిరుపయోగంగా ఉన్నట్టు తేలిన భూముల వివరాలను సంబంధిత శాఖలకు కూడా పంపిస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఇలాంటి భూవుులను వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. -
అత్యవసర పనులు చేయాల్సిందే
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో రెవెన్యూ శాఖ పనులతోపాటు ఇతర అత్యవసర పనులూ చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పన్ను వసూలు, బీఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటు, ప్రభుత్వ, దేవాలయ భూములు, రైతు రుణాల రీషెడ్యూల్, రైతు ఆత్మహత్యలకు సంబంధించిన నివేదికలు, నాలా పన్ను, పారిశ్రామిక పార్కులకు భూముల గుర్తింపు, రెవెన్యూ కార్యాలయ భవనాల మరమ్మతు, నిర్మాణాలు, కోర్టు కేసు లు వంటి అంశాలపై చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూకు సంబంధించి వివిధ పనులకు వీఆర్వో, పంచాయతీ కార్యదర్శుల సహకారం తీసుకోవాలన్నారు. బీఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వ భూములు గుర్తించాలని చెప్పారు. దేవాలయ భూములు దేవాదాయశాఖ ఆధీనంలోనే ఉండాలన్నారు. ఇందుకు దేవాలయం పేరిట నిబంధనల ప్రకారం పట్టాలు ఇవ్వాలని చెప్పారు. జిల్లాలోని 39 మండలాల్లో మార్చిలో రైతులు తీసుకున్న పంట రుణాల రీషెడ్యూల్కు రిజర్వు బ్యాంకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. 2014 మార్చి 31 నాటికి బ్యాంకుల్లో అప్పు ఉన్న రైతులకు ఇది వర్తిస్తుందన్నారు. జిల్లాలో జమాబందీని వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పారిశ్రామిక సంస్థలకు పది వేల ఎకరాలు జిల్లాలో పారిశ్రామిక సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వ భూములు 10 వేల ఎకరాల గుర్తించాలని, ఇందుకు రెవె న్యూ అధికారులు సర్వే చేసి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కోర్టు కేసులపై పూర్తి నివేదికలు సమర్పించాలని, కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలన్నారు. సమావేశంలో అదనపు జేసీ రాజు, సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్, డీఆర్వో ప్రసాదరావు, ఆర్డీవోలు అరుణశ్రీ, సుధాకర్‌రెడ్డి, రామచంద్రయ్య, అయేషామస్రత్ ఖానమ్, ఎల్డీఎం.శర్మ, తహశీల్దార్లు పాల్గొన్నారు. ‘బతుకమ్మ’ విజయవంతం చేయండి ఆదిలాబాద్ టౌన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగను విజయవంతం చేయాలని కలెక్టర్ జగన్మోహన్ కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బంగారు బతుకమ్మ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగకు అన్ని వసతులు కల్పించడానికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఆనంతరం జాగృతి రాష్ట్ర కార్యదర్శి ఎన్.రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టంలో మొదటిసారిగా బతుకమ్మ పండుగను ప్రభుత్వ పరంగా నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. బతుకమ్మ పండగకు సహజ సిద్ధమైన పూలనే వాడాలని అన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సాహెబ్రావు, విలాస్‌గౌడ్, సుజాత, మీరా, జ్యోతి, కాంచన, అంజనదేవి, అరుణ, అనంద్‌రావు, శ్రీనివాస్, అనిల్, దేవన్న, రాంరెడ్డి, ఖలీల్, ఆనంద్‌రావు, మంజుషా తదితరులు పాల్గొన్నారు.