ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూములపై సర్వే! | Been given to private companies in the survey! | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూములపై సర్వే!

Published Thu, Oct 16 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

Been given to private companies in the survey!

టీఎస్ అవసరానికి వినియోగించకుంటే వెనక్కి
హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ, గృహనిర్మాణ సంస్థలను ఆదేశించిన ప్రభుత్వం
ఈ సంస్థలతోపాటు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోనూ సర్వే

 
హైదరాబాద్: ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను నిర్ణీత వ్యవధిలో సద్వినియోగం చేసుకోని పక్షంలో వాటిని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించింది. తెలంగాణలోని భూములను ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు వివిధ సంస్థలు, పరిశ్రమలు, పర్యాటకాభివృద్ధి, గృహ నిర్మాణ సంస్థల కార్యక్రమాల కోసం కేటాయించారుు. కాగా, ఇలా కేటారుుంచిన భూవుుల్లో నిరుపయోగంగా ఉన్న స్థలాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఈ నేపథ్యంలో  హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, పరిశ్రమల మౌలిక సదుపాయల సంస్థ, గృహ నిర్మాణ సంస్థ, పర్యాటక శాఖల ద్వారా ఇచ్చిన భూములపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గత ప్రభుత్వాలు తెలంగాణలో నేరుగానే 16వేల ఎకరాలకుపైగా భూమిని వివిధ సంస్థలకు కేటాయించినట్లు సమాచారం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం కేటాయించిన ఆ భూవుులను నిజంగానే నిర్దేశిత అవసరాలకే వినియోగిస్తున్నారా? లేక ఏదైనా ఇతరత్రా వాటికి వినియోగిస్తున్నారా? వృథాగా ఉ న్నాయా? అన్న అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రాం తాలనుంచి పూర్తి సవూచారాన్ని తెప్పించుకుంటున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే ఎపీ ఎన్జీవోలు, ఎపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు కేటారుుంచిన స్థలాలను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖ తాజాగా ఇలాంటి భూములపై సర్వే చేపట్టింది.

నిర్దేశిత లక్ష్యం మేరకు భూవుులను వినియోగించని వారికి నోటీసులు జారీ చేస్తూ.. ఆ భూములను స్వాధీనం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇదే విధానాన్ని హెచ్‌ఎండీఏ, టీఎస్ ఐఐసీ, పర్యాటక శాఖలు కూడా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి కోసం పలు సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. అందులో దాదాపు 90 శాతం మేరకు సంబంధిత సంస్థలు కనీసం పనులు కూడా మొదలుపెట్టలేదని అందువల్ల అలాంటి సంస్థల నుంచి భూములు వెనక్కి తీసుకోవాలని రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది.  తవు సర్వేలో నిరుపయోగంగా ఉన్నట్టు తేలిన భూముల వివరాలను సంబంధిత శాఖలకు కూడా పంపిస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఇలాంటి భూవుులను వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement